Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కమాన్ నక్సల్ కామ్రేడ్స్… ఏవీ ల్యాండ్ మైన్స్, ఏవీ క్లెమోర్ మైన్స్, ఏదీ ఆర్డీఎక్స్..?!

February 8, 2023 by M S R

కూల్చేయండి, కాల్చేయండి, మటాష్ చేసేయండి, మట్టిలో కలపండి… కమాన్, నక్సలైట్లూ గేరప్… మంతుపాతర్లు పట్టుకురండి, ప్రగతిభవన్ పేల్చేయాలి……. ఇలా ఉంది రేవంత్ మాటల తీరు… పరిణతి చెందిన నాయకుల నోటి నుంచి వచ్చే ప్రతి మాటకూ జవాబుదారీతనం ఉండాలి, వెనకాముందు ఆలోచన ఉండాలి, మంచీచెడూ బేరీజు వేయబడాలి… అది రాజనీతిజ్ఞత… అంతేతప్ప జనం చప్పట్లు కొడుతున్నారు కదాని ఏదిపడితే అది మాట్లాడితే అంతిమంగా తనకు నష్టం, తన పార్టీకి నష్టం… ప్రత్యర్థులకు చేజేతులా పావులు అప్పగించడమే…

రేవంత్ రెడ్డి మాటలో దూకుడు ఉంటుంది… ప్రస్తుతం టీపీసీసీలో మిగతా నేతలకన్నా జనం కనెక్టయ్యేలా మాట్లాడగలడు… క్రౌడ్ పుల్లర్… కానీ ఈ పేల్చుడు భాష ఏమిటి హఠాత్తుగా..!? ప్రైవేటు సంభాషణల్లో కూడా ఆచితూచి మాట్లాడటం వివేక లక్షణం, అలాంటిది జనంలో ఉన్నప్పుడు, అదీ పార్టీని ఉద్దరించే పనిలో ఉన్నప్పుడు ఇలాంటి బ్లాస్టింగ్ లాంగ్వేజీతో వచ్చేదేమీ లేకపోగా, అదనపు నష్టాన్ని కలగజేస్తుంది… అంతేకాదు, కొన్ని నిజాలు తెలిసిన విజ్ఞులు నవ్వుకునే ప్రమాదం కూడా ఉంది…

తను ఏమంటున్నాడు..? ‘‘ప్రగతిభవన్ వేస్ట్, ఉపయోగం లేదు… పేదలకు ఉపయోగం లేని ఆ భవన్ ఉన్నా లేకున్నా ఒకటే, కాబట్టి పేల్చేయాలి’’… సో, పేదలకు ఏమైనా మంచి చేయాలంటే అది నక్సలైట్లు మాత్రమే చేయగలరు అని బ్లాంకెట్ సర్టిఫికెట్ ఇస్తున్నాడా రేవంతుడు..? పేదలకు ఏమైనా ఉపయోగపడే పని చేయడం నక్సలైట్ల వల్ల మాత్రమే సాధ్యమని చెబుతున్నాడా..? ఇదెక్కడి విధ్వంస భాష, ఇదేం జేసీబీ లేదా ఆర్డీఎక్స్ ధోరణి..?

Ads

revanth

ధరణిని తిట్టావ్, వోకే, అది ఖచ్చితంగా పేదలకు నష్టదాయిని… ఇంకాస్త తిట్టినా పర్లేదు… కష్టపడి పనిచేసే నేతలకే టికెట్లు ఇస్తాం, అదీ వోకే, మీ పార్టీ మీ ఇష్టం, నీ చేతుల్లో ఏమైనా ఉంటే ఎన్నయినా మాట్లాడొచ్చు, ఐనాసరే, పీసీసీ అధ్యక్షుడిగా ఆ మాటలు చెబితే సబబే… అద్దాల మేడల కలెక్టరేట్లు దేనికి అని అడగడం దేనికి..? అవి ప్రజల సొత్తు… సరిగ్గా వాడుకుంటే అన్ని ప్రభుత్వ ఆఫీసుల్ని ఒకేచోట పనిచేయించవచ్చు… రబ్బరు చెప్పులతో తిరిగిన ఆ కుటుంబానికి వందల ఎకరాల ఫాంహౌజులు ఎలా వచ్చాయి..? రాజకీయ ప్రత్యర్థిగా ఈ విమర్శ కూడా అభ్యంతరకరం కాదు…  కేసీయార్‌తో కలిస్తే పోతారు, నాశనమైపోతారు అని లెఫ్ట్ పార్టీలకు శాపనార్థాలు పెడుతున్నావంటే నీ ఇష్టం… కేసీయార్‌తో కలిశారు కాబట్టి, వాళ్లూ రాజకీయ ప్రత్యర్థులే కాబట్టి నాలుగు మాటలు ఎక్కువ అన్నా రాజకీయంగా అభ్యంతరకరం కాదు… కానీ..?

కానీ, ప్రగతి భవన్ పేల్చేయడం ఏమిటి..? అదేమైనా కేసీయార్ సొంత భవనమా..? ముఖ్యమంత్రి రెసిడెన్స్… ఒకవేళ తెలంగాణ సమాజం గనుక రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే, తను ఉండబోయే భవనం కూడా అదే… మరి పేల్చేయడం దేనికి..? తెలుగు కమర్షియల్ పాపులర్ సినిమాల్లో హీరోలు వాడే పిచ్చి మాస్ మసాలా భాష ఇది… అంతుతప్ప రాజకీయ విజ్ఞత లేదు ఈ వ్యాఖ్యల్లో… పాదయాత్రతో వచ్చే ఫాయిదా ఇలాంటి వ్యాఖ్యలతో హళ్లికిహళ్లి అవుతుంది… కేసీయార్ ఫామ్ హౌజ్‌ కూల్చేద్దాం, తన భూముల్ని ఆక్రమించుకుందాం అంటే కనీసం నక్సల్స్ భాష ఒంటబడుతోంది అనుకోవచ్చు… ప్రగతిభవన్ ప్రజల ఆస్తి, దాన్ని కూల్చేస్తే ఏమొస్తుంది..? కొత్త సచివాలయంలాగా వందల కోట్లు పెట్టి, మరో మాన్యుమెంట్ వంటి కొత్త భవనాన్ని, అదీ బుల్లెట్ ప్రూఫ్, బ్లాస్టింగ్ ప్రూఫ్, మిసైల్ ప్రూఫ్ బిల్డింగు కడతాడు కేసీయార్… అదేనా రేవంతుడు కోరుకునేది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సారీ-గమలు… మళ్లీ అదే పోకడ… అసలు తప్పేమిటో తెలియడాయె…!!
  • కాకులూ పగబడతాయ్… గుంపుకట్టి దాడిచేస్తయ్… ప్రతీకారం తీర్చుకుంటయ్…
  • ఆరోజున ఆ ముప్పు నుంచి లక్కీగా ఎలా తప్పించుకున్నామంటే..!!
  • విషాదమే… కానీ ఉన్మాదం… కర్నాటక సర్కారు ఘోర వైఫల్యం…
  • ఒక ఫోటో… కవితకు అసలు తెలియదో లేదో… గుర్తుందో లేదో ఫాఫం…
  • 500 రూపాయల నోట్ల చెలామణీపై వార్తలేమిటి..? నిజాలేమిటి…?
  • బాలీవుడ్ డింపుల్ క్వీన్… ప్రీతి మరో మొహం… 34 మంది పిల్లల తల్లి…
  • ఆ పాత్ర దెబ్బతినేసింది… ఫాఫం రాజేంద్ర ప్రసాద్ మెడ విరిగింది…
  • మాటే పాటైనవాడు. పాటే బాటైనవాడు. మనకు కర్ణామృతమైనవాడు
  • ఎంత డబ్బిచ్చినా సరే.., మోహన్‌బాబుతో మాత్రం పోను అంటుందామె..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions