Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆయన చెబుతాడు… బిగ్ బాస్ పాటిస్తాడు… ఇప్పుడు మరీ బహిరంగమే…

September 23, 2022 by M S R

రాంగోపాలవర్మ… కడుపులో వోడ్కా పడితే తనేం చేస్తాడో తనకే తెలియదు… ఏం కూస్తాడో, ట్విట్టర్‌లో ఏం రాస్తాడో, సినిమా ఏం తీస్తాడో అసలే తెలియదు… అంతేనా..? పెగ్గు ఎక్కువైతే ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తాడో కూడా కొన్ని వీడియోలు చూశాం కదా… అసలు తను ఓ బిగ్‌బాస్ లేడీ కంటెస్టెంట్‌కు వోట్లు గుద్దేయాలంటూ ఓ బహిరంగ అప్పీల్‌కు పాల్పడ్డాడంటేనే హాశ్యర్యంగా ఉంది… అదిప్పుడు చర్చనీయాంశం అయ్యింది కూడా…

బిగ్‌బాస్ ఇన్నర్ సర్కిళ్లు, తెలుగు టీవీ-సినిమా సర్కిళ్లలో చాలామందికి తెలుసు… ముంబైలో ఈ బిగ్‌బాస్ ప్లానింగ్ చూసుకునే ఓ పెద్దమనిషి వర్మకు బాగా క్లోజ్… సో, వర్మ తనకు క్లోజయిన వారిని అలా హౌజులోకి ప్రవేశపెడుతుంటాడు… వర్మ చల్లని చూపు తమపై పడితే చాలనుకునే లేడీ ఇంటర్వ్యూయర్లు బోలెడు మంది ఇప్పుడు… అప్పట్లో అరియానా గుర్తుంది కదా… ఆ బక్క పిల్లను ఒకేఒక ఇంటర్వ్యూలో ఏదో పిచ్చి కామెంట్ చేసి, ఆమెను హౌజులోకి పంపించేశాడు…

బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో ఆమె టాప్ 5 కంటెస్టెంట్… మధ్యలో ప్రేక్షకులు నెగెటివ్ వోట్లు వేసినా సరే, బిగ్‌బాసోడు ఆమెను బయటికి పంపించడానికి వీల్లేదు, అంతే… తరువాత ఆమెను ఓటీటీ బిగ్‌బాస్‌లోకి కూడా ప్రవేశపెట్టాడు… అక్కడా టాప్ 5 లో ఉంది ఆమె… ఆమే కాదు, ఆషురెడ్డి… ఆమె కూడా ఓ ఇంటర్వ్యూ ద్వారా కనెక్టయింది… ఆమెను బిగ్‌బాస్ మూడో సీజన్‌లో హౌజులోకి ప్రవేశపెట్టాడు… తను తలుచుకుంటే వెళ్లాల్సిందే…

Ads

inaya

బిగ్‌బాస్ మీద అదీ తన పట్టు… అంతెందుకు తన హీరోయిన్ ఇనయ ఉంది కదా… నిన్న ఏదో కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా శ్రీహాన్ ఏదో అన్నాడని ఆమె చాలాసేపు అరుస్తూనే ఉంది… ఏదో పిట్ట అనే పదం వాడాడట… ఒక దశలో చూస్తున్నవాళ్లకే ఇరిటేషన్ తెప్పించింది… ఐనా సరే, ఆమెకు వర్మ సపోర్టుగా నిలిచాడు కదా… ఏమీ కాదు, తన మనిషి కదా… తనకు ప్రియమైన హీరోయిన్ కదా… ఆమెకు వోట్లు వేయాలంటూ వర్మ ఏకంగా ట్వీట్ పెట్టడంతో… గతంలో ఇనయను ఎక్కడెక్కడో పట్టుకుని వర్మ చేసిన డాన్సులు, చివరకు సోయి తప్పి ఆమె కాళ్ల మీద పడిన సీన్లు మళ్లీ వైరల్ అవుతున్నయ్…

rgv

ఇప్పుడు ఆమె నామినేషన్లలో ఉంది… అయితేనేం, ఏమీ కాదు… మొదటి నుంచీ హౌజులో ఓవరాక్షన్ చేస్తోంది… ఎంతసేపూ కెమెరాల అటెన్షన్ పొందుతూ, ఎక్కువ స్పేస్ దక్కించుకును ప్రయత్నం… ఇప్పుడిక వర్మ గారి వోట్ల అప్పీల్ ట్వీట్… జాగ్రత్త నాగార్జునా… వీకెండ్ షోలో తొందరపడి ఏమీ అనబోకు ఆమెను… బలమైన బ్యాక్ గ్రౌండ్ మరి… ఇదీ ట్వీట్ లింక్…

Hope you will support her Login to Disney + Hotstar APP Search for BIGG BOSS NONSTOP CAST YOUR VOTE FOR inaya sulthana (10 Votes) Hotstar link 👉🏻👉🏻 https://t.co/hpGQHjZLev

Give 10 missed calls to 7288877614 https://t.co/Qb2AMTO8lY pic.twitter.com/Dax1DBp76P

— Ram Gopal Varma (@RGVzoomin) September 22, 2022

వర్మ అంటే అంతే మరి… ఇలా ఓ దర్శకుడు బిగ్‌బాస్ కంటెస్టెంటుకు వోట్లేయాలంటూ అభ్యర్థించడం ఇదే మొదటిసారి… అఫ్‌కోర్స్, వర్మలోని దర్శకుడు మరణించి ఉండవచ్చుగాక… కానీ ఒకప్పుడు దర్శకుడే కదా…అన్నట్టు ఇనయ తనకు వర్మ ఎంత క్లోజో చెబుతూ ఇన్‌స్టాగ్రాంలో బోలెడు పోస్టులు పెట్టుకుంది… ఆమె ఖాతాలోకి వెళ్తే అవన్నీ దర్శించవచ్చుగాక… వాటి లింకులు కూడా ఇవ్వబుద్ధి కావడం లేదు ఇక్కడ..! మిస్టర్ వర్మా, ప్రేమిస్తే ప్రేమించావు గానీ, మరీ ఆమెను ఈసారి విజేతను చేయాలంటూ ఆ బిగ్‌బాసోడికి ఆర్డర్ వేయకు ప్లీజ్… బాగుండదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions