Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…

May 21, 2025 by M S R

.

ఇప్పుడు దేశమంతా ఇవే చర్చలు, ఇవే వార్తలు… ఆపరేషన్ సిందూర్… ధూర్తదేశం పాకిస్థాన్ మీద యాక్షన్… ప్రధాని కీలక నిర్ణయాలు, మన రక్షణ వ్యవస్థల యుద్ధం తీరు… అన్నింటికీ మించి ప్రెసిషన్ స్ట్రయిక్స్… ఎక్కడెక్కడ ఉగ్రవాద స్థావరాలున్నాయనే సమాచారం….

తెర వెనుక రా, మిలిటరీ ఇంటలిజెన్స్ వంటివి ఎంతో పనిచేస్తే గానీ, అన్నీ క్రోడీకరించిన కంబైన్డ్ వర్క్ కనిపిస్తే గానీ… యాక్షన్ సంపూర్ణం కాదు… ప్రాణాలకు తెగించి పనిచేసే ఏజెంట్లను స్మరించుకోవాలి… మనం భద్రంగా ఉంటున్నందుకు…

Ads

కానీ ప్రధాని కుర్చీలో కూర్చున్నవాడు మూర్ఖంగా… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓ పులకేశిలా… చేజేతులా మన గూఢచర్య వ్యవస్థను దెబ్బ తీస్తే… మన ఏజెంట్ల ప్రాణాలు పోవడానికి కారకుడైతేనే… మనదెంత దౌర్భగ్య వ్యవస్థ..? ఎవరిని తిట్టుకోవాలి..? ఆ ప్రధాని పేరు మొరార్జీ దేశాయ్… ఈ కథను ఈ తరం కచ్చితంగా చదువుకోవాలి…

ఎందుకో కథంతా చదివి మీరే విశ్లేషించుకోవాలి… అవి… స్వమూత్ర పానకాలరావు మొరార్జీ దేశాన్ని ప్రధానిగా ఉద్దరిస్తున్న రోజులు… జనతా అనే ఓ అతుకుల బొంత పార్టీ ఇందిర వ్యతిరేకత అనే ఏకైక ఎజెండాతో ఏర్పడి, అధికారం పొందిన రోజులు… అక్కడ పాకిస్థాన్‌లో భుట్టోను జైలులోకి నెట్టి, సైనిక తిరుగుబాటుతో జియా కుర్చీ ఎక్కిన రోజులు…

పాకిస్థాన్ అణు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది… మనమేమో అప్పటికే అమెరికాను ఫోఫోరా అనేసి ఓ అణుపరీక్ష కూడా నిర్వహించేశాం… ఆరోజుల్లో సియాల్‌కోట్ ప్రాంతాల్లో పాకిస్థాన్ రహస్యంగా అణు కార్యక్రమాన్ని రహస్యంగా నిర్వహిస్తోంది… మన ఏజెంట్లు కష్టమ్మీద తెలుసుకున్నారు… కానీ పక్కాగా ఆధారం ఎలా..?

అక్కడ సైంటిస్టులు తరచూ కేశఖండనానికి వచ్చే ఓ హెయిర్ డ్రెస్ షాపును చూడగానే ఓ ఆలోచన తట్టింది… వాళ్ల వెంట్రుకల్లో రేడియేషన్ ఆనవాళ్లు ఉంటాయి కదా… సో, అక్కడికి వెళ్లి, ఏవేవో వెతుకుతున్నట్టు నటిస్తూ మొత్తానికి కొన్ని వెంట్రుకలు పట్టుకొచ్చారు… రసాయన పరీక్షలు జరిపితే నిజంగానే రేడియేషన్ ఆనవాళ్లు కనిపించాయి…

సో, క్లియర్… ఓ కోవర్టును వెతికారు… 10 వేల డాలర్లకు బేరం కుదిరింది… మొత్తం అక్కడ ఏం జరుగుతున్నదో ప్లాన్, నక్షాతో (బ్లూప్రింట్) సహా ఇవ్వడానికి ఒకడు ఒప్పుకున్నాడు… కానీ డబ్బులేవి..? రా చీఫ్ ప్రధానిని అడిగాడు… విషయం ఏమిటో చెప్పాడు… కానీ సదరు మొరార్జీకి రా అంటే ఎలపరం… ఆ సంస్థ కేవలం కాంగ్రెసేతర నాయకుల పనిపట్టడానికి ఏర్పాటు చేసిందనే మూర్ఖపు అంచనా…

నిజానికి అప్పటికే రా నెట్‌వర్క్ పర్‌ఫెక్ట్ వర్క్ చేస్తోంది… కావో దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు, కానీ 10 వేల డాలర్లు, విదేశీ మారకద్రవ్యం బాపతు యవ్వారం కావడం, అప్పటికి బడ్జెట్ పరిమితులు, ప్రధాని వ్యతిరేకత నేపథ్యంలో ప్రధానినే అడగాల్సి వచ్చింది… ఓ మేజర్ ఆపరేషన్‌కు అనుమతి కూడా అవసరం కాబట్టి… కానీ అప్పటికే రా ఖర్చును 30 శాతం కోసేశాడు ప్రధాని…

అంతేకాదు, ఆ ప్రధాని మూర్ఖత్వం ఎంత దారుణంగా ఈ దేశాన్ని దెబ్బతీసిందీ అంటే… జియా పెద్ద నక్కజిత్తులగాడు… ఇక్కడ ఉన్నదేమో బిత్తిరి సత్తిగాడు… తరచూ మాట్లాడుకునేవారు… ఆహా, మనం కదా శతృత్వం స్థానంలో శాంతిని నెలకొల్పుతున్నాం అనే భ్రమల్లో బతికేవాడు…. ఓరోజు మాట్లాడుతూ మీరు సియాల్‌కోట్‌లో ఏమేం అణు కార్యక్రమాలు చేస్తున్నారో నాకు తెలుసులే అన్నాడు మొరార్జీ…

జియా గురించి తెలుసు కదా… భారతీయ ఏజెంట్ల కోసం ఉధృత గాలింపు… ప్రతి ఒక్కరినీ పట్టుకున్నారు… వాళ్ల శవాలు కూడా మళ్లీ దొరకలేదు… అదీ మొరార్జీ నిర్వాకం… ఇంకా అయిపోలేదు… ఇజ్రాయిల్ పుట్టుకను మనం గుర్తించకపోయినా మన దేశమంటే దానికి ప్రేమ…

అప్పటికి ఇజ్రాయెల్‌కు గూఢచార సంస్థ MOSSAD తో కలిసి రా ఏజెంట్లు పనిచేసేవాళ్లు… పాకిస్తాన్‌లో అణు పరీక్షలను నివారించడానికి 1977లో ఇజ్రాయెల్ పాకిస్తాన్‌లోని అనుమానాస్పద ప్రదేశాలపై బాంబు దాడి చేయాలని కూడా రెడీ అయిపోయింది…, కానీ విమానాల్లో ఇంధనం నింపుకోడానికి, ఇజ్రాయెల్ మన గగనతలాన్ని ఉపయోగించడానికి అనుమతి ఇవ్వడానికి మొరార్జీ దేశాయ్ నిరాకరించాడు…

ప్రధాని గోఎహెడ్ అని ఉంటే… కథ వేరే ఉండేది… మన గూఢచార సంస్థ తీవ్రంగా దెబ్బతిన్నది… ఇలా ఉద్దరించినందుకేనేమో పాకిస్తాన్ తన దేశ అత్యున్నత పౌర పురస్కారం నిషాన్ – ఎ – పాకిస్తాన్ ప్రదానం చేసింది తనకు… ఖర్మ…
ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, చురుకుగా పాకిస్థాన్‌లో పనిచేసే భారత ఏజెంట్ల పూర్తి పేర్లు, చిరునామాలను పాకిస్తాన్‌కు చెప్పారని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ సింగ్ ఒక టీవీ కార్యక్రమంలో పేర్కొన్నాడు….
హమీద్ అన్సారీ ఇరాన్‌లో రాయబారిగా ఉన్నప్పుడు, ఆయన ఇరాన్‌కు భారత ఏజెంట్ల గురించి సమాచారం ఇచ్చాడు… ఆ రెండు దేశాలూ మన ఏజెంట్లందరినీ చంపాయి… ఎన్నో అంతర్గత కుట్రలు, వెన్నుపోట్లు, మూర్ఖపు ద్రోహాలతో ఎంత దెబ్బతిన్నా సరే… మన గూఢచార వ్యవస్థ నిలబడింది… ఎదిగింది… గ్రేట్… గూఢచర్యం సరిగ్గా లేని ఏ దేశమూ స్థిరంగా, భద్రంగా ఉండదు… తెలుసు కదా..!!

అధికార పక్షంలో ఎవడున్నా… ప్రతిపక్షంలో ఎవడున్నా… దేశ భద్రత, రక్షణలకు సంబంధించి పరిణతితో కూలిన వ్యవహార ధోరణి అవసరం… ప్చ్, మన దౌర్భాగ్యం కొద్దీ కొందరు క్షుద్ర నాయకులు… చెప్పుకుంటే సిగ్గుచేటు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
  • ‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
  • చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions