రష్మిక తెలివైందో, తిక్కదో అర్థం కాదు కొన్నిసార్లు… తన పిచ్చి వ్యాఖ్యలతో కన్నడ ఇండస్ట్రీకి శత్రువుగా మారిపోయింది… ఎంత కవర్ చేసినా కావడం లేదు… నిజానికి తన వ్యాఖ్యలతో తనకొచ్చే ఫాయిదా కూడా ఏమీ లేదు… తీట..!
పెటాకులైన తన పెళ్లి నిశ్చితార్థం గురించి పదే పదే రక్షిత్ శెట్టి మీద రగిలిపోతూ, మొత్తం తన ఫ్రెండ్స్ గ్యాంగు మీద కక్షపెట్టుకుని… రక్షిత్ దోస్త్ రిషబ్ తీసిన కాంతార మీద అమర్యాదను కనబరిచింది… నిజానికి అనవసరం… ఒకవైపు కన్నడ సమాజం మొత్తం ఆ సినిమాను నెత్తిన పెట్టుకుని ఆదరిస్తుంటే… తమ మాజీ దోస్తుల్ని వెక్కిరిస్తూ వ్యాఖ్యలకు పూనుకుంది…
సహజంగానే కన్నడ సమాజం ఆమెను డిస్‌ఓన్ చేసుకోవడం ప్రారంభించింది… ఆమె నటించిన వారసుడు సినిమాను కన్నడనాట బహిష్కరిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన సీరియస్‌గానే ఉంది… తరువాత ఏదో కవరింగు ప్రయత్నాలు చేసినా సరే, పెద్దగా గ్యాప్ పూడలేదు… తరువాత ఏదో ఇంటర్వ్యూలో తనకు లైఫ్ ఇచ్చిన కిరిక్ పార్టీ బ్యానర్‌ను ఉద్దేశించి తిక్క సైగలతో ఇన్‌డైరెక్ట్‌గా ఇన్‌సల్ట్ చేసింది…
Ads
తన ఏరియా మంగుళూరు… తనకు లైఫ్ ఇచ్చింది రిషబ్, రక్షిత్ వంటి అప్పటి ఫ్రెండ్స్… ఆ తరువాతే తెలుగు, తమిళం, హిందీ ఎట్సెట్రా… కానీ రూట్స్ మరిచిపోతే ఎలా..? సరే, ఇదంతా అయిపోయిందా..? ఇప్పుడు మరో పిచ్చి కామెంట్… ‘‘కొన్ని అంశాల్లో మన సౌత్ సినిమాలకన్నా హిందీ సినిమాలే బెటర్… ప్రత్యేకించి పాటలు… సౌత్ సినిమా పాటల మాస్‌గా, మసాలా నిండి ఉంటాయి… కానీ హిందీ పాటలు మాత్రం రొమాంటిక్‌గా ఉండి అలరిస్తాయి’’…
అసలే సౌత్ సినిమాలు హిందీలో దున్నేస్తున్నాయి… సౌత్ సినిమాల్ని చూసి నేర్చుకోవాలనే చర్చ బాలీవుడ్ సర్కిళ్లలో సాగుతోంది… ఈ స్థితిలో సౌత్ సినిమాను డిస్‌ఓన్ చేసుకుంటూ హిందీ పాటలు బాగుంటయ్ అనే స్టేట్‌మెంట్ ఇప్పుడు అవసరమా తనకు..?
పుష్పతో హిందీ మార్కెట్‌కు పరిచయమైంది… వారసుడితో పరిచయం పెరుగుతుంది… పుష్ప-2తో ఇంకా పెరుగుతుంది… అంతేకాదు, నేరుగానే రెండు సినిమాలు చేస్తోంది హిందీలో… 1) మిషన్ మజ్ను… సిద్ధార్థ మల్షాత్రాతో నటిస్తున్న స్పై థ్రిల్లర్… రబ్బా జండా అని ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు… 2) యానిమల్… ఇది మన వంగ సందీప్‌రెడ్డి తీస్తున్న సినిమా… రణబీర్‌కపూర్, పరిణీతి చోప్రా, అనిల్ కపూర్, బాబీ డియోల్ కూడా ఉన్న సినిమా…
మరి హిందీలో అవకాశాల కోసం వెంపర్లాట… వారసుడు, పుష్ప-2, యానిమల్, మిషన్ మజ్ను మాత్రమే కాదు… ఇంకా కావాలి తనకు… అందుకే హిందీ సినిమాల మీద పాజిటివ్ కామెంట్స్ పాస్ చేస్తోంది… కానీ హిందీ జనం తిప్పికొడితే మళ్లీ అక్కున చేర్చుకునేది తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలే… ఆ సోయి ఉన్నట్టు లేదు పిల్లకు… హిందీ సినిమాల గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడితే ప్రేమతో అలుముకునే సహృదయత ఏమీ ఉండదు ఫిలిమ్ ఇండస్ట్రీలో…
RASHMIKA MANDANNA SPOKE ABOUT WHAT SHE THINKS OF BOLLYWOOD ROMANTIC SONGS! #ZOOMTV #RASHMIKAMANDANNA #SIDHARTHMALHOTRA #MISSIONMAJNU #ENTERTAINMENT #BOLLYWOOD PIC.TWITTER.COM/ECTQUDZX9F
— @ZOOMTV (@ZOOMTV) DECEMBER 26, 2022
నిజానికి అమితాబ్ బచ్చన్, నీనాగుప్తాలతోపాటు నటించిన మొదటి హిందీ సినిమా గుడ్‌బై తనకు పెద్ద ఫాయిదా ఏమీ మిగల్చలేదు… ఇలా రెండుమూడు సినిమాలు ఎదురుతంతే… మళ్లీ ఇక విజయ్ దేవరకొండతో రీల్ లైఫ్, రియల్ లైఫ్ శోకాలు తప్పవు… మిషన్ మజ్నుతో తనకు స్ట్రెయిట్ బ్రేక్ వస్తుందని ఆశపడుతోంది కానీ అదంత వీజీ కాదు…!! ఐనా అదేదో పిచ్చి సినిమాలో దీపిక, షారూక్ వెగటు పాటల మీద దేశమంతా నెగెటివ్ ప్రచారం సాగుతుంటే… హిందీ పాటలు రొమాంటిక్‌గా భలే ఉంటాయి అనే ఈ పిల్ల కామెంట్లను ఎలా అర్థం చేసుకోవాలి..? పిల్లతనమేనా..?!
కేఆర్‌కే ఖాన్ అని ఓ ఫిలిం క్రిటిక్ ఉన్నాడు తెలుసుగా… అదీ తిక్క కేసే… రష్మికకు బాలీవుడ్‌లో భవిష్యత్తు లేదని తేల్చిపారేశాడు తాజాగా… సౌత్ సినిమాలకు లేదా భోజ్‌పురి సినిమాలకు మాత్రమే రష్మిక లుక్కు సరిపోతుందనీ, హిందీ ప్రేక్షకులు ఆమెను లీడ్ రోల్స్‌కు ఆమోదించరనీ అంటున్నాడు… రేఖ, హేమ, శ్రీదేవి, జయప్రద వంటి బోలెడు సౌత్ స్టార్లను అందలమెక్కించిన హిందీ తెరకు రష్మిక నచ్చుతుందా లేదానేది పక్కనపెడితే, కేఆర్‌కే వంటి క్రిటిక్స్ కూడా రష్మిక గురించి ఆలోచిస్తున్నారంటే ఆమె మొదటి మెట్టు ఎక్కినట్టే…!!
Share this Article