Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వీళ్లు కదా గ్లోబల్ హ్యూమన్స్..! రూట్స్ మరవని బ్రిటన్ ప్రధాని పోటీదారులు..!

July 8, 2022 by M S R

మనం కొన్ని విషయాల్ని చదవం, తెలుసుకోం… మనకు ఎంతసేపూ కులం ముఖ్యం… ప్రాంతం ముఖ్యం… మనం ఏ దేశంలో బతుకుతున్నా సరే, మనలోకం మనది… కులం పేరిట మన హీరోలు, వాళ్లపై మూర్ఖభక్తి, దరిద్రమైన అభిమాన ప్రదర్శన.. సిగ్గూశరం లేని ప్రవర్తన… అంతకుమించి ఆలోచించలేని దరిద్రం… కానీ కొందరి గురించి చదవాలి… విశ్వమానవులుగా మారుతున్న, మారిన మనుషులు గురించీ తెలుసుకోవాలి…

బోరిక్ జాన్సన్ అనేవాడు బ్రిటన్ ప్రధానిగా కుర్చీ దిగిపోయాడు… దానికి కారణాలు బోలెడు… స్వయంకృతాలు… ఆ కుర్చీ కోసం ఇప్పుడు రేసులో ఏకంగా ముగ్గురు భారతీయ సంతతి వ్యక్తులు పోటీపడుతున్నారు… కేవలం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ మాత్రమే కాదు… ప్రీతి పటేల్,  సువెల్లా బ్రేవర్ మ్యాన్ కూడా ఉన్నారు… ఎవరు వాళ్లు..?

రిషి సునాక్… పంజాబ్ హిందూ రూట్స్… తండ్రి కెన్యాలో, తల్లి టాంజానియాలో పుట్టారు… అప్పుడెప్పుడో బ్రిటన్ వలస వెళ్లిన కుటుంబం… భార్య ఇన్ఫోసిస్ నారాయణమూర్తి బిడ్డ అక్షత… ఇప్పటికీ హిందూ మతాన్ని పాటిస్తాడు… విశ్వమానవుడే కానీ మూలాల మీద గౌరవం ఉంది…

Ads

rishi sunak

ప్రీతి పటేల్ :: ఈమెవి గుజరాతీ మూలాలు… తాతలు ఉగాండా నుంచి బ్రిటన్‌కు వలస వెళ్లారు… ఈమె అలెక్స్ సాయర్‌ను పెళ్లిచేసుకుంది… హిందూ మతాన్నే ఆచరిస్తుంది ఇప్పటికీ… ఎక్కడో పెరిగారు, ఎక్కడి నుంచో వలస వచ్చారు… ఐనా మూలాలు మరవని కుటుంబం అది…

priti

సుయెల్లా బ్రేవర్‌మ్యాన్ :: తండ్రి క్రిస్టీ, తల్లి ఉషా ఫెర్నాండెజ్… అప్పుడెప్పుడో కెన్యా, మారిషస్‌ల నుంచి బ్రిటన్ వలస వెళ్లిన కుటుంబం… తల్లి నర్స్… తండ్రివి గోవా రూట్స్… బౌద్ధమతాన్ని పాటిస్తుంది ఈ కుటుంబం… ఈమె ప్రమాణస్వీకారం కూడా ధమ్మపథం మీద చేసింది…

suella

వీళ్ల కుటుంబాలు ఎక్కడెక్కడికో, ఏ దేశాలకో వలసవెళ్లి, తరువాత బ్రిటన్ వెళ్లి స్థిరపడ్డ భారతీయ మూలాలున్న కుటుంబాలు… ఎవ్వరూ తమ రూట్స్ మరిచిపోలేదు… తాము పుట్టిన మతాల్ని విడిచిపెట్టలేదు… బ్రిటన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు… ప్రూవ్ చేసుకున్నారు… ఎదిగారు… ఇప్పుడు ఏకంగా ప్రధాని పదవికే పోటీపడుతున్నారు…

అలాగని సంకుచితంగా ఉండే వ్యక్తులేమీ కాదు… తమ మూలాలను అభిమానిస్తూ, గౌరవిస్తూ, ఆచరిస్తూ, పాటిస్తూనే… బ్రిటన్ సమాజంలో ఒదిగిపోయారు… ఆ దేశ సంక్షేమం గురించే ఆలోచిస్తారు… మనం ఎక్కడ బతుకుతున్నామో, మనకు ఏ గడ్డ ఆశ్రయమిచ్చిందో దాన్ని ప్రేమించడం… గొప్ప గుణం…

ఎక్కడెక్కడికో వెళ్లినా సరే… మన పిచ్చి హీరోలు, మన వెర్రి రాజకీయ నాయకులు, మన తిక్క పార్టీల మీద మూర్ఖపు ప్రేమలతో తన్నుకునే అర్ధ మెదళ్లు వీళ్ల గురించి చదవాలి… వీళ్లే కాదు, పలు దేశాల్లో మనవాళ్లు ‘‘విశ్వమానవులుగా’’ వ్యవహరిస్తూ, సంపూర్ణ పరిపక్వతతో వ్యవహరిస్తున్నవాళ్లు బోలెడు మంది… వీళ్లు నిజమైన గ్లోబల్ హ్యూమన్స్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions