బీఫ్..! మన దేశంలో మతభావాలు, మనోభావాలు, రాజకీయాలు, వివాదాలు బోలెడు దీని చుట్టూ తిరుగుతుంటాయి తెలుసు కదా… హింస కూడా..! ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అనేక దేశాల్లో అదొక కామన్ నాన్-వెజ్ డిష్…
టేస్ట్ అట్లాస్ అనే ఫేమస్ వరల్డ్ ఫుడ్ సైట్ పలు కేటగిరీల్లో ఏటా ఫుడ్ రెసిపీలకు ర్యాంకింగ్స్ ఇస్తుంది కదా… తాజాగా వరల్డ్ టాప్ 100 డిషెస్ జాబితాను రిలీజ్ చేసింది… అందులో నంబర్ వన్ ర్యాంకు బ్రెజిలియన్ బీఫ్ కట్… 4.75 గ్రేడ్ ఇచ్చింది…
టాప్ చెత్తా ఇండియన్ డిషెస్ అంటూ అందులో మన ఉప్మాను, మన చద్దన్నం వంటి మరో బెంగాలీ వంటకాన్ని చేర్చడం మీద కూడా మనం గతంలో చెప్పుకున్నాం కదా… ఈసారి వరల్డ్ టాప్ 10 జాబితాలో మన ఇండియన్ డిష్ ఒకటి కనిపించింది… అది టాప్ 7… బటర్ గార్లిక్ నాన్…
Ads
వెన్న వెల్లుల్లి రొట్టె… ఎహె, ఇది కూర కాదు, జస్ట్, రొట్టె మాత్రమే, ఇదేం ర్యాంకింగ్ అని అప్పుడే మొదలెట్టేశారు మన నెటిజనం… దీనికి 4.67 గ్రేడ్ ఇచ్చింది టేస్ట్ అట్లాస్… మొత్తం జాబితాలో బ్రెడ్స్, పిజ్జాలు, రొట్టెలు మాత్రమే కాదు, నూడుల్స్, ఆధరువులు, సూప్స్, డంప్లింగ్స్ గట్రా అన్నిరకాలూ ఉన్నాయి… అంతెందుకు, సెకండ్ బెస్ట్ కూడా రొట్టే… మలేషియన్ ఫుడ్… దాని పేరే రోటీ ఇయనై…
టాప్ 50లో మరికొన్ని ఇండియన్ డిషెస్ కూడా ఉన్నాయి… 43వ ప్లేస్ ముర్గ్ మఖానీ… ఇది కోడిచికెన్ డిష్… 47వ ప్లేస్ టిక్కా… ఇదీ కోడిమాంసమే, వండే విధానం వేరు… 48వ ప్లేస్ తందూరీ… ఇది కూడా వండే విధానమే… సరే, ఏవో ర్యాంకులు, ఏవో గ్రేడ్లు… అందరికీ నచ్చాలనేమీ లేదు… మన ఇష్టాలు వేరుగా ఉండొచ్చు… టేస్ట్ అట్లాస్ వాడి టేస్టే సరైంది కాకపోవచ్చు, వాడి ప్రామాణికాలూ సరైనవి కాకపోవచ్చు… కానీ వెలువడిన జాబితా అయితే అది…
మొత్తం టాప్ 100 లిస్టు చూస్తూ ఉంటే… మన ఇరుగూపొరుగూ శ్రీలంక, బంగ్లాదేశ్, ప్రత్యేకించి పాకిస్థాన్ వంటకాల జాడ కనిపించలేదు… అమెరికా, రష్యా వంటి దేశాల వంటకాలకూ పెద్ద ప్రిఫరెన్స్ ఏమీ కనిపించలేదు… ఎక్స్‌క్లూజివ్ సౌత్ ఇండియన్ డిషెస్ కూడా లేవు…
నిజంగా ఇండియన్స్ బాగా ఇష్టపడే లేదా బాగా ఆరగించే డిషెస్ ఏముంటాయి..? మన ఇండియన్ సైట్స్ ఏవీ ర్యాంకింగ్స్ ఇవ్వవు… కానీ స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ అప్పుడప్పుడూ రిలీజ్ చేసే లెక్కల్లో… టాప్ ప్లేస్ బిర్యానీయే… టిఫిన్లకు సంబంధించి దోశ… క్లియర్ కదా..!!
Share this Article