ప్రేక్షకుడు అంటే అంతే… తనకు నచ్చకపోతే ఎంతటి భారీ తారాగణం ఉన్నా సరే, ఎంతటి హీరో అయినా సరే ఆ సినిమాను పట్టించుకోరు… అలా అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలెన్నో… మహేశ్ బాబు, రజినీకాంత్, పవన్ కల్యాణ్, చిరంజీవి తదితర హీరోలున్నా సరే డిజాస్టర్లు ఉన్నాయి… ప్రత్యేకించి జనం టీవీల్లో సినిమాల్ని చూడటం మానేసిన ఈ రోజుల్లో టీవీ రేటింగ్స్ రావడం కష్టసాధ్యమైపోయింది…
మరీ మంచి మౌత్ టాక్ వచ్చిన సినిమాలు, థియేటర్లలో హిట్టయిన సినిమాల్నే టీవీల్లో చూడటానికి ప్రేక్షకుడు ఇష్టపడుతున్నాడు… లేదంటే ఎవరూ దేకడం లేదు… ఓటీటీలు, యాప్స్‌లో సినిమాలు చూసే ప్రేక్షకులైతే టీవీలు అసలు ట్యూన్ చేయడమే మానేశారు… వర్తమానంలో చాలా సినిమాల అతితక్కువ రేటింగ్స్ చెబుతున్న నిజమిదే…
ఇప్పుడు చెప్పుకునేది రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమా గురించి… రివెంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్… అంటూ రూపొందించిన ఈ మూవీకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు… ధమాకా సక్సెస్ తర్వాత రవితేజకు ఇంకాస్త హైప్ వచ్చింది… తను హీరోగా పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ అంచనాలతో ఏప్రిల్7న థియేటర్లలో రిలీజైంది రావణాసుర… డిజాస్టర్‌గా నిలిచింది… దాదాపు యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 20 కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది… నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది…
Ads
ఇది విన్సీ డా అనే బెంగాళీ మూవీకి రీమేక్… తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకునే లాయర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో రవితేజ నటించాడు… రావణాసుర సినిమాలో ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా నటించారు… తనే పెద్ద హీరో, ఎందుకో తను ప్రేక్షకుల్ని రప్పించే విషయంపై ఏదో డౌటున్నట్టుంది… అందుకే ఎడాపెడా హీరోయిన్లను సినిమాలో దింపారు… ఐతేనేం, డిజాస్టర్ తప్పలేదు…
వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా రావణాసుర సినిమా రవితేజకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇటీవల జీ తెలుగులో ఈ సినిమా టీవీ ప్రీమియర్ టెలికాస్ట్ అయ్యింది… ఈ ఫస్ట్ ప్రీమియర్‌కు కేవలం 4.29 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే వచ్చింది… హైదరాబాద్ బార్క్ కేటగిరీలో 3.8 మాత్రమే… ఇలా రవితేజ కెరీర్‌లో అతి తక్కువ టీఆర్‌పీ రేటింగ్‌ను దక్కించుకున్న సినిమాల్లో ఒకటిగా రావణాసుర నిలిచింది…
ఇదేసమయంలో మరో సినిమా గురించీ చెప్పుకోవాలి… రవితేజతో పోలిస్తే సాయిధరమ్ తేజ చిన్న హీరోయే… కానీ ఇటీవల తన సినిమా విరూపాక్ష రిలీజైంది… (బ్రో గురించి మరిచిపొండి… ఫ్లాప్… కంటెంటు బాగాలేకపోతే పవన్ కల్యాణ్ అయినా సరే సినిమాను కాపాడలేడు అనడానికి ఆ సినిమాయే నిదర్శనం…) విరూపాక్ష సినిమా థియేటర్లలో కూడా మంచి వసూళ్లు సాధించింది… ఏదో ఫిక్షన్ కథ… కానీ మంచి మౌత్ టాక్ వచ్చింది…
దాంతో టీవీ ప్రేక్షకులు కూడా సినిమా చూడటానికి ఆసక్తి చూపించారు… తొలిసారి ప్రీమియర్ వేస్తే 11.68 రేటింగ్స్ వచ్చాయి… ఇప్పుడున్న స్థితిలో ఆ రేటింగ్స్ రావడం అంటే గొప్ప విషయమే… అదీ సాయిధరమ్ తేజ వంటి చిన్న హీరో సినిమాకు ఆ రేటింగ్స్ రావడం… గత వారంలో మలిసారి ప్రసారం చేశారు సినిమాను… ఇప్పుడూ తక్కువేమీ లేదు… హైదరాబాద్ బార్క్ కేటగిరీలో ఏకంగా 7.14 టీఆర్పీ వచ్చింది… రవితేజ రావణాసురతో పోలిస్తే చాలా చాలా నయం కదా…!!
Share this Article