Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజంగా సిగ్గుపడాల్సిన ఓ వైఫల్యం..!!

February 18, 2026 by M S R

.

రాయొద్దనే అనుకున్నా… కటువుగా ఉన్నా సరే ఓ నిజం… రేవంత్ రెడ్డి తన రెండున్నరేళ్ల పదవీకాలంలో సిగ్గుతో తలదించుకోవాల్సిన వైఫల్యం జర్నలిస్టులు- అక్రెడిటేషన్లు… ఈరోజుకూ దాన్ని పెంట పెంట చేసి పెట్టారు…

రేవంత్ రెడ్డి దౌర్భాగ్యం ఏమిటంటే… జర్నలిస్టులు ఎవరూ ఓ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని దూషించరు… తనకు అవేమీ పట్టవు… ఒక సీపీఆర్వో మల్సూర్‌ను తప్పుపట్టరు, అసలు తను మాజీ బ్యూరోక్రాట్ తప్ప, జర్నలిజం అంటే తెలియదు… ఒక ఐఅండ్‌పీఆర్ కమిషనర్ ప్రియాంక, ఆమెకు అసలేమీ తెలియదు… చివరగా పొంగులేటి… తన గురించి ఏం చెప్పినా వేస్ట్…

Ads

వీళ్లంతా కలిసి రేవంత్ రెడ్డిని చివరకు జర్నలిస్టు ద్రోహిగా మార్చేస్తున్నారు… ఈ నిజం తనకు తెలియకపోతే తన దౌర్భాగ్యం అది… అసలే ఇళ్ల స్థలాల విషయంలో ఆహోఓహో అని చప్పట్లు కొట్టించుకుని, ఇప్పుడు తెల్లమొహం వేసి, జర్నలిస్టు సర్కిళ్లలో మస్తు విమర్శలకు గురవుతున్నాడు… నీ హామీకి ఏం విలువ ఉన్నట్టు పాలకా..? నీకూ జర్నలిస్టు ద్రోహి కేసీయార్‌కూ ఇక ఏం తేడా ఉన్నట్టు..?!

పోనీ, అక్రెడిటేషన్లు..? తను ఎవరిని నమ్ముకున్నాడో గానీ… పాపం, రెండేళ్ల నుంచి దానికి ఓ దశ లేదు, ఓ దిశ లేదు… సంక్షేమం అన్నారు, సమగ్ర హెల్త్ కార్డులు అన్నారు, చివరకు పొంగులేటి తనకు ఏం తెలుసో లేదో తెలియదు గానీ ఏకంగా 44 వేల అక్రెడేషన్ కార్డులు అన్నాడు… ఆలూ లేదు, చూలూ లేదు,, అసలు ఆ నంబర్ ఎలా వచ్చింది..? అంటే, తన టీమ్ అంత దరిద్రంగా ఉందీ, తనకు ఏమీ అర్థం కావడం లేదూ అని అర్థం…

ఐ పిటీ పొంగులేటి… ఐ పిటీ శ్రీనివాస్ రెడ్డి, ఐ పిటీ ప్రియాంక, ఐ పిటీ మల్సూర్…. కాదు ఐ పిటీ రేవంత్ రెడ్డి… (నాకు అక్రెడిటేషన్ ఇవ్వకపోయినా సరే, ఐనా దరఖాస్తు కూడా చేసుకోలేని దౌర్భాగ్యం… అంత చెత్తా సిస్టం ప్రిపేర్ చేశారు… అంత పెంట పెంట చేసేశారు దీన్ని… ఇన్ని నెలలైంది కదా… దరఖాస్తులకు ఓ పూల్ ప్రూఫ్ సిస్టం ఏర్పాటు చేశారా..? లేదు, అదీ చేతకాలేదు…)

శ్రీనివాస్‌రెడ్డి అనే కేరక్టర్‌ను కాసేపు పక్కన పెట్టండి… నిజంగా ఓ రియల్ జర్నలిస్టు అక్రెడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా…? లేదు… దీనికన్నా ఓ ఐఏఎస్ పరీక్ష రాసి క్రాక్ చేయడం డెడ్ ఈజీ… అసలు దరఖాస్తు పోర్టల్ ఏమిటో తెలియదు… ఎవరో షేర్ చేశారు, అది ఓపెన్ కాదు… ఓపెన్ అయినా సరే, అనేకానేక షరతులు, పేపర్లు, డాక్యుమెంట్లు, అపాయింట్‌మెంట్ లెటర్లు… మీరేమైనా ఉద్యోగాలు ఇస్తున్నారా శ్రీమాన్ రేవంత్ రెడ్డీ…

అన్నింటికీ మించిన జోక్,… ఫ్రీలాన్స్ జర్నలిస్టులు… పక్కాగా చెబుతున్నా, వీళ్లు ప్రిపేర్ చేసిన అర్హతల్లో ఒక్కడంటే ఒక్కడికీ ఈ కేటగిరీలో అక్రెడిటేషన్ రాదు… మెయిన్ స్ట్రీమ్‌లో ఆరు నెలల్లో పదో ఇరవయ్యో బైలైన్‌తో ఆర్టికల్స్ వచ్చి ఉండాలట… అవి లేకపోతే వాడు ఫ్రీలాన్సర్ కాదా… వెల్ నోటెడ్ వెబ్ సైట్లలో వందల ఆర్టికల్స్ రాసినవాడు అసలు జర్నలిస్టే కాడా..? ఎవరు పెట్టారు ఈ నిబంధనలు..?

వెటరన్ జర్నలిస్టులకూ ఇదే తంటా… ఏవేవో అడిగారు… అసలు ఆ పోర్టల్ అంటూ ఓపెన్ అయితే కదా… ఎన్నెన్నో కాగితాలు, అప్‌లోడ్స్, ఎంబీ లిమిట్స్, పదే పదే ఎర్రర్స్… ప్రపంచంలో ‘‘ది గ్రేటెస్ట్’’ అని అవార్డు ఇవ్వాల్సింది ఈ పోర్టల్ మెయింటెనెన్స్ వాడిని, ఈ అర్హతలు పెట్టినవాడిని…. అవును, అంతిమంగా రేవంత్ రెడ్డిని..!!

(32 సంవత్సరాల నా అక్రెడిటేషన్ ప్రస్థానానికి ఈరోజు నీళ్లు, నివాళ్లు వదిలాను… పుణ్యం ఈ సీఎంకే దక్కుగాక… నీ మంత్రి ది గ్రేటెస్ట్ పొంగులేటి పనితీరును చూసి నువ్వు గర్వపడి కాలర్ ఎగరేసుకోవచ్చుగాక…)

అసలు ఈ అక్రెడిటేషన్ల జీవో చూశాక మీడియా కార్డుల పేరిట జర్నలిస్టుల్లోనూ వర్గీకరణ తీరు చూసి, సమస్త తెలంగాణ జర్నలిస్టు లోకం బండబూతులు తిట్టింది… తరువాత నాలుక కర్చుకుని, చెంపలేసుకుని ఏవో సర్దబాటుగా, అందరికీ ఇస్తాం అన్నారు… ఆ సవరణ జీవో ఏది..?

చివరగా… అక్రెడిటేషన్లతో ఏమొస్తుందీ అని..? రైల్వే పాసుల్ని అశ్విని వైష్ణవ్ అనే ఓ కేరక్టర్ రద్దు చేసి పారేసింది… థాంక్స్ టు మోడీ… తనెప్పుడూ కామన్ మ్యాన్ కోణంలో ఆలోచించి ఏడిస్తే కదా… అసలు సీనియర్ సిటెజిన్లకే ద్రోహం చేశారు కదా రైల్వే ప్రయాణాల్లో… మిగిలింది బస్సు పాసులు… సగం మంది కూడా ఆ పాసులు తీసుకోవడం లేదు…

హెల్త్ కార్డులు… అసలు ఒక్క కార్పొరేట్ హాస్పిటల్‌ను చూపించండి, ఈ కార్డుల్ని ఆనర్ చేస్తున్నవాటిని..! మరింకేముంది అంటారా..? ప్రభుత్వ గుర్తింపు అనేది ఓ గౌరవం, ఓ గుర్తింపు… అంతకుమించి ఏమీ లేదు… మరి ఈ మాత్రం మొక్కుబడి సాయానికీ ఇన్ని ఏడుపులు దేనికి..? రేవంత్ రెడ్డీ… నిజంగా ఈ కోణంలో నువ్వు పెద్ద ఫ్లాప్… ఫ్లాపున్నర..,!! అక్కడికి ఏదో రిటైర్డ్ వాళ్లకు పెన్షన్లు ఇస్తున్నట్టు, నెత్తిన మోస్తున్నట్టు..!!

సారీ, బ్రదర్స్... అక్రెడిటేషన్ కమిటీలో సభ్యులుగా ఎంపికైనవాళ్ల పట్ల నా సానుభూతి... ఈ విషయంలో అల్లం నారాయణను, పాత కేసీయార్ సర్కారును మెచ్చుకోవడానికి నాకేమీ భేషజాలు లేవు... 

  • ఇంకొన్ని చెప్పుకోవాలి… 10 లక్షల సర్క్యులేషన్ ఉన్నవాడికీ అదే పది మంది స్టాఫ్ అవసరమైతే, లక్ష సర్క్యులేషన్ ఉన్నవాడికీ అదే పది మంది కావాలి… అందరూ చేసేది అదే పని… మరి సర్క్యులేషన్‌ను బట్టి అక్రెడిటేషన్ల సంఖ్య అనేది ఏ ప్రామాణికం..?
  • ఈ రూల్స్ ఫ్రేమ్ చేసినవాళ్లకు మినిమం జర్నలిస్టిక్ సెన్స్ లేదని చెప్పడానికి మరో ఉదాహరణ, వెబ్ జర్నలిస్టులు… గత ఆరు నెలల్లో కనీసం అయిదేసి లక్షల వ్యూయర్స్ అట… పక్కా ఆంధ్రా సినిమా సైట్లకు తప్ప ఇంకెవడికీ ఉపయోగపడదు ఇది… ఎవరిని ప్రమోట్ చేస్తున్నట్టు వీళ్లు..?
  • అపాయింట్‌మెంట్ లెటర్లు పెట్టాలట మిగతావాళ్లు… అసలు ఎన్ని మీడియా సంస్థలు ఈ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇస్తున్నాయో కూడా తెలియదా ఈ రూల్స్ ఫ్రేమ్ చేసినవాళ్లకు..?
  • సరే, అపాయింట్‌మెంట్ లెటర్లు ఇస్తాం, వేజ్ బోర్డు జీతాలిప్పిస్తుందా ఈ ప్రభుత్వం..?! ఇలా ఎన్నో, ఎన్నెన్నో..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజంగా సిగ్గుపడాల్సిన ఓ వైఫల్యం..!!
  • ‘బలుపు కా బాప్’… నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేశావురా హార్దిక్…
  • తెలంగాణ రాజకీయాల్లో ఓ సైలెంట్ మార్పు..! బీసీ, వుమెన్ చైతన్యం..!
  • హోర్ముజ్ జలసంధిపై కుదరని సంధి… మళ్లీ ఉద్రిక్తతలు…
  • స్వరరచనలో లబ్ధి ప్రతిష్ఠుడే… లిటిగెంటుగా పే-ద్ద లుబ్ధ ప్రతిష్ఠుడే…
  • ఏపీ రాజకీయాల్లో కోవా – నెయ్యి – పెరుగు – ప్రతిదీ గాయిగత్తరే…
  • కరీంనగర్ ఇషాన్ కిషన్… బండి సంజయ్… ఓ ఉత్కంఠభరిత మ్యాచ్..!!
  • మేడం సార్, మేడం, అంతే… వయస్సు మీద పడినా భానుమతి లెవల్ అదే…
  • 24 ఏళ్లు సరే… అసలు ప్రత్యూష కేసులో న్యాయం జరిగినట్టేనా..?
  • నచ్చిన వార్త..! కొన్ని ఉద్వేగాలకు లెక్కలు, లాజిక్కులు ఉండవ్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions