.
ఆనంద్ మహింద్రా… మహింద్రా గ్రూపు చైర్మన్… తరచూ వార్తల్లో ఉండే వ్యక్తి… తన కార్ల వ్యాపారమేదో తాను చూసుకోవడమే కాదు, సమాజగతి మీద కూడా స్పందిస్తుంటాడు…
సోషల్ మీడియాలో యాక్టివ్… తనకు ఆసక్తిగా అనిపించినవి షేర్ చేసుకుంటాడు… తను సాయం చేయగల ఇష్యూస్‌లో ఇన్వాల్వ్ అవుతాడు… విశిష్టంగా కనిపించే ఓ భిన్నమైన వ్యాపారి… ఇప్పుడు సోషల్ మీడియాలో తన కార్లకు సంబంధించి కనిపించిన ఓ పోస్టుకు తనే రియాక్టయ్యాడు…
Ads
తను ఇచ్చిన రిప్లయ్ ఈమధ్యకాలంలో అత్యుత్తమం అనే ప్రశంస నెటిజన్ల నుంచి వినిపిస్తోంది… విషయం ఏమిటంటే..? సుశాంత్ మెహతా అనే వ్యక్తి ఓ ట్వీట్ పెట్టాడు… ‘‘మహేంద్రా కంపెనీ ముందుగా తమ కార్లకు సంబంధించిన గ్రౌండ్ ఇష్యూస్ పరిష్కరించుకోవాలి, స్పేర్ పార్టుల సమస్య, ప్రత్యేకించి సిబ్బంది ప్రవర్తన విషయాల్లో…
మీరు ఏవేవో చెప్పుకుంటారు గానీ హ్యుండయ్ వంటి కంపెనీల దరిదాపుల్లోనే లేరు మీరు… మీ కొత్త కారు Be6e కూడా అంతే… మీ డిజైన్ టీమ్ వైఫల్యమో లేక మీ టేస్టే అలా ఉందో అర్థం కాదు… మహేంద్రా, టాటా మనకు కొత్త మారుతి, హ్యూండయ్‌లా ఎప్పుడు ఎదుగుతాయో…’’ అని తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచాడు…
అది ఆనంద్ మహేంద్రా కంటబడింది… ఉడుక్కోలేదు… ఉక్రోషం చూపలేదు… ఆవేశపడలేదు… చాలా పరిణతితో కూడిన రిప్లయ్ ఇచ్చాడు… ఆ ట్వీట్ స్క్రీన్ షాట్ జతచేస్తూ..!
‘‘నువ్వు చెప్పింది నిజమే సుశాంత్… ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది… కానీ ఇప్పటికి ఎంత దూరం వచ్చామో కూడా గమనించాలి కదా… 1991లో ఈ కంపెనీలో చేరినప్పుడు అప్పుడప్పుడే మన ఎకానమీ ఓపెన్ అవుతోంది…
విదేశీ బ్రాండ్ల కార్లు వస్తాయి, మీరు పోటీపడలేరు, ఈ కార్ల వ్యాపారం నుంచి వైదొలగండి అని ఓ గ్లోబల్ కన్సల్టెన్సీ మమ్మల్ని హెచ్చరించింది… ఐనాసరే మూడు దశాబ్దాలుగా మేం పోటీపడుతూనే ఉన్నాం… మీ పోస్టులో ఉన్నట్టే మా చుట్టూ నిరాశావాదం, సంశయవాదం, మొరటుతనం కూడా… విజయం పట్ల మా ఆకలిని చల్లార్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం…
నిద్రపోవడానికి ముందు చాలా దూరం వెళ్లాల్సి ఉంది… ఈలోపు సంపూర్ణ ఆత్మసంతృప్తి ఉండదు… నిరంతర అభివృద్ధే మా మంత్రం… కానీ మళ్లీ సక్సెస్ వైపు మా కడుపుల్లో ఆకలిని రగిల్చినందుకు థాంక్స్’’
ఎవరో ఏదో అంటూనే ఉంటారు, అందరినీ సంతృప్తిపరచడం ఎవరి వల్లా కాదు, ఒక ట్వీట్‌కు మరీ ఇంత లోతైన రిప్లయ్ దేనికి అనే అభిప్రాయాలతోపాటు… ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో చూసిన అత్యుత్తమ రిప్లయ్ ఇది అనే ప్రశంసలూ కనిపిస్తున్నాయి… అదీ ఓ కంపెనీ చైర్మన్ నుంచి.,.
సదరు సుశాంత్ మెహతాకు కంపెనీ మార్కెటింగ్ స్టాఫ్ కాల్ చేసి, అసలు మీరు మా కంపెనీ కస్టమరా..? మా వెహికిల్స్‌లో ఏదైనా కొన్నారా అనడిగారు… నిజానికి తను మహేంద్ర వెహికిల్ ఓనర్ కానేకాదు… ఓ అభిప్రాయం రాసిపడేశాడు… మీ ట్వీట్‌లో చాలా పరుషమైన పదాలు వాడారు అని కంపెనీ స్టాఫ్ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు…
దాంతో సుశాంత్ మెహతా తన ఒరిజినల్ ట్వీట్ డిలిట్ కొట్టేశాడు… విమర్శల్ని మీరు నిర్మాణాత్మకంగా తీసుకోవడం ఆశ్చర్యంతోపాటు ఆనందాన్ని కలిగిస్తోంది అని మరో ట్వీట్ పెట్టాడు..!!
Share this Article