Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీజేపీ మతవాదాన్ని ప్రతిఘటించడానికి… లెఫ్ట్ నాస్తికవాదానికి సడలింపులు…

July 24, 2024 by M S R

The New Indian Express లో ఓ వార్త ఆసక్తికరం అనిపించింది… లోకసభ ఎన్నికల్లో ఫలితాల్ని సమీక్షించుకున్న కేరళ సీపీఎం ఇకపై హిందూ ధర్మ కార్యక్రమాల్లో బాగా పాల్గొనాలనీ, గుళ్ల కమిటీల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని, హిందూ వ్యతిరేకతను తగ్గించుకోవాలనీ నిర్ణయించిందట…

తిరువనంతపురంలో జరిగిన మూడు రోజుల లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఈమేరకు విస్తృతంగా చర్చ జరిగిందని వార్త… మొదటి నుంచీ సీపీఎం మతపరమైన కార్యక్రమాలకు దూరం.., హేతువాదాన్ని, నాస్తికత్వాన్ని ప్రమోట్ చేయడం పార్టీ సిద్ధాంతం… 2013లో జరిగిన పాలక్కాడ్ ప్లీనం తన కేడర్ గుళ్ల సందర్శన, మతకార్యక్రమాల నిర్వహణను నిషేధించింది… చివరకు గృహప్రవేశాలప్పుడు నిర్వహించే గణపతి హోమాలకు కూడా వెళ్లకూడదని చెప్పింది…

ఇప్పుడు దాన్ని సడలించుకుంటోంది… ఎందుకు ఈ రివర్స్ పయనం..? కేరళలోని హిందూ సమాజం క్రమేపీ బీజేపీ వైపు కదులుతోందని గ్రహించడం వల్ల..! తమకు బలమైన అడ్డాగా ఉన్న మలబార్ ఏరియాలో కూడా బీజేపీకి వోట్లు పెరిగాయి… హిందువులు సీపీఎంకు దూరంగా జరుగుతున్నారనే స్పృహ కలగడం వల్ల…!

Ads

శబరిమలలోకి రుతుమహిళల్ని సీపీఎం ప్రభుత్వమే ప్రవేశపెట్టిన తీరు గుర్తుంది కదా… అలాంటి చాలా హిందూ వ్యతిరేక చర్యలు సీపీఎంకు అలవాటే అక్కడ… హిందువుల విశ్వాసాల్ని, మనోభావాల్ని దెబ్బతీయడం వల్ల రాజకీయంగా జరుగుతున్న తప్పేమిటో సీపీఐ ఎప్పుడో గమనించింది… శబరిమలలోకి రుతుమహిళల్ని పోలీసు రక్షణతో పంపించడం తప్పేనని తరువాత అంగీకరించింది ఆ పార్టీ…

కానీ సీపీఎం మాత్రం దృఢంగా తన ధోరణికే కట్టుబడి ఉంది ఇన్నాళ్లూ… ఆమధ్య అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిపై విజయం తరువాత ‘తమ ధోరణికే ప్రజలు పట్టం కడుతున్నారని సీపీఎం భ్రమపడింది… కానీ మొన్నటి లోకసభ ఎన్నికల్లో బీజేపీకి పెరిగిన వోట్లు సీపీఎంను ఆత్మసమీక్షలో పడేశాయి… అదీ సంగతి…

cpm(photo :: thomas cook and indian express)

‘మతవాదుల్ని’ ఎదుర్కోవాలంటే… మత రాజకీయాల్ని ప్రతిఘటించాలంటే తామూ మతానుసరణకు మొగ్గడమే మార్గమని భావించింది… తద్వారా హిందూ సమాజం విశ్వాసాన్ని పొందాలనేది ప్రయత్నం… సీపీఎం త్రిపురలో ఎప్పుడో మాయమైంది… బెంగాల్‌లో అనేకచోట్ల గ్రామ కమిటీలు కూడా లేకుండా పోయాయి… ఇప్పుడు కేరళలోనూ అదే వ్యతిరేకత మూటగట్టుకుంటే ఇక పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది…

ఈ స్పృహతో తన రాజకీయ మతవిధానాల్ని సమీక్షించుకుంటోంది సీపీఎం… ఎంతోకాలంగా కేరళలో సంఘ్ పరివార్‌కూ సీపీఎంకూ నడుమ వైరం సాగుతోంది… హత్యారాజకీయాలు కూడా… కానీ ఇన్నేళ్లూ ఆర్ఎస్ఎస్ శాఖలు బలంగా, అధికంగా ఉన్నచోట్ల కూడా బీజేపీ ఎదగలేకపోయింది… కానీ పరిస్థితులు మారుతున్నాయి… అందుకే ఇకనైనా మేల్కొని సంఘ్ పరివార్ దూకుడును నిరోధించాల్సిన అవసరాన్ని గుర్తించినందునే తన విధానాల్ని మార్చుకుంటున్నది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions