.
అప్పుడెప్పుడో క్రీస్తుపూర్వం వచ్చిన సినిమా జయం… తరువాత నిత్యా మేనన్ పుణ్యమాని ఇష్క, గుండెజారి గల్లంతయ్యిందే… 2016లో వచ్చిన అఆ సినిమా… అదీ దర్శకుడి సినిమా… కొంతలోకొంత రంగ్ దే…
మరి హీరో నితిన్ ఇది నా సినిమా అని కాలరెగరేసి చెప్పుకునే సినిమా ఏదైనా ఉందా..? లేదు..! తను సొంతంగా భుజాల మీద మోసిన సినిమా ఒక్కటీ లేదు… బలమైన సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండీ… 23 ఏళ్లుగా ఫీల్డులో ఉన్న నితిన్ కెరీర్ ఇది…
Ads
సరే, ఏదో రాబిన్ హుడ్ అనే సినిమాతో వచ్చాడు… ఇది నా కెరీర్‌తో సూపర్ అన్నాడు మీడియా మీట్లలో… వెంకీ కుడుములతో సూపర్ కాంబినేషన్ అన్నాడు… దీనికితోడు నెగెటివ్ పబ్లిసిటీ…
బూతుల మాస్టర్ శేఖర్ కంపోజ్ చేసిన ఇదిదా సర్‌ప్రైజ్ స్టెప్పులు… డేవిడ్ వార్నర్‌ను ముండాకొడుకు అని ప్రేమగా తిట్టిపోసిన బూతు రాజేంద్ర ప్రసాద్ తరువాత లెంపలేసుకుని సారీ చెప్పడం… పోనీలే, పాపం ఈసారైనా ఓ హిట్ కొడతాడేమోలే అనుకుంటే… తుస్…
ఏముంది కొత్తదనం ఇందులో… పాత చింతకాయ పచ్చడి వంటి రాబిన్ హుడ్ పాత్ర… తాతల కాలం నుంచీ చూస్తున్నదే… పైగా ఇప్పటి ట్రెండ్‌కు తగినట్టు రస్టిక్ లుక్ లేదు, అది నితిన్‌కు అస్సలు నప్పదు… శ్రీలీల ఉందంటే ఉంది, అంతే… ఆమె పాత్రకు పెద్ద సీన్ లేదు… (పాత్రల ఎంపికలో అట్టర్ ఫ్లాప్ ఈ పిల్ల…)
డేవిడ్ వార్నర్‌ను ఎందుకు తీసుకున్నారో తెలియదు, అంత ఇంప్రెసివ్ పోర్షన్ ఏమీ లేదు… ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు… అసలు తను నటుడే కాదు… బహుశా సీక్వెల్‌లో ప్రయారిటీ ఇస్తారేమో… (తీస్తే… గీస్తే…?) మంచి కథ, మంచి ప్రజెంటేషన్ మాత్రమే సినిమాను నిలబెట్టేవి… అవి ఇందులో లేవు…
అందుకే కామెడీ మీద ఆధారపడ్డాడు దర్శకుడు… కామెడీయే సినిమాను నిలబెట్టలేదు, నడిపించలేదు… సంగీతం సోసో, చివరకు ఆ ఐటమ్ సాంగ్ ఇదిదా సర్‌ప్రైజు కూడా థియేటర్ దాటాక గుర్తుండదు… మరి ఇందులో ఏముంది చెప్పుకోవడానికి నితిన్..? ఎన్నాళ్లు ఈ ఆపసోపాలు ఫాఫం..?!
టేకింగ్, స్టోరీ, ప్రజెంటేషన్, స్క్రీన్‌ప్లే, లుక్కు, ట్విస్టులు… అసలు ఏ మెరుపులూ లేవు, ఏ సాహసాలూ లేవు… ఏ ప్రయోగాలూ లేవు… ఏదో సినిమా తీశామా, జనం మీదకు వదిలామా..? ఇదేనా నీ మొత్తం కెరీర్ అంతా… ఆశ పెట్టుకున్న ఆ కామెడీ కూడా రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ పుణ్యమాని కాసింత కూడా నవ్వు రాదు…
సినిమా అనేది కొందరికి దందా… ఎంత పెట్టాం, ఎంత వచ్చింది అనేదే ముఖ్యం… కొందరికి ప్యాషన్… ఆ పిచ్చిలోనే బతుకుతుంటారు… నితిన్ వంటి నటులు ఆ రెంటిలో ఏదీ కాదు… వాళ్లకు ఓ కొలువు ఇది… నిరాసక్తంగా, నిర్లిప్తంగా, నిస్తేజంగా… ఏదో చేశాం, ఏదో చేస్తున్నాం, ఏదో ఇలాగే నడిపించేస్తాం… రాబిన్‌హుడ్ సినిమా దీనికి భిన్నంగా ఏమీ లేదు…!! (మహిళా కమిషన్ హెచ్చరికలను గౌరవిస్తూ ఆ వెగటు స్టెప్పుల్ని కాస్త కవర్ చేశామనిపించారు…)
Share this Article