Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!

June 2, 2025 by M S R

.

రాజేంద్ర ప్రసాద్ అలా మాట్లాడకపోతేనే వార్త… ఈమధ్య ఎవరు అతిథిగా పిలిచినా సరే వెళ్లి, ఏదేదో మాట్లాడుతున్నాడు… ఏదో అయ్యింది తనకు… అందుకే తేడా కొడుతోంది…

రాను రాను ఎవరు తనల్ని ఏ ఫంక్షన్‌కు పిలవాలన్నా సరే ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాలి, లేదా ఏదో ఓరకంగా పిచ్చి కూతలతోనైనా ప్రచారం తీసుకువస్తున్నాడు కదా అనుకుంటే తప్ప…

Ads

తనొక మంచి వక్తను అనే భ్రమల్లో బతుకుతున్నాడు ఫాఫం… అయిదు తరాల నటులతో పనిచేశాను, ఆఫ్టరాల్ వీళ్లంతా ఎంత అనే యాటిట్యూడ్ భీకరంగా కనిపిస్తోంది… కానీ తన నాలుక మీద తనకు అదుపు లేదని.,. ఫ్లోలో సిగ్గూశరం, సంస్కారం, హుందాతనం, పెద్దరికం, వయస్సు అన్నీ మరిచిపోతున్నాననే సోయి లేదు తనకు…

తనేం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాదు… అంత పొంతన లేకుండా ఉంటాయి వాక్యాలు… ఎటు నుంచి ఎటు పోతున్నాడో తెలియదు… తను చెప్పదలుచుకున్నది సూటిగా, అర్థమయ్యేలా చెప్పడం చేతకాని అవస్థ ఇది…

ఆమధ్య ఏదో ఫంక్షన్‌లో (హరికథ వెబ్ సీరీస్) మాట్లాడుతూ బన్నీని కించపరిచేలా ఇప్పుడు చందనం దొంగలు హీరోలు అన్నాడు… సరే, తన పాజిటివ్ పాత్రను హైలైట్ చేసుకోవడానికి ఇప్పటి నెగెటివ్ హీరో పాత్రలను కంట్రాస్టుగా ఏదో చెప్పబోయి, అది సరిగ్గా చెప్పలేక బోల్తాకొట్టాడు అనుకుందాం…

క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి ఓ బూతు వదిలాడు… కుసంస్కారి… తరువాత అందరూ బూతులు తిట్టేసరికి లెంపలేసుకుని, నాలుక కర్చుకుని సారీ చెప్పాడు… ఏం మనిషో… ఇప్పుడు మళ్లీ…

ఎస్వీ కృష్ణారెడ్డి బాపతు ఏదో ఫంక్షన్‌లో కమెడియన్ ఆలీని ఉద్దేశించి రాయడానికి వీల్లేని బూతు వదిలాడు… ఎంత చనువు ఉన్నా, ప్రైవేటుగా మాట్లాడుకుంటున్నప్పుడో, మందు కొట్టినప్పుడో ఎవరు ఏమని పిలుచుకున్నా అది వేరు… కానీ బహిరంగంగా, వేదికల మీద మాట్లాడేటప్పుడు కాస్త డీసెన్సీ, సంస్కారం గట్రా అవసరం… అది లోపించింది ఈ మనిషిలో…

ఫాఫం ఆలీ ఏమీ అనలేడు, అక్కడికి వచ్చినవాళ్లు కూడా విస్తుపోయారు… ఒరేయ్, ఏం కూతలురా అని అనలేరు కదా… ఏమో, టీవీ చానెళ్లు, ఇతర మీడియా రాజేంద్ర ప్రసాద్ బూతుల మీద నెగెటివ్‌గా రియాక్టయి అసలు ఏం మనిషి అతను అన్నట్టుగా రాస్తున్నారు కదా… రేపోమాపో మరో వీడియో రిలీజ్ చేస్తూ సారీ చెబుతాడేమో…

అడుసు తొక్కుతూనే ఉంటాడు, కాళ్లు కడుగుతూనే ఉంటాడు… ఆ తోక ఎప్పుడూ వంకరే… ఎవరో తిక్కరేగి, అక్కడే, ఆ వేదిక మీదే ఉగ్రరూపం దాల్చి ఏమైనా తీవ్ర స్పందన కనబరిచేవరకూ తను అంతేనేమో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహో… కమలహాసన్ తాజా సంకుచితత్వం వెనుక అదా కథ…!?
  • వీడొక యాదవ సాంబుడు..! లాలూ చెప్పే డొల్ల కుటుంబ విలువలు..!!
  • ఆ చిన్నారులు… ప్రపంచ సుందరిని కలిసిన తరువాత… ఛ, దుర్విధి…
  • ప్రేమతిట్ల సీజన్… మీ దుంపల్‌తెగ… మీరెక్కడ తయారయ్యార్రా బాబూ…
  • ప్రపంచ సుందరికి అయోధ్య సందర్శన అభిలాష… ఓ నేపథ్యం…
  • అధికారంలో ఉంటేనే అవతరణ దినోత్సవాలా కేసీయార్ సాబ్..?!
  • పోలీసులది క్రౌర్యమే, తప్పే… మరి రౌడీ షీటర్లకు రాజకీయ ఓదార్పు..!?
  • ప్రపంచంలోకెల్లా ‘అత్యంత విలువైన’ కూరగాయ… జస్ట్, సొరకాయ..!
  • అన్ని సినిమాల్లోలాగే… పొలిటిషియన్సే విలన్లు… ఎదిరించేవాడే హీరో…
  • మాస్టర్లందరూ కలిసి వండిన ఓ మాస్టర్ పీస్.. ఇద్దరు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions