Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దావోస్‌లో తెలంగాణ హల్‌చల్… మరి ఏపీలో పెట్టుబడులు..?!

January 23, 2025 by M S R

.

తెలంగాణ సీఎంవో విడుదల చేసిన దావోస్ ఒప్పందాలు చకచకా ఓసారి చదవండి…

16 ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు, రూ.1,64,050 కోట్ల పెట్టుబడులు, 47,550 ఉద్యోగాలు (1.79 లక్షలు అని ఇంకో వార్త)

Ads

1. సన్ పెట్రో కెమికల్స్: భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు. 3400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో విద్యుత్తు. 5440 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు. రూ. 45,500 కోట్ల పెట్టుబడులు, 7,000 ఉద్యోగాలు

2.అమెజాన్ వెబ్ సర్వీసెస్: ఏఐ, క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లలోభారీ పెట్టుబడులు. రూ. 60,000 కోట్లు.

3. కంట్రోల్ ఎస్ (CtrlS): తెలంగాణలో అత్యాధునిక AI డేటాసెంటర్ క్లస్టర్‌. 400 మెగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్. రూ. 10,000 కోట్లు, 3,600 మందికి ఉపాధి.

4. జేఎస్ డబ్ల్యూ సంస్థ: రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ – రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలంగా మారనుంది. రూ.800 కోట్ల పెట్టుబడులు, 200 ఉద్యోగాలు.

5. స్కైరూట్ ఏరో స్పేస్‌: తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు. రూ.500 కోట్ల పెట్టుబడులు

6. మేఘా ఇంజనీరింగ్ (MEIL) మూడు కీలక ఒప్పందాలు. రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్రాజెక్టు. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్. రూ.15000 కోట్ల పెట్టుబడులు, 5250 మందికి ఉపాధి.

7. హెచ్సీఎల్. టెక్ సెంటర్: హైటెక్ సిటీలో3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సీఎల్ కొత్త క్యాంపస్‌. 5000 మందికి ఉపాధి.

8. విప్రో : హైదరాబాద్ లో విప్రో కంపెనీ విస్తరణ. గోపనపల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్. 5,000 మందికి ఉద్యోగాలు.

9. ఇన్ఫోసిస్: హైదరాబాద్ లో ఇన్పోసిస్ క్యాంపస్ విస్తరణ. పోచారంలో ఐటీ క్యాంపస్‌ లో కొత్త సెంటర్. రూ. 750 కోట్ల పెట్టుబడులు, 17,000 ఉద్యోగాలు.

10. యూనిలివర్ కంపెనీ: కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్. రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌లను ఉత్పత్తి చేసే కొత్త తయారీ యూనిట్‌ ఏర్పాటు. దాదాపు వెయ్యి ఉద్యోగాలు.

11. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్: హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్ ఎర్పాలు. 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు. రూ.15,000 కోట్ల పెట్టుబడులు

12. ఉర్సా క్లస్టర్స్ : అమెరికాకు చెందిన మరో కంపెనీ ఉర్సా క్లస్టర్స్ అత్యాధునిక అర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను స్థాపించనుంది. రూ. 5000 కోట్ల పెట్టుబడులు

13. బ్లాక్‌స్టోన్ : ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ హైదరాబాద్లో 150 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు. ₹4,500 కోట్ల పెట్టుబడులు

14.అక్షత్ గ్రీన్ టెక్ (మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ) : అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు. రూ.7,000 కోట్ల పెట్టుబడులు.

15.ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ : ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ దాదాపు 800 మంది ఉద్యోగులకు సదుపాయముండేలా హైదరాబాద్ లో కొత్త ఆఫీసు.

16.సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్‌: సంగారెడ్డిలో ప్రస్తుతమున్న సుహానా ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు…

గుడ్… ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ముద్ర కనిపిస్తోంది… హైదరాబాద్ బ్రాండ్ కూడా పనిచేస్తోంది… వీటిలో ఎన్ని నిజంగా వర్కవుట్ అవుతాయనేది పక్కన పెడితే… చివరకు మేఘా ఒప్పందాలకు దావోస్ ఎందుకనే ప్రశ్నలూ పక్కనపెడితే… పెట్టుబడుల ప్రవాహం అనే ఓ సీన్ మాత్రం క్రియేట్ చేయగలిగింది తెలంగాణ టీం…

(సన్ పెట్రో కెమికల్స్ పెట్టుబడులకు సంబంధించి రేవంత్ రెడ్డి ఎదుట సంతకాలు చేసిన వ్యక్తి సీఈవో దిలీప్ సంఘ్వీ కాదని ఓ వార్త… గత నెలలోనే బీహార్‌తో ఇదేతరహా ఒప్పందం అని మరో వార్త… అంతా పబ్లిసిటీ మాయ కాదు కదా..?)

మరి ఏపీ..? చంద్రబాబు, లోకేష్ కూడా భారీ టీమ్‌తో వెళ్లారు… మన తెలుగువాడి కంపెనీ గ్రీన్‌కోతో ఒప్పందం మినహా… అదీ అక్కడికి వెళ్లి మరీ ఎంవోయూలు అక్కర్లేదు… మరి ఇంకేమైనా పెద్ద పెట్టుబడుల ఎంవోయూలు కుదిరాయా..?

ఏమో, చదివినట్టు గుర్తు లేదు… అబ్బే, దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు కేవలం కనెక్టింగ్ ప్లాట్‌ఫారమే తప్ప అక్కడే అన్నీ కుదరాలని ఏమీ లేదు అంటారేమో… మరి గతంలో ఇదే దావోస్ విజయాలు అని ఊదరగొట్టారు కదా… మరిప్పుడు ఏమైంది..?

దీనికీ పాత జగన్ నీచ, దుర్మార్గ, నికృష్ట పాలనే కారణం అని ఇంకా మొదలుపెట్టలేదా..? ఆల్రెడీ లోకేష్ చెబుతున్నాడు కదా, మళ్లీ జగన్ అధికారంలోకి రాడని రాసిస్తే తప్ప ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి రారని..! పెట్టుబడులు వస్తాయో రావో తరువాత… కనీసం ప్రచారం కోసమైనా నాలుగు ఒప్పందాల వివరాలు జనంలోకి విసరొచ్చు కదా బాబు గారూ..!!

అవునూ… తెలంగాణను కేసీయార్ బాగా డెవలప్ చేశాడు కాబట్టి ఇంతగా పెట్టుబడులు పెట్టడానికి అందరూ ముందుకొస్తున్నారని బీఆర్ఎస్ ప్రముఖులు ఇంకా స్టార్ట్ చేయలేదా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వై నాట్..? జూనియర్ ఎన్టీఆర్ భిన్న పాత్రల్ని ఎందుకు చేయకూడదు…?!
  • ‘ఇంకేదో కావాలనే’ మోజు, ఆకర్షణల ముందు పాతివ్రత్యాలు బలాదూర్…
  • ఒక తమిళ కణ్ణదాసన్…. ఒక తెలుగు వేటూరి… వేరే పోల్చలేను సారీ…
  • ఇడ్లీ నూడుల్స్ కాదు… అసలు ఇడ్లీ రకమే కాదు…. పక్కా ఇడియప్పం…
  • ఎక్కడిదో ఈ దుఃఖ మేఘం, ఆగకుండా వెక్కి వెక్కి కురుస్తోంది… కానీ..?
  • పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?
  • పెను విధ్వంసం సృష్టించగల ఓ భారీ విపత్తు వేగంగా సమీపిస్తోంది..!!
  • ఆ కేన్సర్ స్పెషలిస్టు… రిటైరయ్యాక సిద్ధవైద్యంలోకి..! ఎందుకు, ఎవరు..?!
  • ఆమెపై హానీట్రాప్… పడిపోయింది… మన రహస్యాలన్నీ చెప్పేసింది…
  • పురూలియా…! అదొక పెద్ద మిస్టరీ… జవాబుల్లేవు… ఆశించడమూ వేస్ట్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions