(Jagannadh Goud…………) రతన్ టాటా గారు ఉండేది బొంబాయిలో.., వయస్సు 83 సంవత్సరాలు… 150 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ, పూణేలో ఉన్న ఒక ఉద్యోగిని కలవటానికి వెళ్ళారు… ఆ యువకుడు 2 సంవత్సరాల క్రితం టాటా సంస్థలో పనిచేశాడు… అతని ఆరోగ్యం బాగా లేకపోవడంతో తనను పరామర్శించడానికి వెళ్లాడు,.. ఫ్రెండ్స్ సర్కిల్ అనే అ అపార్ట్‌మెంట్స్ మధ్యతరగతి ఉండే మామూలు అపార్ట్‌మెంట్స్…
కోవిడ్ కాలం కాబట్టి అపార్ట్ మెంట్ సెల్లార్‌లోనే మాట్లాడి వెనక్కి వచ్చారు… రతన్ టాటా గారి వెంట మీడియా లేదు, బౌన్సర్లు లేరు. ఈ ఫోటో కూడా రతన్ టాటా గారి వ్యక్తిగత సిబ్బంది తీసింది కాదు, ఆ మాజీ ఉద్యోగి భార్య తీసినట్లుగా ఉంది… ఇక్కడ చూడండి, రతన్ టాటా వంటి వ్యక్తి వస్తే అపార్ట్‌మెంట్‌లోకి వాళ్లు ఆహ్వానించి కాసిన్ని టీనీళ్లు కూడా ఇవ్వలేకపోయారు… ఆయన పైకి వెళ్లి, 5 నిమిషాలైనా ఆ ఇంట్లో గడపలేకపోయాడు…
Ads
మనం Inspiration కి, మోటివేషన్ కి ఎక్కడెక్కడో వెతుకుతాం… మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో విలువలు పాటించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రతన్ టాటా గారి లాంటి అత్యున్నతమైన వ్యక్తి నాకు తెలిసి ప్రపంచ వ్యాపారరంగంలో లేడు… ఎందరో మహానుభావులు, అందులో రతన్ టాటా గారు లివింగ్ లెజెండ్… ఈ ఎపిసోడ్‌లో ఇంతకుమించి రాయడానికి వివరాల్లేవు… ఆయన గురించి ఎంత రాసినా ఏమీ ఎక్కువ కాదు…
Share this Article