Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహ్…! ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు వెనుక అసలు కథ, కుట్రలు ఇవా..?!

January 18, 2026 by M S R

.

చాలా ప్రశ్నలు… ఎన్టీవీ జర్నలిస్టులను ఎందుకు అరెస్టు చేశారు పోలీసులు..? మంత్రి కోమటిరెడ్డికీ మహిళా ఐఏఎస్‌లతో సంబంధాలు అంటూ నీచమైన, బురద కథనాలు, ప్రసారాల వెనుక అసలు కుట్ర ఏమిటి..? వీటికి జవాబులు ఎవరూ రాయరు… చెప్పరు…

కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతాడు, చెప్పాడు… పలు అంశాల్లో తన ధోరణి మీద చాలామందికి చాలా అభ్యంతరాలు ఉండవచ్చుగాక… కానీ కొన్నిసార్లు తన తెగువ చాలా నిజాల్ని బయటపెడుతుంది… ఇప్పుడూ అంతే… ఎన్టీవీ ప్లస్ బీఆర్ఎస్ ప్లస్ వైసీపీ మొత్తుకుంటున్న పత్రికా స్వేచ్ఛ వెనుక అసలు బండారాన్ని రాధాకృష్ణ బద్దలు కొట్టాడు…

Ads

  • వ్యాపారం, పాత్రికేయం, రాజకీయం ఎలా కలగలిసి… వ్యాపార ఎత్తుగడల్లో చివరకు మహిళా అధికారులను బజారుకు లాగిన నైచ్యాన్ని బయటపెట్టాడు… మార్మిక భాషలో ఏమీ చెప్పలేదు, దాపరికం లేదు… తెర వెనుక ఆటలాడిన నాయకుల పేర్లు, కంపెనీల పేర్లు, అసలు కథేమిటో విప్పిచెప్పాడు… ‘ఒక మంత్రి, ఒక కంపెనీ, ఒక అధికారి’ అనే దాగుడుమూత కథనం కాదు… ఔట్ రైట్‌గా వెళ్లిపోయాడు… సాటి టీవీ చానెల్ అని కూడా చూడలేదు… బాంబు పేల్చాడు…

రాధాకృష్ణ కథనాన్నే సింపుల్‌గా చెప్పుకుందాం… ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాక్ ఈ మొత్తం వెగటు కథకు ఆధారం… మన సింగరేణికి ఎప్పుడో దక్కింది ఆ గని… దాంట్లో తవ్వకాలను ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేయడానికి (మరి అపారమైన అనుభవం ఉన్న సింగరేణి తనే ఎందుకు తవ్వకూడదు అనేది మరో చిక్కుముడి వంటి ప్రశ్న) కేసీయార్ అప్పట్లో ప్లాన్ చేశాడు…

  • ఆదానీని ముందుపెట్టి, ప్రతిమ శ్రీనివాస్ కంపెనీకి అప్పగించే ప్లాన్ అది… దాదాపు 25 ఏళ్లపాటు డబ్బును తవ్వుకోవడమే కదా ఆ గనిలో… కానీ అప్పట్లో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి ఎంటరయ్యాడు… తన సోదరుడి సుశీ కంపెనీకి ఆ గని తవ్వకం టెండర్ దక్కడానికి తను ప్రధానిని కూడా కలిశాడు… కేసీయార్ ప్లాన్ మీద ఫిర్యాదులు చేసి, మొత్తానికి ఆపగలిగాడు… సీన్ కట్ చేస్తే…

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కోమటిరెడ్డి మంత్రి అయ్యాడు… మళ్లీ నైనీ బ్లాక్ టెండర్లు తెరపైకి వచ్చాయి… ఈసారి డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి, ఎన్టీవీ నరేంద్ర చౌదరి రంగంలోకి వచ్చారు… వీళ్లకు బొగ్గు తవ్వకాల్లో అనుభవం లేదు, దాంతో మేఘాతో కలిసి ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటుకు పూనుకున్నారు… మరి తవ్వకాల్లో బాగా అనుభవం ఉన్న ఇతర కంపెనీలు పోటీపడితే,  ఏ అనుభవం లేని ఈ కంపెనీకి ఎలా టెండర్ దక్కాలి..?

  • అందుకే ఓ సిల్లీ నిబంధన పెట్టారు… (సింగరేణి భట్టి పరిధిలోనే ఉంది)… క్షేత్ర సందర్శన (ఫీల్డ్ విజిట్) చేసే కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ ఇస్తామనీ, వాళ్లే టెండర్లలో పాల్గొనాలనేది ఆ నిబంధన… ఎవరైనా సందర్శిస్తారు, అంచనాలు వేసుకున్నాకే కదా కంపెనీలు టెండర్లలోకి దిగేది… కానీ ఆ సర్టిఫికెట్ కేవలం తాము అనుకున్న కంపెనీలకే… అంటే తమ జాయింట్ వెంచర్‌కే ఇచ్చి, బలమైన ఇతర కంపెనీలను టెండర్లకు దూరం చేయాలనేది అసలు ప్లాన్…

ఇక్కడ ఎన్టీవీ ప్రయోజనం ఏమిటంటే..? చౌదరి అల్లుడి వెన్సర్ కంపెనీ కూడా ఆ జాయింట్ వెంచర్‌లో ఉంది… మళ్లీ ఇక్కడ కోమటిరెడ్డి అడ్డుపడ్డాడు… తన సోదరుడి కంపెనీకి తవ్వకాల్లో అనుభవం, టెండర్లలో పాల్గొనే అర్హత ఉన్నాయి… సో, ఇక్కడ కోమటిరెడ్డిని అడ్డుకోవడానికి ఎన్టీవీ బురద కథనాలకు పాల్పడింది… కోమటిరెడ్డిని ఒకరకంగా బ్లాక్‌మెయిల్ చేసి, వెనక్కి నెట్టేసే కుట్ర… చేతిలో టీవీ ఉంది కదా, మహిళ ఐఏఎస్‌లతో సంబంధాలు అంటగట్టి, ఓ రంకు రోత కథనాన్ని ప్రసారం చేశారు…

  • ఓ మహిళా ఐఏఎస్ ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో ఇక కేంద్ర సర్వీస్ అధికారులందరూ సీరియస్ అయ్యారు… సిట్ వేశారు, జర్నలిస్టులను అరెస్ట్ చేశారు, కానీ యాజమాన్యం చెప్పింది వాళ్లు చేశారు, వాళ్ల ఉద్దేశపూర్వక తప్పు, నేరం ఏమీ లేదు… చూసీచూడనట్టు పోవాలని భట్టి సీనియర్ అధికారులకు చెప్పినా వాళ్లు వినిపించుకోలేదట…

ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి..? ఇద్దరు మంత్రుల వ్యాపారాల స్పర్థ ఇది… మధ్యలో ఈ బురద కథనాల కుట్రలు… ఉన్నతాధికారుల డిమోరల్ అయితే అది పాలనను కూడా ప్రభావితం చేస్తుంది… ఎన్టీవీ వెగటు జర్నలిజం కారణంగా నైని గని యవ్వారం కూడా రచ్చ రచ్చ అయిపోయింది… ఇక నిజానికి ఆ టెండర్లు రద్దు చేసి, ఆ నిబంధనలన్నీ తీసేసి, పారదర్శకంగా అర్హత ఉన్న కంపెనీకి దక్కేలా చూడాలి…

  • సరే, ఇక్కడ పత్రిక స్వేచ్ఛ సంగతికొద్దాం… తన వ్యాపారం కోసం ఉన్నతాధికారుల వ్యక్తిత్వ హననానికి (కేరక్టర్ అసాసినేషన్)కు మీడియా పాల్పడవచ్చా..? సమాజం ఛీత్కరించేసరికి పత్రిక స్వేచ్ఛ అనే సాకు, ముసుగు అవసరపడ్డాయా..?

తాము అధికారంలో ఉన్నప్పుడు తమకు పడని మీడియా సంస్థల్ని నానారకాలుగా వేధించిన కేసీయార్, జగన్ క్యాంపులు కూడా పత్రిక స్వేచ్ఛపై రేవంత్ దాడి అంటూ ఎన్టీవీ మీద కేసును ఖండిస్తున్నాయి… హాస్యాస్పదం… ఓ కాంగ్రెస్ మంత్రి దొరికాడు కదాని బీఆర్ఎస్ అనుంగు మీడియా (సోషల్, యూట్యూబ్) ఎన్టీవీ కథనాన్ని మరింతగా జనంలోకి తీసుకుపోయింది… ఇప్పుడు ఎవరు కుట్రదారులు..?

అవునూ, ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేశారు సరే, మరి అసలు బాధ్యుడి సంగతి..? బీఆర్ఎస్ సోషల్ మీడియా సంగతి..? హఠాత్తుగా సైలెన్స్ ఎందుకు ఆవరించింది..? సిట్ తదుపరి స్టెప్ ఏమిటి..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘కాశ్మీర్ ప్రిన్సెస్’… ఆకాశంలో మృత్యువు… ఫస్ట్ ఇండియన్ జేమ్స్ బాండ్…
  • ఓహ్…! ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు వెనుక అసలు కథ, కుట్రలు ఇవా..?!
  • ఎంజీఆర్..! ఇప్పటికీ ఆ పేరును ఎందుకు స్మరించుకోవాలంటే..!!
  • అన్ని న్యూస్ వీడియోల్లో ఆ మిస్సింగ్ కుర్రాడి జాడ వెతకడం ఎలా..?
  • సినిమా ఇండస్ట్రీకి ప్రమాద ఘంటికలు… బాగా పడిపోయిన వసూళ్లు…
  • అరుణారుణ జ్ఞాపకం హరితీకరణ..! ఆ స్థూపం ఆకుపచ్చబడింది..!
  • కేటీయార్ హుందా స్పందన… హరీష్ రావు ‘గంటె భాష’లో అక్కసు…
  • కలాం కావల్ – మమ్ముట్టి ‘నట మాయాజాలం’… మరో భిన్నపాత్రలో…
  • ‘ఆమెను’ చంపేసి… రెండు వారాల తరువాత మళ్లీ బతికించారట…
  • మరాఠీల అసలు తీర్పు..! విద్వేషంపై విజయం సాధించిన విజ్ఞత..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions