ఓ భిన్నమైన ధోరణి కనిపిస్తోంది తెలుగు సినిమాలకు సంబంధించి… కొన్ని సినిమాలనేమో బీభత్సంగా చూసేస్తున్నారు… థియేటర్లలోనే కాదు, ఓటీటీల్లో, టీవీల్లోనూ ఆ జోష్ కనిపిస్తుంది… ఉదాహరణకు కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ వంటివి… అఖండ కూడా థియేటర్లలో హిట్టే… నచ్చకపోతే ఓ మోస్తరుగా కూడా ఆదరణ చూపించడం లేదు, పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు… వాటి జోలికే పోవడం లేదు… ఉదాహరణ ఆచార్య… హిందీ సినిమాల విషయానికొస్తే కంగనా నటించిన థాకడ్ హిస్టారిక్ డిజాస్టర్, 100 కోట్లకు నాలుగైదు కోట్ల రికవరీ కూడా లేదు… అక్షయ్ కుమార్ నటించిన పృథ్వీరాజ్ బడ్జెట్ 200 కోట్లు కాగా, అదీ ప్రస్తుత లెక్కల ప్రకారం 100 కోట్లకు పైగా నష్టపోబోతోంది… అజయ్ దేవగణ్ నటించిన రన్‌వే 34 కూడా ఫ్లాప్… తెలుగులో సర్కారువారి పాట, ఎఫ్-3, అంటే సుందరానికి కూడా నిరాశాజనకమే…
సరే, థియేటర్లకు వెళ్లడానికి ఇప్పటికీ ప్రేక్షకుడు ఇష్టపడటం లేదు… కారణాలు బోలెడు… మంచి టాక్ వచ్చిన సినిమాలను మాత్రమే ఓటీటీల్లో ఓపెన్ చేస్తున్నారు… చివరకు టీవీల్లో కూడా సినిమాల్ని చూడటానికి ప్రేక్షకుడు పెద్దగా సుముఖత కనబరచడం లేదు… ఏడాదిక్రితం కావచ్చు బహుశా తిమ్మరుసు అని సత్యదేవ్ నటించిన సినిమా వచ్చింది… ఓహో, ఇదొక సినిమా వచ్చిందా అని ప్రేక్షకుడు గుర్తించేలోపు వెళ్లిపోయింది… కొద్దిరోజులకే ఓటీటీలో కూడా పెట్టేశారు…
దాన్ని మే 29న ఈటీవీ ప్రసారం చేసింది… పెద్ద సినిమాలు కొని, ప్రసారం చేసి, రేటింగ్స్ కోసం ప్రయత్నించే విషయంలో ఈటీవీ మరీ ఈమధ్య అట్టర్ ఫ్లాప్… ఇదుగో ఇలాంటి సినిమాల్ని కొంటుంది… ఆదివారం ప్రైమ్ టైమ్ ను కూడా కిల్ చేస్తుంది… ఈ సినిమాను ప్రేక్షకుడు అస్సలు పట్టించుకోలేదు… దానికి వచ్చిన రేటింగ్స్ (హైదరాబాద్ బార్క్) కేవలం ఒకటి… నిజం… ఒకటి కూడా కాదు, 0.99 మాత్రమే… టీవీ కోణంలో డిజాస్టర్‌కు తాత… మే 28న సాయంత్రం జీ సినిమాలు చానెల్ సంగుచక్కరం అనే డబ్ సినిమాను ప్రసారం చేసింది… మెయిన్ జీటీవీలో ప్రసారానికి సిగ్గుపడ్డట్టున్నారు… పాత సినిమా… దీనికి వచ్చిన రేటింగ్స్ జస్ట్, ఒకటిన్నర…
Ads
రవితేజ నటించిన ఖిలాడీ సినిమా గుర్తుంది కదా… అదీ థియేటర్లలో ఫ్లాప్… 60 కోట్లు పెడితే 20 కోట్ల దాకా రికవరీ అయినట్టుంది… అందులో అర్జున్ కూడా ఉన్నాడు… డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి ఉన్నారు… దేవిశ్రీప్రసాద్ సంగీతం… కానీ ఫ్లాప్ ఫ్లాపే… ఎవరికీ నచ్చలేదు… హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ చేసినట్టున్నారు… దాన్ని తాజాగా మాటీవీ మే 29, ఆదివారం ప్రైమ్ టైమ్‌లో ప్రసారం చేసింది… వచ్చిన రేటింగ్స్ జస్ట్ 5… టోటల్ రేటింగ్ 7… ఒకరకంగా టీవీల్లో కూడా యావరేజ్ రిజల్ట్… వయస్సు మీద పడుతోంది… రొటీన్ ఫార్ములా, ఇమేజీ బిల్డప్పులను జనం ఇష్టపడటం లేదు… ఉచితంగా టీవీల్లో చూడటానికీ విముఖతే… ఇది వీళ్లకేమో అర్థం కావడం లేదు… అందుకే ఇప్పుడు సినిమాల ధోరణి ఎలా ఉందంటే… అయితే అఖండ, లేదంటే ఆచార్య… అంతే…!!
Share this Article