Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దబిడిదిబిడి స్టెప్పులపై భలే సెటైర్… శేఖర్ మాస్టర్ నవ్వలేక ఏడ్వలేక…

February 4, 2025 by M S R

.

టీవీ షోలను సొంతంగా నిర్మిస్తూ, తనే హోస్ట్ చేస్తూ సందడి చేసే ఓంకార్ నిజానికి పెద్దగా బూతులు, ద్వంద్వార్థాలు, వెగటు కంటెంట్ జోలికి వెళ్లడనే పేరుంది… తన షోలు కూడా కాస్త డిఫరెంటుగా ప్లాన్ చేసుకుంటాడు…

కానీ వెగటుతనం, వెకిలితనం లేకపోతే టీవీ షోలకు రేటింగ్స్ రావని ఎవరైనా చెప్పారో…. లేక ఈటీవీ రియాలిటీ షోలు, అఫ్‌కోర్స్, అన్ని టీవీల షోలూ అలాగే ఏడ్చాయి… తను కూడా పిచ్చి కూతలకు దిగినట్టు కనిపిస్తోంది… ఆహా ఓటీటీ కోసం తను చేస్తున్న డాన్స్ ఐకాన్-2 షో తాలూకు ప్రోమో చూస్తే అలాగే అనిపించింది…

Ads

వైల్డ్ ఫైర్ ట్యాగ్‌తో రెండో వారంలో స్టార్ట్ కాబోతున్నట్టుంది ఇది… ఇటీవల ఘోరమైన ట్రోలింగు ఎదుర్కొంటున్న శేఖర్ మాస్టర్ ఒక జడ్జి… (మరి ఢీ..?) ఫరియా అబ్దుల్లా మరో జడ్జి… (అర్హత ఏమిటో… ఆమె డాన్సర్ కూడా కాదనుకుంటా…)

మానస్ ఒక మెంటార్ వోకే… తను డాన్సరే… తోడుగా దీపిక రంగరాజు మరో మెంటార్ అట… ఈ తిక్కమేళం ఈ షోను ఎంత కంగాళీ చేస్తుందో తలుచుకుంటేనే ఓంకార్ మీద జాలి… యశ్వంత్ మాస్టర్ వోకే… ఫోక్ డాన్సర్ ఝాన్సీ కూడా వోకే… మోడల్ ప్రకృతిని అదనపు గ్లామర్ కోసం తీసుకున్నారేమో…

నిజానికి డాన్స్ షోలకు రేటింగ్స్ తక్కువే… మరి దీన్నెలా సక్సెస్ చేస్తాడో ఓంకార్‌కే ఎరుక… ప్రోమోలో కాస్త ఢీ, జబర్దస్త్ పోలికలు కనిపిస్తున్నాయి… ఫరియాకు మీకు రియల్ లైఫ్‌లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అనే ప్రశ్న పర్లేదు… కానీ యశ్వంత్‌కు ‘నువ్వు ఇప్పటిదాకా ఎంతమందిని కిస్ చేశావు అనే ప్రశ్న,.,

దీపికకు ఓంకార్ చాక్లెట్ ఇస్తే, ఆమె నోట్లో పెట్టుకుని, శేఖర్ మాస్టర్ నోటికి అందించే ప్రయత్నం ఓ చిల్లర… చివరకు ‘అంతటి’ శేఖర్ మాస్టర్ బాబోయ్ అని భయపడిపోయాడు… మానస్‌కు ఓంకార్ ప్రశ్న ఏమిటంటే..? రోజుకు మీరు ఎంతమందిని ఫ్లర్ట్ చేస్తారు… దీనికి దీపిక మధ్యలో జొరబడి గంటలకు ఎంతమందిని అని అడగండి అంటోంది…

దీపిక నడుం చూపిస్తూ ఫోజు పెడితే దాన్ని వర్ణించాలంటూ ఓంకార్ ఇచ్చే టాస్క్, దాని మీద చర్చ… యశ్వంత్ అంత దగ్గర నుంచి చూస్తున్నాడు తనే వర్ణించలేడు అని మానస్ తప్పించుకుంటే, నడుము చూడమంటే వేరే ఎక్కడో చూస్తున్నాడు అంటూ దీపిక వయ్యారం… వామ్మో… ఓంకార్… అప్పుడే అయిపోలేదు…

ఇక సినీ, టీవీ కమెడియన్ రోహిణి ఎంటరైంది… ఎవరో తెల్ల పిల్ల డాన్స్ చేస్తుంటే వెళ్లి, అచ్చం బాలయ్య దబిడి దిబిడి పాటలో ఊర్వశి రౌతేలా పిరుదుల మీద బాదినట్టే రోహిణి కూడా సేమ్ అలాగే చేసింది… దబిడిదిబిడి నేనే నేర్పించాను అంటూ నేరుగానే సెటైర్ వేసింది… నిజానికి అది అక్కడే ఉన్న శేఖర్ మాస్టర్‌కే తగిలింది … ఫాఫం, నవ్వలేక ఏడ్వలేక కూర్చున్నాడు…

నిజానికి ఆ దబిడిదిబిడి సాంగ్ తరువాత శేఖర్ స్టెప్పుల అశ్లీలం మీద బాగా చర్చ నడిచింది… (డాకూ మహారాజ్ సక్సెస్ (?) పార్టీలో కూడా సేమ్ స్టెప్పులు వేశాడు బాలయ్య ఊర్వశితో… పద్మభూషణుడు బాలయ్య టేస్టుకూ శేఖర్ స్టెప్పుల తీరుకూ భలే కుదిరింది… )

శేఖర్ మాస్టర్ తండేల్ స్టెప్పులు కూడా గతంలో ఫిదా, సారంగదరియా స్టెప్పులను రిపీట్ అనే విమర్శ కూడా వస్తోంది… మరి శేఖర్ మాస్టర్ మీద రోహిణి వేసిన ఈ వ్యంగ్యం లాంచింగ్ ఎపిసోడ్‌లో అలాగే ఉంచుతాడా ఓంకార్..? ఐనా శేఖర్ అభ్యంతరపెట్టి ఉంటే అసలు ప్రోమోలోనే ఈ సెటైర్ ఉండేది కాదు కదా..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions