కారణాలు ఏవయితేనేం… కొన్ని ప్రేమలు పెళ్లి దాకా రావు… కొందరు ప్రేమ వేరు, పెళ్లి వేరు అని భావించి, ఆ రెండింటి నడుమ గీత గీసేస్తారు… పెళ్లి అనంతరం ప్రేమ సన్నగిల్లుతుందనే సందేహంతో..!
ప్రేమ విఫలమైతే ఆత్మహత్యలూ చేసుకున్న సంఘటనలు కోకొల్లలు… బ్రేకప్ తరువాత పగను పెంచుకునే వాళ్లూ అంతే… ఇప్పుడు లవ్వులు, బ్రేకప్పులు కామన్ అయిపోతున్నాయి కదా… ఫ్రెండ్స్‌లా విడిపోదాం, ఫ్రెండ్స్‌లాగే ఉందాం అని బ్రేకప్ అనంతరం రిలేషన్స్ కూడా మెయింటెయిన్ చేస్తుంటారు…
అవునూ… మనం రతన్ టాటా గురించి చాలా స్టోరీస్ చదివాం కదా… బ్రహ్మచారే గానీ తనకూ ఓ లవ్ స్టోరీ ఉందని… అనివార్యంగా అది పెళ్లి దాకా రాలేదని… నా జీవితంలో మహిళలు లేకుండా లేనని తనే చెప్పాడని… ఇలా కథలు చదివాం కదా… అందులో ఒకటి తన ఫస్ట్ లవ్…
Ads
అమెరికాలో తను చదువుతున్నప్పుడు ఓ అమ్మాయితో ప్రేమ, పెళ్లి దాకా వచ్చింది… ఆమె ఇండియాకు రావల్సి ఉంది… ఈలోపు చైనా- ఇండియా వార్ మొదలైంది… గ్రాండ్‌మా అనారోగ్యం రీత్యా రతన్ ఇండియాాకు వచ్చాడు… ఈలోపు ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇండియాకు పంపించడానికి ఇష్టపడలేదు… రతన్ అమెరికాకు వెళ్లలేడు… అలా ఆ ప్రేమ కథ 1962లో అర్థంతరంగా ముగిసింది… ఇదే కదా మనం చదివింది… కాదట…
ఆ కథలో లేటు వయస్సు ట్విస్ట్ ఒకటి ఉంది… థామస్ మాథ్యూ… రతన్ టాటా, ఎ లైఫ్ పేరిట రాసిన ఓ కొత్త బుక్ ఇంకో కొత్త కథను చెబుతోంది… రతన్ ఫస్ట్ లవర్ పేరు కెరోలిన్ ఎమన్స్… అప్పటికి ఆమె వయస్సు 19 ఏళ్లు… రతన్‌కు ఎక్కడో చూసి ఫస్ట్ లుక్‌లోనే లవ్‌లో పడిపోయింది… ఆమె తల్లిదండ్రులకు కూడా నచ్చాడు…
ఆమె తండ్రి ఫ్రెడరిక్… ఓ ఆర్కిటెక్ట్… టాటా తండ్రితో బిజినెస్ అసోసియేట్… సరే, ఆ లవ్వుకు బ్రేకులు, ఆమె అక్కడే, ఈయన ఇక్కడే… తరువాత ఆమె ఓవెన్ జోన్స్ అనే పైలట్, ఆర్కిటెక్ట్‌ను పెళ్లి చేసుకుంది, ఇద్దరు పిల్లలు… అచ్చం రతన్‌లాగే ఉండటంతోనే పెళ్లి చేసుకున్నాను అనేది ఆమె… ఆయన 2006లో మరణించాడు…
ఆ మరుసటి సంవత్సరమే ఆమె ది డార్జిలింగ్ లిమిటెడ్ అనే మూవీ చూసింది… ముగ్గురు సోదరుల ఇండియా ఉద్వేగ యాత్ర కథ అది… ఓ ఫ్రెండ్ అడిగింది ఆమెను… ఎప్పుడైనా ఇండియాకు వెళ్లావా అని… ఆమెకు ఈమె ప్రేమ కథ తెలుసు… పాత జ్ఞాపకాలు ఆ ప్రశ్నతో చెలరేగాయి ఆమెలో… అవునూ, రతన్ ఏం చేస్తున్నాడు..? ఎలా ఉన్నాడు..?
ఎంక్వైరీ చేసింది… రతన్ టాటా సన్స్, టాటా ట్రస్టులకు చైర్మన్ అయ్యాడని తెలుసుకుంది… ఇండియాలోని ఓ ఫ్రెండ్ ద్వారా వివరాలు కనుక్కుని మెయిల్ చేసింది… డియర్ రతన్, ఇట్స్ మి కెరోలిన్… ఇండియాకు రావాలనుంది…
ఆ మరుసటి ఏడాది ఇండియాకు వచ్చింది… ఐదు వారాలు ఇక్కడే ఉంది… ఢిల్లీలో ఆమెను కలిశాడు టాటా… జస్ట్, ఫ్రెండ్స్… ఆమె తరువాత పలుసార్లు ఇండియా వచ్చింది… 2017లో రతన్ 80వ బర్త్‌డే ఫంక్షన్‌కు కూడా హాజరైంది… ఆయన అమెరికా వెళ్తే ఆమెను డిన్నర్లకు తీసుకెళ్లేవాడు… అదీ ఆ ప్రేమలో గాఢత… తమకు వైఫల్యం లేదు… కానివ్వలేదు… ఆ బంధాన్ని అలాగే పదిలంగా కాపాడుకున్నారు… రతన్ ఓ విశిష్ట వ్యక్తి… ప్రేమలో సైతం..!! (India.com లో వచ్చిన స్టోరీకి ఇది స్వేచ్చానువాదం)
Share this Article