.
ఫాఫం రేవంత్ రెడ్డి… తనకు పాలనలో అనుభవం లేదు సరే… కనీసం రోషం, పౌరుషం గట్రా ఏమీ లేవా…? కేసీయార్ మీద వ్యతిరేకతతో తనను సమర్థించినవాళ్లు సిగ్గుతో తలదించుకునే పాలన ధోరణులే… అవును, ఫాఫం తెలంగాణ…
ఉదాహరణ..? స్మిత సబర్వాల్..! ఆమె పేరుకు ఓ ఐఏఎస్ అధికారిణి… పలు విమర్శలు గట్రా మనం వాటి జోలికి పోనక్కర్లేదు గానీ… పక్కా బీఆర్ఎస్ యాక్టివిస్టుగా ఫోకస్ అవుతోంది…
Ads
అవును, నిజమే, ఐతే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడట అన్నట్టుగా తన ధోరణి కనిపిస్తోంది… గతం వదిలేయండి… హెచ్‌సీయూ ల్యాండ్స్ వివాదంలో ఎఐ ఫోటోలు, ఎడిటెడ్ వీడియోలు షేర్ చేసినప్పుడు ఏమాత్రం రెడ్డి పౌరుషం ఉన్నా సరే చాలా సీరియస్‌గా రియాక్టయ్యేవాడు…
అది లేదు కదా… జస్ట్, నోటీసులు ఇచ్చారు… అవునోయ్ రేవంతూ, నాకు ఇచ్చావు సరే, నాలాగే వాటిని షేర్ చేసిన 2000 మందికీ నోటీసులు ఇస్తావా అని మరో ట్వీట్ కొట్టింది ఆమె… సింపుల్, నీకు ఏం చేతనైతే అది చేసుకో అని… ధిక్కారం…
ఇక్కడ కనిపించాల్సింది జనం ఎన్నుకున్న ప్రభుత్వం టెంపర్‌మెంట్… అది ఎలాగూ లేదు కదా రేవంత్ సర్కారుకు… అసలు తన గురించి తెలుసు, సర్కారు ముఖ్యుల బుర్రలు పనిచేస్తే భగీరథ అక్రమాలపై ఆమెను బుక్ చేయాలి అసలు…
లేదు, ఆమెకు ఏదో పోస్టింగు ఇచ్చారు… ఆమె ఏకంగా వరల్డ్ బ్యూటీ కంటెస్ట్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం తరఫున… ఎవరో వరల్డ్ బ్యూటీ వస్తే పొన్నం ప్రభాకర్ కూడా స్వాగతం పలుకుతున్న ఫోటో చూశాను… ఈలోపు ఈ హెచ్‌సీయూ గొడవ…
రేవంత్ రెడ్డికి ఆమె కేసీయార్ మనిషే అని తెలిసినప్పుడు… ఏం చేయాలి…? ఎస్, డీవోపీటీకి సరెండర్ చేయాలి… ఈమెకు సర్వీస్ కండక్ట్ రూల్స్ తెలియవు, ఓ పొలిటికల్ పార్టీ యాక్టివిస్టు అని పంపించేయాలి… కానీ రేవంత్ రెడ్డికి చేతకాలేదు… అసలు ఏం చేతనైందని…
ఇప్పుడు పేరుకు ఏదో బదిలీ… మళ్లీ తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీ అట… ఫాఫం రేవంత్ సర్కారు… ఈ సర్కారు వచ్చిన కొత్తలో ఇచ్చిన పోస్ట్ … ఎహె, ఏం చేసుకుంటావో చేసుకోఫోవోయ్ అని బహిరంగంగా సవాల్ చేసినట్టుగా వ్యవహరించినా సరే, రేవంత్‌కు ఆ పౌరుషం లేదు, రోషం లేదు… అయినా కేటీఆర్ అరెస్టుకే గజగజ కదా…
సరే, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అట… ప్రస్తుతం ఫైనాన్స్ చూస్తున్నాడు,., ఏదో నడిపిస్తున్నాడు కదాని రేవంత్ చేరదీసి, అక్కున చేర్చుకుని ఈసారి ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేశాడు… నాకు కేసీయార్ బలగమే తప్ప వేరే దిక్కులేదు అని తలవంచుకుని ఆమోదిస్తున్నాడు…
సేమ్, జయేష్ రంజన్… అందరూ… మరి సివిల్ సర్వీసుల వాళ్లను ఇగ్నోర్ చేయలేం కదా అంటారా..? ఏపీలో పాత ఇంటలిజెన్స్ ఐజీ దగ్గర నుంచి చంద్రబాబు ఒక్కొక్కరినీ వేటాడుతున్నాడు… ఆ చంద్రబాబు శిష్యుడు రేవంతుడికి ఇంకా ఆ పరిణతి రాలేదు, ఆ పౌరుషమూ లేదు… ఇప్పుడు చెబుతున్నా… ఫాఫం తెలంగాణ..!!
Share this Article