Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

2 ఫ్లాట్లు… 639 కోట్ల రికార్డు ధర… ఇంతకీ ఆ ధనికురాలు ఎవరంటే..?

June 4, 2025 by M S R

.

మన విశ్వనగరం హైదరాబాద్‌లో… ధనికులు, హైపర్ ధనికులు నివసించే ప్రాంతాల్లో కూడా ఖరీదైన ఫ్లాట్ రేటు ఎంత..? చదరపు అడుగుకు (స్క్వేర్ ఫీట్) గరిష్టం 20 వేలు ఉండొచ్చా..?

పోనీ, అత్యంత ఖరీదైన పోష్ విల్లా స్క్వేర్ ఫీట్‌కు గరిష్టం 40, 50 వేల రూపాయలు ఉండొచ్చా..? మరి ముంబై..? మన దేశ వాణిజ్య రాజధాని… వర్లి ఏరియా… సీ ఫేస్… ఇప్పటివరకూ ఇండియాలో పలకనంత అత్యధిక రికార్డు రేటుతో ఓ లావాదేవీ జరిగింది…

Ads

ఫార్మస్యూటికల్ మెగా కంపెనీ USV అధినేత్రి లీనా గాంధీ తివారీ రెండు అల్ట్రా లగ్జరీ, సీ ఫేస్ డుప్లెక్స్ అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేసింది… విలువ 639 కోట్లు.,. మీరు చదివింది నిజమే… అక్షరాలా ఆరు వందల ముప్ఫయి తొమ్మది కోట్లు…

స్క్వేర్ ఫీట్‌కు జస్ట్ 2.83 లక్షలు పడిందట… అక్కడ అంతే, ఆ అల్ట్రా రిచ్ పీపుల్ అంతే అంటారా..? అవునూ, ఇంతకీ ఎవరామె..? ఎప్పుడూ పెద్దగా వార్తల్లో కనిపించదు… అంత రిచ్ పర్సనాలిటీ కదా, అంత లోప్రొఫైల్ ఏమిటి..? ఎవరు ఈ గాంధీ..?

గుండె సంబంధ, మధుమేహ సంబంధ మెడిసిన్స్ ఉత్పత్తిలో నంబర్ వన్ వీళ్ల కంపెనీ… వేక్సిన్లు ఇతరత్రా ఉత్పత్తులకూ ఫేమస్… దాని బాస్ ఈమె… అవును, లో ప్రొఫైల్ ఆమె తత్వంబ… ఎప్పుడో ఓసారి బిజినెస్ మీడియాలో కనిపిస్తుంది ఆమె పేరు… ఫోర్బ్స్ ధనికుల జాబితాల విడుదల వంటి సందర్భాల్లో…

ఇండియాలోని టాప్ రిచ్చెస్ట్ లేడీస్‌లో ఈమె ఐదవ ప్లేసు… విఠల్ బాలకృష్ణ గాంధీ, అంటే ఈమె తాతగారు 1961 లో ఈ కంపెనీ స్థాపించాడు… తరువాత అందరూ బ్రహ్మాండంగా విస్తరించారు… ప్రస్తుతం కంపెనీ ఆదాయం ఏడాదికి 4800 కోట్లు… ఈమె కంపెనీ సీఈవో ప్రశాంత్ తివారీని పెళ్లి చేసుకుంది…

మన దేశ లేడీ ఫిలాంత్రిపిస్టుల్లో కూడా ఈమెకు మంచి పేరు ఉంది… దేశంలో సెకండ్ ప్లేస్ ఉదార మహిళల్లో… అంతేకాదు, ఆమె రచయిత్రి కూడా… తాత బయోగ్రఫీని Beyond Pipes and Dreams పేరిట రాసింది…

ఇప్పుడు వర్లిలో ఈ రికార్డు స్థాయి ఫ్లాట్ కొనుగోలుతో వార్తల్లోకి వచ్చింది… ఇక్కడ మరొకరి గురించి చెప్పాలి… ఈమె బిడ్డ అనీష తివారీ…

leena

అక్కా చెల్లెళ్లుగానో, సమ వయస్కులైన స్నేహితులుగానో కనిపిస్తున్నారు కదా… కుడి పక్కన ఉన్నది తల్లి లీనా గాంధీ తివారీ, ఎడమ పక్కన ఉన్నది బిడ్డ అనీష తివారీ…

తమ కంపెనీ పగ్గాలు రాబోయే కాలంలో ఆమెవే… కాబట్టి అదే రంగంలో చదివించారు… అమెరికాలో బయోకెమిస్ట్రీ, మాలిక్యులార్ బయాలజీలో డిగ్రీ… ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ టెక్నాలజీ యూనివర్శిటీ నుంచి మాలిక్యులార్ బయాలజీలో పీహెచ్‌డీ కూడా చేసింది… చక్కగా ఇండియా వచ్చేసి, తమ USV లో డైరెక్టర్‌గా చేరిపోయింది…

పూర్తి ప్రైవేటు ఫరమ్… తల్లి చైర్ పర్సన్, తండ్రి సీఈవో, బిడ్డ డైరెక్టర్… అదేరంగంలో ఉన్నత విద్య… వారసత్వపు అర్హతలు అంటే ఇలా ఉండాలి… గుడ్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
  • ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…
  • ఇలాంటి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మన పొరుగిల్లు అయితే బాగుండు…
  • ఆపరేషన్ సిందూర్‌ను పొడిగించకపోవడమే మంచిదైందట…!!
  • టెక్నాలజీ మాత్రమే తెలిస్తే చాలదు… టెక్నిక్ కూడా తెలియాలి…
  • విజయ బాపినీడు ప్రేక్షకుల్ని ఏదో మాయ చేయబోయాడు కానీ…
  • ఉక్రెయిన్ యుద్ధతంత్రం… ఇండియాకు ఓ పెద్ద మేలుకొలుపు…
  • సారీ… నాటి నాయకన్‌కు ఆమడల దూరంలో ఆగిపోయింది ఇది..!
  • ఐపీఎల్… ఇదొక వికృత క్రీడ… ఆటగాళ్ల వేలంవెర్రి… ఓ పిచ్చి…
  • ఈ పిచ్చిది ఏదో చెబుతుంది… గుడ్డిగా ఫాలో అయ్యారో, బుక్కయిపోతారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions