Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లో రేవంత్ తీవ్ర ఆరోపణలు… నిజంగానే రకుల్ బ్రదర్ చిక్కాడు…

July 15, 2024 by M S R

‘‘BRS అధికారం కోల్పోగానే డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు. రకుల్ ప్రీత్ సింగ్ (Heroine Rakul Preet Singh) సోదరుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడింది.

సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్‌ డివిజన్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు ఉన్నారు. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌సింగ్‌‌ (Aman Singh) డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కాడు…

కాగా… BRS పార్టీ అధికారం లో ఉండగా గతంలో డ్రగ్స్‌ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆరోపణలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరాపై పక్కా సమాచారంతో నార్కోటిక్ బ్యూరో, ఎస్వోటీ, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించారు. దాదాపు 200 గ్రాములకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పలువురు వీఐపీలకు కూడా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు…’’

Ads

rakul

ఇదీ వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో కనిపించిన వార్త… చెక్ చేస్తే అప్పుడే జాతీయ మీడియా కూడా అలర్టయిపోయి ఈ వార్తను ఫ్లాష్ చేస్తున్నట్టు కనిపించింది… రకుల్ పాపులర్ నటి కావడం ఒక కారణం కాగా… అప్పట్లో తెలంగాణ ప్రముఖనేతతో లింక్ చేస్తూ ఆరోపణలుండేవి… సీఎం రేవంత్‌రెడ్డి కూడా అప్పట్లో ఆమె పేరును తీసుకుని మరీ వెటకారంగా విమర్శలు చేసేవాడు…

పైన వార్తలో కూడా చూడండి… బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే అడ్డంగా దొరికిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అని వార్త మొదలుపెట్టాడు విలేకరి… అందులోనే అంతా ఉంది… ఇన్నేళ్లూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కారణంగానే పట్టుబడలేదు అని…!

rakul

ఇదీ అప్పట్లో ఓ పాపులర్ వెబ్ సైట్ రేవంత్, కేటీయార్ వివాదం మీద పెట్టిన థంబ్ నెయిల్… కేటీయార్ – డ్రగ్స్- రకుల్ ప్రీత్ సింగ్ ఇష్యూల  మీద రేవంత్ రెడ్డి అప్పట్లో బాగా ఆరోపణలు చేసేవాడు… దాని మీద కేటీయార్ పరువు నష్టం నోటీసు కూడా పంపించాడు… కోర్టుకెక్కాడు… చాన్నాళ్లు రాజకీయంగా రచ్చ నడిచింది…

వివాదం కోర్టు దాకా వెళ్లినా, రేవంత్ రెడ్డి మళ్లీ మళ్లీ స్పందిస్తూ… డ్రగ్స్‌తో, రకుల్‌ ప్రీత్ సింగ్‌తో సంబంధం లేకుంటే కేటీఆర్‌ కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నాడంటూ ప్రశ్నించాడు… ఇప్పుడు మళ్లీ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు స్వయంగా డ్రగ్స్‌ కొనుగోలు చేస్తూ పట్టుబడటం, పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేయడంతో మళ్లీ కలకలం మొదలైంది… రేవంత్ రెడ్డి ఈ విషయంపై ఇంకా ఏమీ స్పందించినట్టు లేదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions