‘‘అయోధ్యలో రామాలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది… అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోరుకున్న ప్రజలకు, గుడి నిర్మాణానికి ప్రయత్నించిన వారికి నా అభినందనలు…. దేశంలో వర్గాల నడుమ సోదరభావం తగ్గిపోతోంది… అది పునరుద్ధరించాల్సిన అవసరం కనిపిస్తోంది…
రాముడు కేవలం హిందువుల దేవుడు మాత్రమే కాదు, ప్రపంచ ప్రజలందరి దేవుడు… అదే నేను ఈ దేశ ప్రజలందరికీ చెప్పాలని అనుకుంటున్నది… అందరికీ దేవుడని పుస్తకాల్లో రాసి ఉన్నదే నేను చెబుతున్నాను… రాముడు ప్రజలందరి నడుమ సోదరభావమే కాదు, ఐక్యత, ప్రేమ, పరస్పర సహకారాన్ని బోధించాడు…
మతం, జాతి, వర్గాలకు అతీతంగా అణగారిన వర్గాల ఉన్నతి కోసమే రాముడి పాలన సాగింది… ప్రపంచానికే ఆ పాలన ఓ సంకేతం… ఇప్పుడు తన గుడి సిద్ధమైంది… ప్రారంభించబడుతోంది… ఈ సందర్భంగా మన దేశంలోని వర్గాల నడుమ రాముడు కోరిన ఆ సోదరభావం పెరగాలనేది నా ఆకాంక్ష… ప్రజలకు నా పిలుపు కూడా…’’
Ads
….. ఇది సీపీఎం సీతారాం ఏచూరి వ్యాఖ్య కాదు… అసలు తనకు అసలైన లౌకికవాదానికి అర్థమే తెలియదు… జాతి అంతా ఒకవైపు… ఈ మార్క్సిస్టులు మరోవైపు… అదే వాళ్లకు చైనా సూచించిన మార్గం… అందుకే జాతి దేశవ్యాప్తంగా వాళ్లను ఛీత్కరించి దూరం పెడుతోంది… తనే కాదు, సోకాల్డ్ పొలిటికల్ సూడో సెక్యులరిస్టులందరూ ఇదే మాట… పైన వ్యాఖ్యలన్నీ ఫరూక్ అబ్దుల్లావి…
సోనియా రాముడి ప్రాణప్రతిష్టకు వెళ్తుందా..? వెళ్లదా అని బోలెడన్ని వార్తలు… ఆమెను ఈ జాతి ఇంటి కోడలుగా స్వీకరించింది… క్రిస్టియానిటీని పాటించే కుటుంబమే అయినా అయోధ్య రామాలయ ట్రస్టు ఆమెనూ ఆహ్వానించింది… ఎన్నికలు రాగానే గంగాస్నానాలు, జంధ్యాధారణలు, ఆలయ సందర్శనలు కాదు… ఇదుగో జాతి మొత్తం స్వాగతిస్తున్న సందర్భంలో వాళ్లూ హాజరవ్వాలి…
బాలరాముడిని ఈ జనవరి 22న ప్రతిష్టించబోతున్న ఈ సందర్భాన్ని బీజేపీ వాడుకుంటోంది… మత ఉద్రిక్తతల్ని పెంచడానికి ప్రయత్నిస్తోంది అంటాడు ఏచూరి… అవన్నీ అయిపోయాయి సీతా‘రాముడా’… ఓ భవ్యమైన ఆలయం నిర్మితమవుతోంది… పది నుంచి పదిహేను వేల మందికి మాత్రమే ఏర్పాట్లు చేస్తున్నారు… వాళ్లంతా బీజేపీ వాళ్లు కాదు… భిన్న పరంపరలకు చెందిన 4 వేల మంది సాధుసంతులు కూడా ఉన్నారు ఆహ్వానితుల్లో…
సినిమా, కళారంగాల ప్రముఖులే గాకుండా భిన్నరంగాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్నవాళ్లనూ పిలుస్తున్నారు… దీన్ని అవాయిడ్ చేస్తే జాతికి ఓ తప్పుడు సంకేతం ఇచ్చినట్టవుతుంది… అది బీజేపీకే అధిక ప్రయోజకరం అవుతుంది… రాముడు బీజేపీ మనిషి కాదు, రాముడు అందరి బంధువు, ఆ స్పూర్తిని అర్థం చేసుకుంటే అది సరైన లౌకికత… నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా మాటలు అదే తోవలో సాదరధోరణిలో ఉన్నాయి…
వారణాసికి చెందిన లక్ష్మికాంత్ దీక్షిత్ ఈ ప్రాణప్రతిష్ట మొత్తం తంతును పర్యవేక్షిస్తున్నాడు… జనవరి 14 నుంచి ఈ ప్రాణప్రతిష్ట జరిగే 22 వరకు అమృత మహోత్సవ్ నిర్వహించనున్నారు… 1008 హోమగుండాల మహాయజ్ఞం కూడా నిర్వహించబడుతుంది.., దీనిలో వేలాది మంది భక్తులకు అన్నదానం చేస్తారు… అయోధ్యలో వేలాది మంది భక్తులకు వసతి కల్పించడానికి అనేక డేరా నగరాలు నిర్మించబడుతున్నాయి… అసలు మోడీ కాదు, ఈ బృహత్తర కార్యక్రమ బాధ్యతల్ని పైన వేసుకుని ప్రయాసపడుతున్న యోగి అదృష్టవంతుడు…!!
Share this Article