.
ఈగల్ అని ఓ సినిమా వచ్చింది గుర్తుందా..? గుర్తుండకపోవచ్చు… అలా వచ్చి, ఇలా వెళ్లిపోయింది… సో వాట్… రవితేజ ఉంటేనేం, అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ చేస్తేనేం… పైగా కావ్య థాపర్, వల్గర్ నవదీప్, అవసరాల శ్రీనివాస్… ఎవరుంటేనేం…
కథలో దమ్మేదీ..? అదో రవితేజ మోనాటనస్ యాక్షన్, డైలాగ్ డిక్షన్… చూసీ చూసీ బోర్ కొట్టలేదా..? కొట్టింది… అందుకే ఫ్లాపయింది… కాలంతోపాటు మన హీరోలు మారరు, అదీ వాళ్ల దురదృష్టం… కాదు, సగటు తెలుగు ప్రేక్షకుడి దురదృష్టం…
Ads
సరే, ఫ్లాప్,.. అవన్నీ ఇండస్ట్రీలో సహజమే… ముందే ఓటీటీలో వేశారు… కాస్తోకూస్తో థియేటర్ వెళ్లని ప్రేక్షకులు ఓటీటీలో సగం సగం చూసేసి వదిలేశారు… తరువాత టీవీల్లో ప్రీమియం ప్రసారం… అసలే టీవీల్లో సినిమాల్ని ఎవడూ చూడటం లేదు… ఓటీటీలో ఎంచక్కా ఫాస్ట్ ఫార్వర్డ్ సౌకర్యంతో చకచకా కాసేపు చూసి వదిలేసే చాన్స్ ఉన్నప్పుడు… టీవీ ముందు కూర్చుని, వాడు చెప్పిన టైముకే, వాడు చావబాదే యాడ్స్ చూస్తూ నరకం అనుభవించడం దేనికి..?
అందుకే ఈ టీవీ ప్రీమియర్ ప్రసారానికి దక్కిన రేటింగ్స్ జస్ట్ 2.77 మాత్రమే… తనే కాదు, గ్యారంటీగా రాసి పెట్టుకొండి, ఎంత తోపు హీరో సినిమా ప్రసారం చేసినా ఇలాగే ఉండబోతోంది… టీవీల్లో సినిమాలు చూసే కాలం కాదు అది… సరే, మరి సీరియల్స్ సంగతి..?
కార్తీకదీపం నిర్మాత వదలడు కదా… స్టార్ మాటీవీ ఏదో వేషాలు వేస్తుంది… అందుకని అది మళ్లీ నంబర్ వన్… తరువాత ప్లేసులు… ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఇంటింటి రామాయణం, గుండె నిండా గుడిగంటలు… తరువాత ఎక్కడో బ్రహ్మముడి, చిన్ని… (పాపం ఆమధ్య బ్రహ్మముడి టాప్ ఉండేది…)
వాటి తరువాతే జీతెలుగు సీరియల్స్… హమ్మయ్య, ఆ వెధవ సీరియల్ ప్రేమ ఎంత మధురం అయిపోతుందట కదా… థాంక్ గాడ్… పరమ చెత్తా సీరియల్ అది… అన్నట్టు ఆ టీవీ సీరియళ్లలో ఫస్ట్ ర్యాంక్ (మాటీవీ సీరియల్స్‌కు చాలా దూరంలో…) చామంతి, మేఘసందేశం, పడమటి సంధ్యారాగం, జగద్ధాత్రి… అన్నీ దాదాపు ఒకే రేటింగ్స్…
తరువాత అమ్మాయి గారు… మిగతావి చెప్పుకోవడం వేస్ట్… మరి ఈటీవీ సీరియల్స్ అంటారా..? భలేవారే, వాటి గురించి చెప్పడానికి ఏముంటుంది..? దాని రియాలిటీ షోలు ఫ్లాప్, సీరియల్స్ సూపర్ ఫ్లాప్ రేటింగ్స్‌పరంగా… ఏవో సగటు యూట్యూబ్ చానెళ్లలాగా బిట్స్, రీల్స్, షార్ట్స్‌తో రెవిన్యూ చూసుకుంటోంది… పాపం, ఎలాంటి ఈటీవీ..? ఇప్పుడు ఏ స్థాయి ఈటీవీ…!? ఎప్పటిలాగే జెమిని టీవీ చూసేవాడే లేడు… అదీ సంగతి…
Share this Article