Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మొగోడు అంటే… తోపు, తురుం, పహెల్వాన్, తీస్‌మార్‌ఖాన్…

March 4, 2024 by M S R

నిజానికి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఈ నీచమైన వ్యాఖ్య మీద రావల్సినంత వ్యతిరేకత కూడా ఎందుకు రాలేదో అర్థం కాలేదు… నిన్న సాయంత్రమే ఈవినింగ్ డైనమిక్ ఎడిషన్‌లో ఈ వ్యాఖ్య చదివాక డౌటొచ్చింది… ఒక ప్రజాప్రతినిధి, ప్రజాాజీవితంలో ఉన్నవాడు ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తాడా అనేది సందేహం…

కానీ తను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఖండించలేదు… మరికొన్ని పత్రికల్లోనూ ఆ వ్యాఖ్యలు చేసినట్టుగానే వార్తలున్నయ్… అప్పుడు అనిపించింది మన సొసైటీ ఇలాంటి వ్యాఖ్యలకు స్పందించడం మానేసేంత ఇమ్యూనిటీ వచ్చిందా అని..!

వోకే, తనను బీజేఎల్పీ నేతగా ఎన్నుకోలేదు… సో వాట్..? లోకసభకు పోటీచేయాలనుకున్నాడు, పార్టీ వద్దన్నది… సో వాట్..? విరించి హాస్పిటల్స్ అధినేత మాధవికి టికెట్టు ఇచ్చింది… సో వాట్..? తన అసంతృప్తిని వ్యక్తీకరించడానికి మొత్తం మహిళలనే కించపరిచే వ్యాఖ్యలు చేయాలా..?

Ads

rajasingh

ఆమె కొన్నాళ్లుగా ప్రచారం చేసుకుంటోంది… తను రాజకీయాల్లోకి వస్తున్నట్టు హింట్స్ ఇస్తోంది… కాకపోతే కొన్ని విచిత్ర వ్యాఖ్యానాలు కూడా చేస్తోంది, అది డిఫరెంటు… ఆమె అభ్యర్థిత్వం పట్ల బీజేపీ అభిమానుల్లోనే భిన్నాభిప్రాయలున్నయ్… ఆ చర్చ వేరు… బీజేపీ కూడా వర్క్ చేసుకోవాలని ముందే హింట్స్ ఇచ్చింది తనకు… అందుకే యూట్యూబుల్లో ఇంటర్వ్యూలతో హడావుడి చేస్తోంది కొంతకాలంగా… జనంలో ఉంటోంది… అది ఆమె ఇష్టం… ఆమెకు టికెట్టు ఎందుకు ఇవ్వాలో బీజేపీ హైకమాండ్‌కూ ఓ జస్టిఫికేషన్, ఓ వాదన ఉంటయ్…

ఐనంతమాత్రాన ఆ సీటులో పోటీకి మొగాడే దొరకలేదా అనే చిల్లర వ్యాఖ్య దేనికి..? ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తను తత్వం ఏమిటో జనం ఎదుట ఆవిష్కరించుకోవడమా..? అసలు మొగాడు అంటే నిర్వచనం ఏమిటి రాజాసింగ్..? తోపు అనేనా నీ భావన..? అంటే ఇలాంటి పోటీలకు మహిళలలు పనికిరారా..? పురుషులకు దీటుగా ఎదగడానికి ఇంకా ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్న స్త్రీలను ఇది కించపరచడం కాదా..? వివక్షాపూరిత వ్యాఖ్యలు అనే పెద్ద పదం దాకా అవసరం లేదు…

చాన్నాళ్లు రాజాసింగ్ సస్పెన్షన్‌లో ఉన్నాడు… అప్పుడప్పుడూ తన వ్యాఖ్యలతో వివాదాలకు తెరతీస్తూనే ఉన్నాడు… తెలంగాణ బీజేపీలో ప్రముఖులతో తనకు పడదు… సమన్వయం లేదు… సరే, అదంతా పార్టీ అంతర్గత విషయం అనుకుందాం… కానీ ‘మొగాడే దొరకలేదా..?’ అనే వ్యాఖ్య పార్టీగతం కాదు, వ్యక్తిగతం… సంస్కారరాహిత్యం… అసలు తనను బీజేపీ ఎలా సహిస్తోంది..? ఇలాంటి వ్యాఖ్యలపై కనీసం తన నుంచి వివరణ కోరాలి కదా… రేప్పొద్దున ఇలాంటి నేతల నుంచి అభ్యర్థి మాధవి ఏ సాయం తీసుకోగలదు..? ఇదంతా పార్టీకి ఎలా ఉపయోగకరం..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తక్కువ మంది అతిథులతో పెళ్లి… ఆశీస్సులు, పలకరింపులు, మర్యాదలు…
  • అసలే వాణిశ్రీ… పైగా చిరంజీవి… విజయశాంతీ ఉండనే ఉంది… ఇంకేం..?!
  • దృశ్యం-3… రాంబాబు మార్క్ ‘ట్విస్ట్’… అడుగు దూరంలో అసలు క్లైమాక్స్!!
  • ఏరు దాటాక బోడి మల్లన్న… ఇది పవర్ లిఫ్టర్ ప్రగతి మరో మొహం…
  • అక్రమాల తిరుమల చీకట్లలో… ఒకటీఅరా మంచి నిర్ణయాలు… ఇలా…
  • బీఆర్ఎస్‌కు పార్టీ విరాళాల్లో భారీ క్షీణత… ఇది దేనికి సంకేతం..?!
  • ఎవరేం తక్కువ..? శివాజీ సామాను రచ్చ కాస్తా పెద్ది చికిరి పాట వైపు మళ్లింది…!
  • Delhi pollution triggered allergies… Here is an Innovative Treatment
  • కేసీయార్‌పైకే ‘ఉల్టా వాటర్ వార్’… నిజాలన్నీ బయటపడుతున్నయ్….
  • నైనర్ నాగేంద్రన్… సైలెంటుగా తమిళ బీజేపీకి జవజీవాలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions