అనూహ్యం… అసలు నమ్మబుద్ధి కానంత అసాధారణం… 15 కోట్లతో తీయబడిన ఒక చిన్న కన్నడ సినిమా ఏమిటి..? అయిదు భాషల్లో దేశవ్యాప్తంగా 400 కోట్ల వసూళ్లు ఏమిటి..? నిజానికి అది కాదు, కాంతార సినిమా సృష్టిస్తున్న రికార్డులు అన్నీఇన్నీ కావు… తోపు అనుకుంటున్న కేజీఎఫ్ సినిమా కూడా కాంతార ధాటికి పక్కకు తొలగిపోయింది ప్రస్తుతం… ఆ రికార్డుల గురించిన వివరాల్లోకి వెళ్తే ఇప్పట్లో బయటపడబోం… మరేమిటి..?
ఒకవైపు ఓటీటీలో విడుదల తేదీ దగ్గరకొస్తోంది… మరోవైపు కన్నడనాట రిషబ్ సంచలనం రేపుతున్నాడు… రకరకాల ఆర్టిస్టులకు ఇప్పుడు రిషబ్ పోషించిన గుళిగ పాత్ర ఓ కళావస్తువు… సినిమాలోని గుళిగ దైవంలాగే రిషబ్‌ను చిత్రిస్తున్నారు… శిల్పాలు… బొమ్మలు… ఎక్కడ చూసినా ఇంకా ఆ పాటలే… ప్రత్యేకించి వరాహరూపం పాట… యాభై రోజులు దాటుతున్నా ఇప్పటికీ 200 షోలు బెంగుళూరులో…
యాభై రోజులు పూర్తయిన సందర్భాన్ని ట్వీట్ చేస్తూ… అందరికీ రిషబ్ ధన్యవాదాలు తెలుపుతూ… అందులోనూ గుళిగ, పంజుర్లి ప్రస్తావన… మొన్న ఎక్కడో ఏదో ఉత్సవ ఊరేగింపు జరిగితే… ఓ ఆర్టిస్టు రిషబ్ శెట్టిని ఏకంగా గుళిగ దైవాన్ని చేసేశాడు… కొన్ని రిషబ్ షేర్ చేసుకుంటున్నాడు కూడా… కృతజ్ఙతలు చెప్పడానికి… అంతగా రిషబ్ మేనియా కర్నాటకను కమ్ముకుంటోంది… ఓటీటీ ప్రసారం తరువాత ఇంకా పెరిగేట్టుంది… ఒక చిన్న హీరో, ఒక చిన్న దర్శకుడికి ఇంతకుమించి ఏం కావాలి..? నిజానికి క్లైమాక్స్‌లో తన నటన అపూర్వం… ఈ ఆదరణకు వంద శాతం అర్హుడే…
Ads
https://twitter.com/shetty_rishab/status/1593605523865473024
యాభై రోజులు పూర్తయినప్పుడు ఈ సినిమా ప్రదర్శిస్తున్న ప్రతి థియేటర్‌లో వేడుకలు జరిపారు… కన్నడంలో, కర్నాటకలో ఈరోజుకూ కాంతార సినిమా వార్తలు లేకుండా పత్రికల్లో సినిమా పేజీలు లేవు… చానెళ్లలో సినిమా స్పెషల్స్ లేవు… కన్నడ టీవీల్లో ఆల్‌రెడీ కాంతార స్పూఫులు సరేసరి… మొన్నామధ్య ఈటీవీ తెలుగులో కమెడియన్ నూకరాజు కాంతార క్లైమాక్స్ బిట్‌ను అద్భుతంగా నటించి మెచ్చుకోళ్లు పొందాడు…
కొన్ని ఇంటర్వ్యూలలో రిషబ్ ‘‘సినిమా తీస్తున్నప్పుడు ఆ దేవతల ఆశీస్సులు దొరికాయి నాకు… ఎలా, ఏరూపంలో, ఎప్పుడు అని నన్ను అడక్కండి… నన్నే అనుభవించనివ్వండి…’’ అని చెప్పాడు… అదీ జనంలోకి విపరీతంగా పోయింది… మొత్తానికి కన్నడ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నావు కదా రిషబ్… ఎంజాయ్… చిన్న గుట్ట ఎక్కితే చాలనుకున్నవ్… జనం నిన్న ఏకంగా ఎవరెస్టే ఎక్కించారు…!!
Share this Article