.
ఎవరో సింగిరెడ్డి అట… బహుశా కేసీయార్ అభిమాన బీఆర్ఎస్ నాయకుడు అయి ఉంటాడు… అంటేనే అర్థం అవుతోందిగా… ఫాఫం తన రేంజ్ ఏమిటో… కేసీయార్ పాత మంత్రుల గురించి తెలిసిందే కదా…
ఏమిటీ నాన్సెన్స్… ప్రపంచ సుందరీమణుల కాళ్లు కడగడం ఏమిటి..? అసలు రేవంత్ రెడ్డికి బుద్ధి, తలకాయ ఉందా అన్నట్టు ఏవో విమర్శలు చేశాడు… సరే, మన అతిథుల కాళ్లు కడగడం, స్వాగతం చెప్పడం అంత దిక్కుమాలిన చర్యా..? ఏమో… సదరు కేసీయార్ వీరాభిమానికే తెలియాలి…
Ads
అన్నట్టు… ఏమాటకామాట… ఇలాంటి నాయకుల్ని కాసేపు వదిలేద్దాం… కేసీయార్‌కు ఫాఫం ఇలాంటోళ్లే కావాలి కదా… కానీ ఇదే ఈవెంట్ కేసీయార్ హయాంలో గనుక జరిగి ఉండి ఉంటే… భూనభోంతరాలు దద్దరిల్లేలా ప్రచారం జరిగేది…
కోట్ల ఖర్చు జరిగేది… మీడియా ఊగిపోయేది… హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెరిగి ఉండేది… కానీ అన్ని అంశాల్లోలాగే ఫాఫం రేవంతుడి సర్కారుకు ఏ సోయీ లేదు, ఆశించడం కూడా అత్యాశే… పేరాశే… దురాశే…
తనకు ఐఅండ్‌పీఆర్ విభాగం ఉంటుంది… సీఎంకు చీఫ్ పీఆర్వో ఉంటాడు… కాంగ్రెస్‌కు సునీల్ కనుగోలు టీమ్ ఉంటుంది… మంత్రులకు సపరేటుగా పీఆర్వోలు ఉంటారు… కానీ ఓ ప్రపంచ స్థాయి ఈవెంట్ జరుగుతూ ఉంటే కనీసం ఓ పిచ్చి శంకుస్థాపన రేంజు ప్రచారం కూడా లేదు… ఐ పిటీ రేవంత్ రెడ్డీ…
ఏదో ప్యాలెసులో దావత్ ఇచ్చాడు… నాగార్జున, అల్లు అరవింద్ కలిశారు… ఇవా వార్తలు..? తెలంగాణ ప్రజాసంబంధాల శాఖ సిగ్గుపడాలి… ఉన్న సీఎం చీఫ్ పీఆర్వోను పంపించేశారు… ఎందుకు పంపించేశారో కూడా సదరు రేవంతుడికే తెలియాలి… మరి కొత్తగా ఎవరో ఎవరికీ తెలియదు… కాస్త నయం, వరంగల్ ఐఅండ్‌పీఆర్ బెటర్…
కేటీయార్ నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు ఖర్చు చేశాడు అని కేసు పెట్టారు కదా ఫార్ములా వన్ గురించి… ఆ పిచ్చి ఈవెంటుకే ధూంధాం ప్రచారం చేశారు… ఇక్కడ ఖర్చును రూపాయల్లో లెక్కించకూడదు… బ్రాండ్ ఇమేజీ, హైదరాబాద్ ఖ్యాతి గురించి చెప్పుకోవాలి…
మరి ఓ ప్రపంచస్థాయి ఈవెంట్ నిర్వహిస్తుంటే ఎంత బలంగా జనంలోకి, ప్రపంచంలోకి తెలంగాణ పేరు, హైదరాబాద్ పేరు వెళ్లాలి..? మీడియో ప్రత్యేక కథనాలు, హంగామా దద్దరిల్లిపోవాలి… ప్చ్, ఫుల్లు నిరాశే… చివరకు కొందరు ముఖ్య విలేఖర్లు ఐడీ కార్డులు, పాసులు అడిగితే కూడా ఇవ్వలేని దురవస్థ… సరే, ఫాఫం రేవంత్ సర్కారు కదా, అదంతే అనుకుందామా..?
వరంగల్ నుంచి కాస్త ప్రచారం నయం… ప్రపంచ సుందరీమణులు తెలంగాణ అనుకూల కట్టుబొట్టు, చీరకట్టు… చేతుల్లో బతుకమ్మ, బతుకమ్మ స్టెప్పులు… మంచి వీడియోలు అక్కడక్కడా సోషల్ మీడియాలో కనిపించాయి గానీ ప్రభుత్వానికి మాత్రం వీటిని టీవీల్లో ధూంధాం చేయించాలనే సోయి కనిపించలేదు…
సరే, ఎలాగూ పిచ్చి టీవీ చానెళ్లు, వాటికి ప్రయారిటీలు తెలియవు, కానీ ప్రభుత్వానికైనా ఓ వ్యూహం ఉండాలి కదా… ఖర్చు ఎవరెంత భరించాలనే విషయంలో విమర్శలు, సరే, ఎలాగూ స్మిత సబర్వాల్‌ను తప్పించారు… కాస్త బెటర్, కానీ బాధ్యతల్ని హంగామా చేసే ఇంకెవరికైనా అప్పగించాలి కదా, అదీ దిక్కులేదు…
ప్రపంచస్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెంచుకోవడానికి ఇది అద్భుత సందర్భం అనే సోయే లేదు ప్రభుత్వ ముఖ్యులకు… అసలు ప్రభుత్వంలో ఉన్నవాళ్లకు ఎవరికీ తెలియదు ఈ ఈవెంట్ ప్రాముఖ్యత ఏమిటో…
చివరగా… చార్మినార్ దగ్గర అందగత్తెలు, రామప్పలో వాళ్లు, వరంగల్ కోటలో వాళ్లు, చీరకట్టులో వాళ్లు, బొట్టుతో వాళ్లు, బతుకమ్మతో వాళ్లు… ప్రతిదీ ప్రచారానికి అపురూపమే… హబ్బ, ఈ స్థానంలో చంద్రబాబు గనుక ఉండి ఉంటే ఆకాశమే హద్దుగా ప్రచారం ఉండేది… కానీ ఆ బాబు శిష్యుడికి ఫాఫం, అదేమీ చేతకావడం లేదు..!!
Share this Article