మా అబ్బాయి రోహన్ తన్విని నాకు పరిచయం చేసినప్పుడే అనుకున్నాను… అర్థం చేసుకున్నాను… ఆమె తన గరల్ ఫ్రెండ్ అని..! గరల్ ఫ్రెండ్ అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు వాడు… కానీ నాకు అర్థమవుతుంది కదా… జాన్‌తా హుఁ అప్‌నే బేటే కో… ఆమెను చూడగానే ఎందుకో అనిపించింది తను మా కుటుంబంలో సరిగ్గా ఇమిడిపోతుందని…
నాకు బాగా గుర్తుంది… మేం మొదటిసారిగా కలిసినప్పుడు నా కాళ్లకు దండం పెట్టింది తను… అంతేకాదు, తన బాగా మాట్లాడుతోంది… పద్ధతిగా… ఐసే జైసే బాత్ కర్తే హీ అచ్చా లగే… అప్పుడే నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయి… ఆరోజు అందరమూ కలిసి భోంచేశాము, మాట్లాడుకున్నాము, నవ్వులు పంచుకున్నాము… తర్వాత కొన్నాళ్లకే తన్వి, రోహన్ పెళ్లికి మేం అంగీకరించేశాం… ఇరువైపులా…
మై బహుత్ ఖుష్ థా… అమ్మాయి తండ్రి నేనూ కలిసే పెళ్లిపనులు మీదేసుకున్నాం… పెళ్లికి ఫంక్షన్ హాల్ మంచిది ఎక్కడుందో వెతికాం… ఓ ఫంక్షన్ హాల్ ఉద్యోగి మాగురించి తెలిసి పకపకా నవ్వాడు… ఏమిటోయ్ అనడిగితే… ఇద్దరు మామలు ఫంక్షన్ హాల్ వెతకడం మొదటిసారి చూస్తున్నాను అన్నాడు… తన్వి మామ ప్లస్ రోహన్ మామ కలిసి అన్నమాట… వినడానికి బాగా అనిపించింది…
Ads
Share this Article