.
అసలు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కథాకథనాలే సరిగ్గా అర్థం కావు… నిజానికి అణచివేతకు గురైన జాతుల గురించి ఆర్తితో చెప్పాలనే ప్రయత్నిస్తాడు… కానీ అర్థమయ్యేట్టు, స్ట్రెయిటుగా చెప్పడు… అదే తనలోపం…
కంగువాతో తలబొప్పి కట్టి, తీవ్రంగా నష్టపోయిన సూర్య ఈసారి హిట్ కొట్టాలని డెస్పరేటుగా ఉన్నప్పుడు కార్తీక్ సుబ్బరాజును ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాదు… నిజానికి తనకిప్పుడు కావాల్సింది తన ఇమేజీకి తగిన ఓ మాస్ మసాలా మూవీ…
Ads
పూజా హెగ్డే చాన్నాళ్లుగా ఓ ఐరన్ లెగ్ అన్న ముద్ర పడిపోయింది… ఆమె తప్పేమీ లేకపోయినా ఇండస్ట్రీలో ఈ నమ్మకాలు ఎక్కువ… సూర్య పెద్దగా అవి నమ్మడు కాబట్టి అమ్మడు ఈ సినిమాలో హీరోయిన్ రోల్ దక్కించుకుంది…
నవ్వు అంటే తెలియని ఓ సీరియస్ గ్యాంగ్‌స్టర్… హింసను, పాత జీవితాన్ని మానేసి తను పెళ్లి చేసుకుని, భార్య కోసం ప్రశాంతంగా బతకాలని అనుకుంటాడు… కానీ గతం తరుముతుంది, వెంటాడుతుంది, మళ్లీ హీరో హింసను అనివార్యంగా ఆశ్రయించాల్సి వస్తుంది… చాలా సినిమాల్లో చూశాం కదా ఈ బాషా మార్క్ కథను… ఇదీ అదే…
కాకపోతే ఇందులో అండమాన్ దీవుల్లోని బ్లాక్ ఐలండ్‌లోని ఓ ఆదివాసీ జాతి కోసం హీరో పోరాడతాడు… తన గతంతో, తన ఒంటి మీద ఉన్న ఓ ముద్రతో ముడిపడి ఉన్నది కాబట్టి… దత్తు తీసుకున్నవాడితోేనే ఫైట్… ప్లాట్ వరకూ వోకే… కానీ స్ట్రెయిట్‌గా విషయాన్ని చెప్పలేకపోయాడు దర్శకుడు… యాక్షన్ వరకూ వోకే, సూర్య వంటి మాస్ స్టార్‌కు, సింగంకు ఈ యాక్షన్ సీన్లు అలవాటే, అలవోకగా చేసుకుంటూ పోయాడు…
ఎటొచ్చీ ఎమోషన్స్ కరువు… తమిళం, హిందీ, తెలుగు భాషల్లో తీశారు కదా… సెమీ పాన్ ఇండియా… డబ్బింగే కాబట్టి పాటల్ని పెద్దగా పట్టించుకోరు తమిళ దర్శకులు ఎప్పటిలాగే… కనీమా అనే ఒక్క పాట కాస్త బెటర్ ఉన్నంతలో… సినిమా ట్యాగ్ లైన్ నవ్వు, ప్రేమ, యుద్ధం… చివరిదే ఎక్కువగా కనిపించింది…
పైగా వీక్ క్లైమాక్స్… పూజా హెగ్డే కూడా సినిమాకు ఓ మైనస్… మామూలు సీన్లు వోకే గానీ… ఎమోషన్ సీన్లలో, ఏడుపు సీన్లలో పూజాను భరించడం కష్టమే…
రెట్రో అంటే 1960-93 నాటి కథ… నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి… నిర్మాణంలో సూర్య భాగస్వామి… సినిమా మీద బాగా హోప్స్ పెట్టుకున్నాడు… చివరగా… సూర్యకు ఉన్న మార్కెట్, ఫ్యాన్ బేస్, ఇమేజీ దృష్ట్యా తమిళ ప్రేక్షకులకు కాస్త కనెక్ట్ అవుతుందేమో… కానీ తెలుగు ప్రేక్షకులకు ఎక్కడం కష్టం… కష్టమే…
మితిమీరిన హింస, అసభ్యపదాలతో విసుగెత్తించిన నాని హిట్3 సినిమాకు తెలుగులో డబ్బులొస్తాయి, సూర్య రెట్రోకు తమిళంలో డబ్బులొస్తాయి… మార్కెట్‌లో పెద్దగా థియేటర్ల దాకా ప్రేక్షకుల్ని రప్పించే సినిమాలు లేవు కాబట్టి…
Share this Article