జులై 2018… ఫిన్లాండ్… పరుగుకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయి పోటీ… అనూహ్యంగా ఓ ఇండియన్ అథ్లెట్… పేరు హిమాదాస్… ఒక విభాగంలో గోల్డ్ మెడల్ కొట్టింది… బహుమతి ప్రదానం వేళ, జనగణమన గీతం వినిపిస్తుంటే, గెలిచిన ఆనందాన్ని, ఎమోషన్‌ను ఆపుకోలేక కన్నీరు కార్చేసింది… అది నటన కాదు… గుండెల్లో నుంచి తన్నుకొచ్చిన ఉద్వేగం… ఒక విశ్వవేదిక మీద స్వర్ణం గెలిచిన హిమదాస్‌ను, ఆమె కన్నీళ్లను చూసి జాతితోపాటు జాతి కూడా కదిలిపోయింది, గర్వించింది… మనసారా చప్పట్లు కొట్టి ఆశీర్వదించింది, అభినందించింది… మరిన్ని విజయాలను ఆకాంక్షించింది… ఒకే నెలలో ఆమె అయిదు స్వర్ణాలు తన మెడలో వేసుకుంది… సీన్ కట్ చేస్తే… ఫిబ్రవరి 2021… అస్సాం ప్రభుత్వం ఆమెను తమ పోలీసు విభాగంలోకి డీఎస్పీగా తీసుకుంది… శుక్రవారం అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది… డీఎస్పీగా ఆ ఖాకీ డ్రెస్ వేసుకుని… సేమ్, నాడు ఫిన్లాండ్లో సంబరపడ్డట్టే ఇప్పుడూ సంబరపడింది… దుర్గాపూజ వేళ బొమ్మ తుపాకీతో ఆడుకునే రోజుల నుంచీ పోలీస్ కావడం నా చిన్నప్పటి కల… మా అమ్మ కల… అది ఇలా నెరవేరింది అని ఆనందపడిపోయింది…
ఇందులో పెద్ద విశేషమేముంది..? క్రీడల్లో మంచి ప్రతిభ కనబర్చినవాళ్లకు ఉద్యోగాల్లో ప్రయారిటీ, కోటా ఉంటాయి కదా అంటారా..? ఆమెను ప్రభుత్వం సర్వీసులోకి తీసుకుంది… సో వాట్..? మంచి విజయాలు సాధించిన క్రీడాకారులను ఆయా రాష్ట్రాలు ప్రభుత్వ సర్వీసులోకి… అదీ గ్రూప్-2, గ్రూప్-1 కేటగిరీల్లోకి కూడా తీసుకున్న ఉదాహరణలు బోలెడు… ఆమధ్య పీవీ సింధుకు తెలంగాణ, ఏపీ సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలుపడి మరీ కానుకలు ప్రకటించాయి… ఇక ఏపీ, తెలంగాణ పడిన పోటీ గురించి చెప్పనక్కర్లేదు… ఆమెను కూడా ప్రభుత్వం సర్వీసులోకి తీసుకుంది… పరీక్షలు, నియామక ప్రక్రియలు లేకుండా సర్వీసులోకి చేరినవాళ్లు చాలామంది ఉన్నారు… కానీ..?
Ads
పోలీస్ డ్రెస్‌లో హిమ దాస్ ఫోటో చూసి, ఆమెను డీఎస్పీగా నియమించిన వార్తలు చదివి… దాదాపు సోషల్ మీడియా, మీడియా బాగా పాజిటివ్‌గా రియాక్టయింది… నెటిజనం అయితే తమ ఇంట్లోనే ఒకరికి ఆ కొలువు దక్కినంత ఆనండపడిపోయారు… సాధారణంగా ట్రోలింగుకు, పరమ దరిద్రిపు బాష్యాలకు వేదికగా మారిన సోషల్ మీడియా ఏదేని అంశంపై ఈ స్థాయిలో పాజిటివ్‌గా రియాక్ట్ కావడం చాలా అరుదు… హిమదాస్‌ను అభినందిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి… గతంలో ప్రభుత్వ సర్వీసులో చేరిన ఏ క్రీడాకారుడు లేదా క్రీడాకారిణిపైనా ఈ స్థాయి అభినందనల వర్షం కురియలేదు… ఎందుకు..? పొలం గట్లపైన, గుట్టలపైన చెప్పులు, బూట్లు కూడా లేకుండా పరుగులు తీస్తూ, సాధన చేస్తూ… పేదరికం తాలూకు అడ్డంకుల మీద నుంచి కష్టమ్మీద జంప్ చేస్తూ… జాతి గర్వకారణంగా ఎదిగింది… మట్టి నుంచి పుట్టి మెరిసన మాణిక్యం… అప్పట్లో ఇదే సోషల్ మీడియా ప్రభుత్వాలను తిట్టిపోసింది… దక్కాల్సిన బహుమానాలు, గుర్తింపుల్లో కూడా వర్ణవివక్షేనా..? ఒక దళిత బిడ్డకు తగు గౌరవం లేదా..? అని ఆక్షేపించింది… మరి ఇన్నాళ్లూ కిక్కుమనని అస్సోం ప్రభుత్వం సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమెకు ఈ కొలువు పత్రం ఎందుకిచ్చింది..? ఆమె కులం వోట్ల మీద ప్రేమేనా..? నో… సోషల్ మీడియా, మీడియా ఆ రంధ్రాన్వేషణలోకి వెళ్లలేదు… ఒక క్రీడాకారిణికి సరైన గుర్తింపు, గౌరవం దక్కింది అనే వరకు మాత్రమే పరిమితమయ్యాయి… నిజానికి హిమకు మొన్నటి జనవరి తొమ్మిదిన 21 లో పడింది… అందుకే ఇన్నాళ్లూ ఆ డీఎస్పీ కొలువు ఇవ్వలేక, తగిన వయస్సు రాగానే ఇచ్చింది అస్సోం ప్రభుత్వం… అదీ సంగతి…
Share this Article