.
మన సినిమా నటులు, ప్రత్యేకించి స్టార్ హీరోల సంగతి తెలుసు కదా… మేమే దేవుళ్లమనే పిచ్చి భ్రమల్లోనే బతుకుతూ పిల్లికి బిచ్చం కూడా పెట్టని బాపతు…
తమకు సొసైటీ ఇంత ఇస్తుంది కదా, మనం ఏమైనా ఇవ్వాలనే సోయి ఏమాత్రం లేని బతుకులు… పేర్లు ఎందుకులే గానీ, టైమ్ వచ్చినప్పుడు ఎన్ని కోట్ల జరిమానాలు కడతారో అప్పుడప్పుడూ చదువుతూనే ఉన్నాం కదా…
Ads
కానీ కొందరు ఉంటారు… రియల్లీ సర్వీస్ మోటివ్స్… ఉదాహరణకు లారెన్స్ రాఘవ… తన స్థాయికి తను ఎప్పుడూ సొసైటీకి ఎంతోకొంత రుణం చెల్లించుకుంటూనే ఉంటాడు… ప్రత్యేకించి పిల్లల గుండె ఆపరేషన్లకు..! చిన్న నటే గానీ ప్రణిత సుభాష్ కరోనా సమయంలో … పెద్ద పెద్ద వేల కోట్ల స్టార్లు ఇళ్లల్లో పెసరట్లు పోస్తూ మీడియాలో వెకిలి ప్రచారం చేసుకుంటుంటే ఆమె నిజంగా పబ్లిక్ సర్వీస్ చేసింది…
సోనూ సూద్ గురించి చెప్పనక్కర్లేదు… ఈ స్టార్లు ఎవరూ తన పక్కన నిలుచునే అర్హత కూడా లేదు పబ్లిక్ సర్వీస్ విషయంలో…! కొందరు తామేదో గ్రామాలను దత్తత తీసుకున్నామని చెబుతుంటారు… మరి అక్కడ ఏమేం చేశారో ఓసారి ప్రెస్‌ను తీసుకుపోయి చూపించొచ్చు కదా, చేయరు… కనీసం తమ సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టొచ్చు కదా, పెట్టరు…
తాజాగా ఓ వార్త మంచిగా అనిపించింది… ఆదిత్య ఓం… లాహిరి లాహిరి లాహిరి సినిమాలో ఒక హీరో… ఇంకొన్ని తెలుగు సినిమాల్లో కూడా చేశాడు… ఇక్కడ నిలదొక్కుకోలేదు గానీ… తను రచయిత, గీత రచయిత, నిర్మాత, దర్శకుడు, నటుడు… మల్టీ టాలెంటెడ్… 50 ఏళ్ల వయస్సులో మొన్నటి బిగ్‌బాస్‌లో కనిపించాడు… కానీ ఈ షో బాపతు వేషాలు, కృత్రిమత్వం తన వల్ల కాలేదు… హుందాగా వ్యవహరించాడు… అది ఈ షోకు పనికిరాదు కదా, మధ్యలోనే నిష్క్రమించాడు…
కానీ ఓసారి తెలుగు ప్రేక్షకులందరికీ తన పునః పరిచయం చేసుకున్నాడు… తను చెరుపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నాడనేది తాజా వార్త… రియల్ హీరోయిజం,.. ఎక్కడి వాడో, ఇక్కడికి వచ్చాడు, గొప్ప ఆదరణ ఏమీ దక్కకపోయినా ఈ సొసైటీకి ఏమైనా ఇవ్వాలని అనుకున్నాడు… చెరుపల్లి అనేది ఓ గిరిజన గ్రామం…
తన నేపథ్యం ఎన్నదగిందే… తండ్రి ఐఏఎస్… తల్లి సమాజ్‌వాదీ పార్టీలో కీలక నాయకురాలు… ఒకసారి ఎమ్మెల్యే… తన బంధుగణం అంతా బ్యూరోక్రాట్స్‌గా, జడ్జిలుగా ఉన్నారు… అనుకోకుండా వైవీఎస్ చౌదరి కళ్లల్లో పడి సినిమాల్లోకి వచ్చాడు… ఓసారి షూటింగుకు నేరుగా వచ్చెయ్, రైలులోనే స్నానం చేసిరా అన్నాడట చౌదరి… చేశాడు, కష్టపడ్డాడు…
తనకు ఓ చారిటీ సంస్థ ఉంది… “ఎడ్యులైట్‌మెంట్”… విద్యా సంస్కరణల కోసం పని చేస్తున్నాడు. గ్రామంలో ఒక లైబ్రరీ నిర్మించాడు. డిజిటల్ సేవా కేంద్రాన్ని ప్రారంభించాడు… గ్రామంలోని పిల్లలకు ల్యాప్‌టాప్‌లు అందించాడు… విలేజ్ మొత్తం సోలార్ లైట్లను ఏర్పాటు చేయించాడు…
చెరుపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో… కలుషితమైన నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడటాన్ని గుర్తించిన ఆదిత్య ఓం… RO వాటర్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నాడు… అందుకే తను రియల్ హీరో… కోట్లకుకోట్లు దండుకుంటూ, కనీస మానవత్వం కనిపించని, సొసైటీకి పైసా విదల్చని సోకాల్డ్ పాన్ఇండియా స్టార్లతో పోలిస్తే ఆదిత్య ఓం ఓ రియల్ స్టార్…!!
Share this Article