మన తెలుగు హీరోల్లో దగ్గుబాటి రానా కాస్త డిఫరెంటుగా కనిపిస్తాడు… ప్రవర్తన కూడా హుందాగా ఉంటుంది, చిల్లరతనం కనిపించదు… ఆమధ్య విరాటపర్వం సినిమా ప్రమోషన్ సమయంలో వేలాది మంది ఎదుట, వేదిక మీద, చినుకులు పడుతుంటే, సాయిపల్లవికి గొడుగు పట్టిన తీరే తనను మెచ్చుకునేలా చేసింది… చిల్లర హీరోలే భారీ ఫోజులు కొట్టే ఇండస్ట్రీ మనది… అలాంటిది అంతటి సురేష్ ప్రొడక్షన్స్ వారసుడు, స్వయంగా హీరో… ఏమాత్రం ఇగో లేకుండా తోటి నటికి ఇబ్బంది కలగకుండా ఓసారి బౌన్సర్‌లాగా కూడా వ్యవహరించాడు… ఇగో లేకుండా ఇండస్ట్రీలో ఉండటం చాలా టఫ్ టాస్క్…
ఇప్పుడు ఇదంతా మళ్లీ ఎందుకు చెప్పుకోవడం అంటే… తను తిరుమల వెళ్లాడు… తండ్రి ఉన్నాడు… భార్య మిహికా బజాజ్ కూడా వెంట ఉంది… దర్శనం అనంతరం బయటికి వచ్చాడు… తిరుమలలో ఓ పాడు అలవాటు ఉంది కదా… టీటీడీ ఏమీ పట్టించుకోదు, ఆ పెద్దలకు ఏ సోయీ ఉండదు… ఫ్యాన్స్ సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు… సెలబ్రిటీలు ఫోటోషూట్ చేస్తుంటారు… విలేఖర్లు గొట్టాలు తెచ్చి మూతుల ముందు పెట్టేస్తారు… కెమెరాలు ఆన్‌లో ఉంటాయి…
సెలబ్రిటీలు నోటికొచ్చిన నీతులన్నీ చెబుతారు… తాము ఇక్కడికి వచ్చింది దేవుడి దర్శనానికి, కనీసం ఇక్కడైనా కాస్త లోకాన్ని మరిచి, కాసేపైనా దేవుడిని స్మరిస్తూ ఈ సెల్ఫీలు, మీడియా మీట్లు అవాయిడ్ చేయొచ్చుగా… లేదు, పుణ్యానికి వచ్చిన పబ్లిసిటీ అనుకుని ఇంకాస్త ఎక్కువ మాట్లాడతారు… ఇక రాజకీయ నాయకులైతే చెప్పనక్కరలేదు… అసలు శ్రీవారి ఆవరణలోకి ఏ రాజకీయ నాయకుడు వచ్చిపోయినా శుద్ధి చేయడం బెటరేమో… మంత్రులయితే వందలాది మందిని తీసుకురావడం, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక మర్యాదలు… పైగా మీడియాతో అవాకులు, చెవాకులు…
Ads
ఇప్పటి విషయానికొస్తే… దగ్గుబాటి రానా దర్శనం తర్వాత చకచకా నడుస్తూ తమ వాహనాల వైపు వెళ్తున్నాడు… ఈలోపు ఎవరో ఫ్యాన్ సెల్ఫీ కోసం ప్రయత్నించాడు… రానా వెంటనే తన చేతిలో మొబైల్‌ను లాగేసుకున్నాడు… అఫ్‌కోర్స్, మళ్లీ ఇచ్చేసి, మందలించాడు… గుళ్లో చేయకూడదమ్మా ఇలాంటివి అన్నాడు… గుడ్… ఈ సోయి మిగతా సెలబ్రిటీలకు ఎందుకు ఉండదు..? ఓ పవిత్రస్థలిలో నిలబడి, మురికి ముచ్చట్లు పెట్టకూడదనే తెలివి ఎందుకు ఉండదు..? అఫ్‌కోర్స్ అసలు తప్పు అక్కడ మీడియాది ప్లస్ వీలైనంతగా గుడి వాతావరణాన్ని భ్రష్టుపట్టించే టీటీడీది… వాళ్లకు ఎలాగూ లేదు కదా, కనీసం సెలబ్రిటీలకైనా సొంత విచక్షణ అంటూ ఏడవాలి కదా… అందుకే రానా భేష్…
ఆ వీడియో కావాలంటే దిగువన ఉన్న ట్వీట్‌లో చూడొచ్చు… తమిళ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు ఇలాంటివి వెంటనే పట్టుకుని అభినందిస్తాయి… మన మీడియాకు ఆ పని కూడా చేతకాదు…
ரசிகரின் செல்போனை பிடிங்கிய நடிகர் ராணா!#RanaDaggubati |#Tirumala pic.twitter.com/M6HXF8pgEh
— Tamil Diary (@TamildiaryIn) September 15, 2022
Share this Article