ఈమధ్య ఓ వార్త కనిపించింది… దిక్కుమాలిన వార్తలు అనే జాబితాలో తప్పకుండా చేర్చాల్సిన వార్త… అది తెలంగాణ పత్రిక… ఆమె ఎవరో రష్మిక అట… వచ్చేశెయ్, నీయవ్వ అని మాట్లాడిందట… హబ్బ, తెలంగాణ యాస ఇరగదీసిందని రాసేసిండు ఎవడో మహానుభావుడు…
ఈమధ్య తెలంగాణ సినిమా పేరిట రుద్దుతున్న పైత్యాల్లో ఒకటి… తెలంగాణ అంటే తాగుడు కల్చర్ అని నోటికొచ్చిన కూతల్ని సమాజంలోకి కక్కడం..! ఒరేయ్, తెలంగాణ కల్చర్ అనగానే తాగుడు, బూతులు అని బదనాం చేస్తున్నారేమిట్రా, ఇన్నాళ్లూ విలన్లను, జోకర్లకు తెలంగాణ యాస పెట్టి చావగొట్టారు… ఇప్పుడు మరింత ద్రోహం చేస్తున్నారేమిట్రా అని ఎందరు విమర్శిస్తున్నా సినిమా ఇండస్ట్రీ వినదు, వినిపించుకోదు…
అదేదో నాని తీసిన ఓ పిచ్చి సినిమాలో బుడ్డి నోట్లో పెట్టుకుని, పట్టుకోకుండా, గుక్క మిగలకుండా తాగేస్తాడు… అది తెలంగాణ పవర్ అట… ఒక్కసారి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు పోలిస్తే అసలు నిజం అర్థమవుతుంది… అది మాత్రం చేతకాదు మన మీడియాకు…
Ads
నీయవ్వ, నీయక్క అంటేనే అది తెలంగాణ యాసా..? ఎవరో చెబితే బట్టీ పట్టి, కెమెరా ముందు ఆ నాలుగు మాటలు… ఏందీ..? వచ్చేశెయ్, నీయవ్వ అని పిచ్చి కూతలు కూస్తే తెలంగాణ యాసకు పట్టం కట్టినట్టేనట… ఇంకెంత దిగజారుస్తారు భయ్యా పాత్రికేయాన్ని..?
అంతేనా..? ఈ కూతల్లో ఒకటి బూతు కావచ్చు, సెన్సార్ వాడు కట్ చేస్తే బీప్ అని సౌండ్ పెడతారు కదా, అలా పెట్టారు… స్వతహాగా ఆమె కన్నడ… తన మొదటి సినిమాలో కన్నడమే సరిగ్గా మాట్లడలేదు ఆమె… తన ఒరిజినల్ భాష కొడవ… ఈ భాష రూట్స్ ఏరియా కూర్గ్… అవసరం కాబట్టి ఆమె ఈమధ్య తెలుగు, తమిళం, హిందీ నేర్చుకుంటోంది… ఆయా భాషల సినిమావాళ్లు మాట్లాడే భాషలే ఆమెకు వచ్చు… అంతేతప్ప ఆయా భాషల్లో మాండలికాలు ఏమాత్రం తెలియవు… ఆమెకు వాటిని పట్టుకునే అవసరం కూడా లేదు…
ఈమాత్రం దానికి ఆమె సాయిపల్లవికన్నా గ్రేట్ అని కొందరు కామెంట్స్… సాయిపల్లవి తెలంగాణ స్లాంగ్ బాగా మాట్లాడుతుందని ఎవరన్నారు అసలు..? ఆమె నటించిన రెండుమూడు పాత్రలు తెలంగాణవి… అందుకని కాగితాలపై డైలాగులు ఒకటికి పదిసార్లు చదివి, ప్రాక్టీస్ చేసి, డబ్బింగ్ చెబుతుంది… అసలు ఆమెకు తెలుగే పర్‌ఫెక్ట్‌గా రాదు…
అంతెందుకు.,? ఈమధ్య వచ్చిన దసరా సినిమాలో ‘సూరిగాడున్నడా అత్తా’ అంటూ తెరమీద కనిపించిన కీర్తి సురేష్ నయం… డిక్షన్ కాస్త యాసకు దగ్గరగా ఉంది… ఆ డైలాగ్స్ రాసిన రచయిత స్కిల్ అది… మందు గొట్టుడు, బూతులు మాట్లాడుడు తెలంగాణ కల్చర్ అని భ్రమించేవాళ్లకు, వాటిని వార్తలుగా రాసి మురిసిపోయే కలాలకు ఓ పే-ద్ద వందనం బాబూ… చివరగా…. ఈమధ్య నిఖార్సయిన తెలంగానం వినిపించింది బలగం సినిమా… తరువాత దసరా… మిగతాా పాత్రలు పలికే యాస మొత్తం కృతకమే… రష్మిక కూతల్లాగా…!!
Share this Article