Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మా రోజమ్మా… ఎటు వెళ్లినా ఈ జబర్దస్త్ తోకలు ఉండాల్సిందేనా..?

December 21, 2022 by M S R

నిజంగా రోజాను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది… నేను ఒక రాష్ట్రానికి మంత్రిని అనే సోయి ఏమీ కనిపించదు… వేదిక దొరికితే డాన్సు చేస్తుంది… మాట్లాడితే చాలు ఆ ఈటీవీ జబర్దస్త్ టీంను వెంటేసుకుని తిరుగుతుంది… తను ఇంకా జబర్దస్త్ జడ్జినే అనీ, జగన్ పేరుతో కాదు, జబర్దస్త్ ఫేమ్‌తో గెలిచాను అని నమ్ముతున్నట్టుంది బలంగా…

జగన్ ప్రత్యర్థి రామోజీ… రామోజీ చానెల్ ఈటీవీ… ఈటీవీ ప్రోగ్రాం జబర్దస్త్… మరి ఆ షోను పదే పదే ఎందుకు ప్రమోట్ చేస్తుంది జగన్ కేబినెట్ సభ్యురాలు..? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో చూసే యంత్రాంగమే లేనట్టుంది జగన్ పార్టీలో..! నిజానికి 32 మందికి ఈసారి టికెట్లు ఇచ్చేది లేదని జగన్ ఏవో సర్వేల ద్వారా ఓ నిర్ణయానికి వచ్చాడని వార్తలు వచ్చాయి కదా…

వారిలో రోజా ఉందో లేదో తెలియదు… కాకపోతే జగన్ ముందు నుంచీ ఆమె నియోజకవర్గంలో ఆమెకు ఆల్టర్నేట్ లీడర్లను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు… పలుసార్లు రోజాకు తన నియోజకవర్గంలోనే తనకు ప్రోటోకాల్ ప్రాధాన్యం దక్కదు… సరే, జగన్ బర్త్‌డే వేడుకల్ని నిర్వహించింది… మంచిదే… కానీ దానికి పిలిచింది ఎవరిని..? ఆ పొట్టిబట్టల అనసూయను ప్లస్ ఆ జబర్దస్త్ గ్యాంగును… (ఇక్కడికి చీరె కట్టుకునే వచ్చింది)… అందులో ప్రధానంగా చెప్పాల్సింది హైపర్ ఆది గురించి…

Ads

తను జగన్‌కు పచ్చి వ్యతిరేకి… పవన్ కల్యాణ్‌కు గత ఎన్నికల్లో ప్రచారకుడు… కనీసం గెస్టుగా పిలిచినందుకు కొన్ని సభామర్యాదలు పాటించాలనే సోయి ఆదికి లేదు… తనను ఎందుకు పిలిచిందో రోజాకు తెలియదు… కేక్ కటింగు దగ్గర మొహమాటంగా కాసేపు ఉండి పక్కకు వెళ్లాడు… తరువాత జబర్దస్త్ టీం డాన్స్ అనేసరికి మెల్లిగా వెనక్కి వెళ్లిపోయాడు… చివరకు తను మాట్లాడుతున్నప్పుడు కూడా కమెడియన్ ఆలీని మెచ్చుకున్నాడు… రోజాను మెచ్చుకున్నాడు తప్ప జగన్ పేరును పొరపాటున కూడా ఉచ్చరించలేదు.., వైసీపీ శ్రేణుల్లో కూడా ఈ చర్చ సాగుతోంది…

వీళ్లనా రోజా నమ్ముకున్నది..? అనసూయ నయం… రోజాతో కలిసి ఏవో నాలుగు స్టెప్పులు వేసింది… ఉన్నంతసేపు కలివిడిగా కనిపించింది… మరి ఈ జబర్దస్త్ టీం, ఈ హైపర్ ఆదికి ఆహ్వానం ద్వారా రోజా జగన్‌కు ఇస్తున్న సంకేతం ఏమిటి..? అసలు ఇవన్నీ పట్టించుకునే వ్యవస్థ ఉందా పార్టీలో..? పైగా చిన్న వివాదం ఉన్నా సరే, చంద్రబాబును తిట్టే విషయంలో రోజా రెడీగా ముందుకొస్తుంది… ఆమెకు అధికార ప్రతినిధి హోదా ఏమైనా ఇచ్చారా..?

పొరపాటున జగన్ గనుక నీకు మంత్రి పదవి వద్దులేమ్మా అని తీసేస్తే… వెంటనే ఈటీవీ స్టూడియోకు వెళ్లి నటి ఇంద్రజను ఆ జడ్జి కుర్చీ నుంచి విసురుగా తోసేసి… తను ఆర్గనైజ్ చేస్తుందేమో… అంతగా ఆమెలోకి ఆ షో ఇంకిపోయింది… నిజానికి ఆమె చేయాల్సింది ఏమిటో తెలుసా..? నియోజకవర్గం వెళ్లి, జనంతో మమేకం కావడం…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…
  • మేజిక్ + హిప్నాటిజం + రచన + బోధన+ సైకాలజీ + కౌన్సెలింగ్… వాట్ నాట్..?
  • ఓ ప్రియురాలి పాదయాత్ర..! ప్రేమ + భక్తి + విశ్వాసం + వ్యక్తీకరణ…
  • సినిమాల క్లైమాక్స్ గొడవలు… ఎటూ తేలక, తేల్చలేక మథనాలు…
  • విలన్‌పై పగ తీరాలంటే విలన్ బిడ్డను పడేయాలా..? సినిమా నీతి అదే..!!
  • ఫాఫం హైపర్ ఆది..! ఈటీవీ షోలో రోజురోజుకూ ఈ దిగజారుడేమిటో..!?
  • హిందుత్వ ప్రసంగాలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు…
  • ‘మెగా దాడి’… రచ్చ… ఆఖరికి లెంపలేసుకున్న దిల్ రాజు సోదరుడు..!!
  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions