Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దేశం కోసం చావుకు ఎదురెళ్లాడు… బుల్లెట్ల వానలో తడుస్తూ… ఒరిగిపోతూ…

July 26, 2024 by M S R

ముందుగా ఓ కథ చదవండి… చాలామంది ఇంతకుముందే చదివి ఉంటారు… ఐతేనేం, మరోసారి… 20 ఏళ్ల క్రితం… హిమాచల్ ప్రదేశ్ నుంచి, అదీ ఓ కుగ్రామం నుంచి రక్షణ మంత్రిత్వ శాఖకు ఓ లేఖ వచ్చింది… దాన్ని రాసింది ఓ స్కూల్ టీచర్… అందులో ఓ అభ్యర్థన ఏమిటంటే…

‘‘అయ్యా… 2000 సంవత్సరం, జూలై ఏడున కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన మన దేశపు గర్వపతాక నా కొడుకు, నా ఏకైక కుమారుడి ప్రథమ వర్ధంతి రోజున… తను మరణించిన ప్రదేశాన్ని నా చేతులతో టచ్ చేయాలని ఉంది… కనీసం చూడాలని ఉంది… నాకు, నా భార్యకు ఆ అవకాశం ఇవ్వగలరా..? ఒకవేళ ఇది దేశభద్రతకు విరుద్ధం గనుక అయ్యే పక్షంలో నాకు అనుమతి ఇవ్వకపోయినా పర్లేదు… నా ఈ విజ్ఞప్తిని వాపస్ తీసుకుంటాను…’’

ఉత్తరం చదివిన ఓ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ కళ్లు చెమర్చాయి… ఎక్కడో తడి మత్తడి దూకుతున్నట్టు… చెమ్మగిల్లిన కళ్లతో దిగువ సిబ్బందికి చెప్పాడు… ‘‘వారి కోరిక తీరుద్దాం… ఎంత ఖర్చయినా పర్లేదు… ప్రభుత్వం అంగీకరించకపోతే నేను నా జీతం నుంచి ఆ ఖర్చు భరిస్తాను… టీచర్‌ను, ఆయన భార్యను తీసుకువద్దాం… మన ప్రాణాలకు ఇంతకుమించిన ప్రేమ, గౌరవం ఇంకేం ఉంటాయి… పాపం, వాళ్లకు ఒక్కడే కొడుకు, దేశం కోసం అదీ త్యాగం చేశారు… మనం వాళ్ల కోరికను తీర్చలేమా..?’’ అన్నాడు…

Ads

batra

ఆ ముసలి దంపతులు వచ్చారు… వాళ్లను సమున్నత గౌరవంతో ఆ ఆఫీసర్ అక్కడ కట్టిన ఓ గద్దెపైకి తీసుకొచ్చాడు… కొడుకు మరణించిన చోటకు వెళ్లగానే అక్కడ ట్యూటీలో ఉన్న వాళ్లంతా స్టిఫ్‌గా నిలబడి సెల్యూట్ చేశారు… ఆ ఆఫీసర్ మాత్రం ఆ తండ్రికి ఓ పూలబొకే ఇచ్చాడు, ఆయన కాళ్లకు నమస్కరించాడు… కళ్లు తుడుచుకున్నాడు… ‘నువ్వు సోల్డర్‌వు, నా పాదాల్ని ఎందుకు తాకుతున్నావు..?’ అనడిగాడు ఆ తండ్రి ఆశ్చర్యంతో…

batra

ఆ ఆఫీసర్ చెప్పాడు… ‘‘ఆ సమయంలో నేను, మీ అబ్బాయి మాత్రమే ఉన్నాం… యుద్ధ మైదానంలో మీ కొడుకు వీరోచిత తత్వాన్ని దగ్గర నుంచి గమనించింది నేనొక్కడినే… శత్రువులు మిషన్ గన్‌తో కాల్పులు జరుపుతున్నారు… నిమిషానికి వందల బుల్లెట్లు మావైపు దూసుకొస్తున్నాయి… మేమున్నది కొంత డెలికేట్ సిట్యుయేషన్… మేం ఐదుగురం ఉన్నాం… కొంత వెనక్కి వచ్చి ఓ బండ వెనుక దాక్కున్నాం… నేను డెత్ చార్జికి సిద్ధమయ్యాను… అంటే ఎవరైతే బుల్లెట్లు కాలుస్తున్నారో వాళ్ల వైపు ప్రాణాలకు తెగించి వెళ్లి గ్రెనేడ్లు విసరాలి… ఉంటే ఉంటాం, పోతే పోతాం… కానీ మిగతా వాళ్లు సేవ్ అవుతారు…

batra

శత్రువుల బంకర్ కూడా మనకు స్వాధీనం అవుతుంది… ఇక వాళ్ల బంకర్ వైపు పరుగు తీయబోతున్నాను, కానీ మీ అబ్బాయి వారించాడు… ‘‘నీకేమైనా పిచ్చా..? నీకు భార్యాపిల్లలు ఉన్నారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు… నేను వెళ్తాను డెత్ చార్జికి… మీరు కాస్త కవరింగ్ ఇవ్వండి చాలు… అంటూ నా చేతిలోని గ్రెనేడ్లను లాక్కుని డెత్ ఛార్జికి పరుగెత్తాడు… శత్రువుల బుల్లెట్లు మీ అబ్బాయికి తాకుతున్నాయి… మొండిగా మీవాడు ఆ బంకర్ వైపు పరుగెత్తాడు… గ్రెనేడ్లను విసిరాడు… 13 మంది శత్రువులు ఒకేసారి మరణించారు… వాళ్ల దాడి ముగిసింది… ఆ ఏరియా మొత్తం మా ఆధీనంలోకి వచ్చింది… కానీ…

batra

మీ అబ్బాయి పడి ఉన్నాడు అక్కడ… పరుగున వెళ్లాను… మీవాడి దేహాన్ని చూస్తే 42 బుల్లెట్లున్నాయి… తన తలను నా చేతుల్లోకి తీసుకున్నాను… జైహింద్ అంటూ నా చేతుల్లోనే చివరి శ్వాస వదిలాడు… మీ అబ్బాయి మృతదేహాన్ని మీ ఊరికి తీసుకురావడానికి నాకు వీలుకాలేదు… నిజానికి నేను తెచ్చిన ఈ పూలు మీవాడి పాదాల దగ్గర పెట్టాల్సినవి… తను లేడు… అందుకే మీ పాదాల మీద ఉంచుతున్నాను..’’ అంటూ సన్నగా ఏడుస్తున్నాడు ఆయన… ఆ తల్లి ఓ మూలన నిలబడి మెల్లిగా ఏడుస్తోంది… అప్పుడు తండ్రి అన్నాడిలా… తన కళ్లల్లో నీటిఛాయ కూడా లేదు…

batra(17 వేల అడుగుల ఎత్తు నుంచి సోదరుడికి విక్రమ్ రాసిన లెటర్)

‘‘బాబూ… నా కొడుకు సెలవుపై వచ్చినప్పుడు వేసుకోవడానికి ఓ కొత్త చొక్కా కొన్నాను… ఆ తరువాత వాడెప్పుడూ ఇంటికి రాలేదు… ఇక రాడు… వాడు మరణించినచోట దాన్ని ఉంచడానికి దాన్ని తీసుకొచ్చాను… దానికోసమే నేను రక్షణ శాఖను పర్మిషన్ అడిగి వచ్చాను… బేటా, దాన్ని నువ్వు తీసుకో, వేసుకో… నా కోరిక కాదనకు…’’ తను సందేహిస్తూ ప్రశ్నార్థకంగా చూశాడు… ఆ తండ్రి బదులిచ్చాడు… ‘‘దేవుడు నాకు ఇద్దరు కొడుకుల్ని ఇచ్చాడు… ఒకడు దేశం కోసం, మరొకడు నా కోసం… వాడి పేరు విక్రాంత్ బాత్రా…’’

ఆ కార్గిల్ వీరుడి పేరు కెప్టెన్ విక్రమ్ బాత్రా… తండ్రి పేరు గిర్దారి లాల్ బాత్రా… తల్లి పేరు కమల్ కాంతా… ఇది చాన్నాళ్లుగా సోషల్ మీడియాలో సర్క్యలేట్ అవుతూనే ఉంది… ఫేక్ కాదు, విక్రమ్ బాత్రా పేరు తెలియని ఆర్మీ సోల్జర్ లేడు… కథలుకథలుగా చెప్పబడుతుంది ఆర్మీ సర్కిళ్లలో… రియల్ హీరో… షేర్‌షా అని ఓ సినిమా వచ్చింది… ఆ కథ విక్రమ్ బాత్రాదే… బయోపిక్…

((ప్రేమంటే..? పెళ్లంటే..? ఈమె బాష్యం వేరు, ఆచరణ వేరు…! నమ్మలేము…!! ఈ శీర్షికతో విక్రమ్ లవ్ స్టోరీని ముచ్చట పబ్లిష్ చేసింది… ఈ సందర్భంగా అది మరోసారి గుర్తుచేసుకుందాం…))

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions