ఛిఛీ… బాగుంది బాగుంది అని మెచ్చకుంటుంటే,.. నో, ఆ పొగడ్తకు మేం అర్హులం కాము, కాము అని అరిచినట్టు ఆహా ఓటీటీ క్రియేటివ్ టీం దిగజారిపోతోంది… తెలుగు ఇండియన్ ఐడల్ షోను మరీ ఓ బిగ్‌బాస్ షోగా మార్చేస్తోంది…
ఇన్నాళ్లు జీతెలుగు, స్టార్‌మా, ఈటీవీలలో వచ్చే మ్యూజిక్ కంపిటీషన్ ప్రోగ్రాములతో పోలిస్తే తెలుగు ఇండియన్ ఐడల్ షో బాగుంటోంది అని చెప్పుకున్నాం కదా పలుసార్లు… సింపుల్‌గా దాన్ని భ్రష్టుపట్టించేస్తున్నారు వేగంగా…
థమన్ తన పరిచయాలను, సంబంధాలను వాడుతూ పేరున్న సెలబ్రిటీలను ఈ షోకి తీసుకొస్తున్నాడు… గుడ్, వాళ్లకు ఎంత పే చేస్తున్నారనేది పక్కన పెడితే… మ్యూజిక్ సంబంధ శివమణి వంటి సెలబ్రిటీలయితే షోకు అందం, సార్థకత, వాల్యూ… కానీ నటులను తీసుకురావడం వల్ల ఉపయోగం సున్నా, జస్ట్ ఈ షోకు ఎంటర్‌టెయిన్‌మెంట్ లుక్ తప్ప…
Ads
పైగా సినిమా ప్రమోషన్ల టీమ్స్ కూడా వచ్చీపోతుంటాయి… సరే, నాలుగు డబ్బుల కోసం కక్కుర్తి అనుకుందాం… కానీ వచ్చే ఆ సెలబ్రిటీలకైనా కాస్త సెన్స్, డ్రెస్ సెన్స్ ఉండాలి కదా… ఉండదు… అప్పట్లో మనం ఇతర టీవీ మ్యూజిక్ షోలలో అనసూయ, శ్రీముఖిల వెగటు డ్రెస్సింగుల గురించి చెప్పుకున్నాం కదా… ఇప్పుడు రష్మిక వంతు…
ఆమె రాబోయే ఎపిసోడ్ ముఖ్య అతిథి అట… పర్లేదు, నేషనల్ క్రష్ అని పిలవబడే ఆమె రావడం వల్ల షోకు మరింత రీచ్ పెరుగుతుంది, గుడ్… కానీ ఈమె పిచ్చి డ్రెస్ వేసుకుని వచ్చింది… క్లీవేజ్ మొత్తం కనిపించేలా… బాలేదు… పుష్ప-2 షూటింగుకు వచ్చినట్టు వచ్చేసింది… అసలు పుష్పలోనే అక్కడక్కడా చిల్లర డ్రెస్సింగ్ ఆమెది…
సరే, అది సినిమా… వెగటు వాసనలు కొన్ని ఉంటాయి, పైగా సుకుమారుడి కమర్షియల్ వేషాలు కదా… కానీ ఓ మ్యూజిక్ సింగింగ్ కంపిటీషన్ షోకు ఎలా రావాలనే సోయి కూడా లేకపోతే ఎలా..? పైగా అదే డ్రెస్సుతో కంటెస్టెంట్లకు కౌగిలింతలు… మరీ బాగుండదని జడ్జి కుర్చీలో కూర్చున్నప్పుడు ఒకటీరెండుసార్లు షాల్, స్కార్ఫ్ వంటిదేదో కవర్ చేసింది ఫాఫం…
సరే, ఏదో వచ్చింది, అలాంటి స్టార్స్ నుంచి ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేస్తాంలే అనుకుందాం… ఆమెకు స్వాగతం పలికేందుకు కూడా ఓ షో బిల్డప్ చేశారు, అదీ వోకే అనుకుందాం… కానీ ఆమె వచ్చింది కదాని మొత్తం ఆమె పాటలే పాడించడం ఏమిటి కంటెస్టెంట్లతో… మరిక షోలో గీత వైవిధ్యం ఏం ఆశించాలి ఆ ఓటీటీని సబ్‌స్క్రయిబ్ చేసిన శ్రోతలు..? అనవసరంగా సబ్‌స్క్రయిబ్ చేసుకున్నాంరా బాబోయ్ అని బాధపడాలా..? ప్రోమోలో కీర్తన, నజీరుద్దీన్, మరొకరు ఆమె పాటలే పాడుతూ కనిపించారు…
డియర్ అల్లు అరవింద్ గారూ… ఇది సినిమా పాటల పోటీయే గానీ సినిమా కాదు, సినిమా ఫంక్షనూ కాదు, మరీ ఇలా ఓ సింగింగ్ షోను దిగజార్చాల్సిన అవసరమూ లేదు… గుర్తించగలరు..!! సింగింగ్ బిగ్‌బాస్ అని చెప్పుకున్నాం కదా… సేమ్, అందులోలాగే ఓ సర్‌ప్రయిజ్ మిడిల్ ఎంట్రీ అట… ఎవరో వచ్చి చేరారు..!!
Share this Article