బాలయ్య బలం తన పంచ్ డైలాగులు… తను పలికే రీతిలో వేరెవరూ పలకలేరు కొన్ని డైలాగులు… చిరంజీవి బలం పాటలు… చూడబుల్ స్టెప్పులతో మంచి పాటలు ఉండేలా జాగ్రత్తపడతాడు… డైలాగ్ రైటర్లు గానీ, సాంగ్ లిరిసిస్టులు గానీ, కొరియోగ్రాఫర్లు గానీ ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకుంటారు కూడా… ఈ ఇద్దరూ ఇప్పుడు సంక్రాంతి బరిలో పోటీపడబోతున్నారు… కానీ చిరంజీవి ఈసారి పాటలకు సంబంధించి దేవిశ్రీప్రసాద్‌ను నమ్ముకుని తప్పు చేశాడేమో అనిపిస్తోంది…
ఆచార్య, గాడ్‌ఫాదర్ సినిమాలు దెబ్బతినిపోవడం… బాలీవుడ్ నుంచి ఆమిర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌లను తెచ్చుకున్నా వర్కవుట్ గాకపోవడంతో ఈసారి లోకల్ హీరో రవితేజను సాయం తెచ్చుకోవడం మంచి స్ట్రాటజీయే… కానీ ఊరమాస్ పాత్రతో ఈసారి (క్లాస్ పాత్రల్ని చాలా ఏళ్ల క్రితమే వదిలేశాడు..) జనం ఎదుటకు రావాలనుకున్నప్పుడు, తన బలం పాటల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాల్సింది… అక్కడ ఏదో తేడా కొట్టినట్టు కనిపిస్తోంది…
తిమిరనేత్రుడు వివాదం ఒకవైపు నడుస్తూనే ఉంది… పారడాక్స్ వాక్యాల్ని రాయడం ఓ ఆర్ట్… చాలా విద్వత్తు కావాలి దానికి… జనానికి రెండు పరస్పర భిన్నమైన అర్థాలు స్ఫురించేలా, అదీ సరళంగా అర్థమయ్యేలా రాయగలగాలి… చంద్రబోస్ అందులో ఫెయిలయ్యాడు… పైగా విఫల సమర్థనకు దిగాడు… పాట కూడా పెద్ద ఇంప్రెసివ్‌గా రాలేదు…
Ads
బాస్ పార్టీ సాంగ్ తనే రాసుకుని, తనే పాడి, తనే కంపోజ్ చేసి దేవిశ్రీప్రసాద్ మరో తప్పు చేశాడు… సిస్టంలో ఎవడు చేసే పని వాడు చేయాలి డీఎస్పీ… పైగా అందులో డప్పందుకో, బూరందుకో అన్నప్పుడే డౌటొచ్చింది… నిజంగానే ఇప్పుడు రిలీజ్ చేసిన పూనకాలు లోడింగ్ పాటలో బూర తీసుకుని, తనే ఊదుతున్నాడు… సరే, మాస్ పాట కదా, బాగానే ఉంటుంది అనుకుంటే… అదేమో కార్తికేయ నటించిన 90 ఎంఎల్ సినిమాలో సాంగ్ ట్యూనే… (అది అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం)… (హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం వేళ లక్షల పీకలు అమ్ముతారు, అదేలెండి చిన్న బూరలు… పిల్లలు, పెద్దలు ఏవేవో పాపులర్ పాటల్ని వాటిల్లో ఊదుతూ ఉంటారు… సౌండ్ ముఖ్యం… దేవిశ్రీప్రసాద్‌కు అది బాగా నచ్చినట్టుంది…)
నిజానికి దేవిశ్రీప్రసాద్, థమన్ దొందూ దొందే… గిరాకీ పెరిగింది, కొత్త ట్యూన్లు కట్టే క్రియేటివిటీ లేదు… దాంతో తమ పాటలు, మంది పాటలు కాపీ కొట్టేస్తున్నారు… ఈ పూనకాలు పాటే తీసుకుంటే… డీఎస్పీ కాన్సెప్టుతో రోల్ రైడా లిరిక్ రాశాడట… అందులో నిజానికి లిరిక్ ఎక్కడిది..? పక్కన పెట్, బీట్, గీట్, లపెట్, లపెట్ అని ఏదో పాడుతున్నాడు తనే… అంటే ఏమిటి రైడా..? పైగా పూనకాలు లోడ్ కావడమేంటి..?
రోల్ రైడా బిగ్‌బాస్ ఫేమ్, తెలుగునాట ర్యాపర్‌గా పరిచయం… మనం మామూలుగా మాట్లాడుకునే వాక్యాల్నే ముక్కలు చేసి, రాగయుక్తంగా పాడటమే ర్యాపర్ పని… అది బీట్, జోష్ ట్యూన్లకు సూటవుతుంది… భిన్నమైన మ్యూజికల్ ఫామ్ అది… కానీ ఇక్కడ ఎందుకో అంత ఇంప్రెసివ్‌గా రాలేదు… అసలు చిరంజీవి ఎలా కన్విన్సయ్యాడు ఈ పాటకు..? అదీ ఆశ్చర్యం…
కానీ ఏమాటకామాట… శేఖర్ మాస్టర్‌ను మెచ్చుకోవాలి… హీరో ఇమేజీ, హీరో సిగ్నేచర్ స్టెప్స్, హీరో వయస్సు, ట్యూన్ నేచర్‌ను భలే పట్టుకుంటాడు… తెర మీద బలంగా ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాడు… ఈ పూనకాలు పాట విషయంలో శేఖర్ మాస్టర్ ముద్ర కనిపిస్తోంది… అనేక మంది మధ్యలో చిరంజీవిని లేదా రవితేజను నిలబెట్టి సరళమైన స్టెప్పులు వేయించి, బాగా కవర్ చేశాడు…
చిరంజీవి శేఖర్ మాస్టర్‌ను నమ్ముకోవడంలో అర్థం ఉంది… కానీ దేవిశ్రీప్రసాద్ విషయంలోనే ఏదో తేడా కొట్టేసినట్టుంది… అటు దేవిశ్రీప్రసాద్ పోటీదారు థమన్ కూడా వీరసింహారెడ్డి పాటలకు పెద్ద ఇంప్రెసివ్ ట్యూన్లు ఇవ్వలేదు… బుర్రా సాయిమాధవ్ డైలాగుల్ని ఎలా ఎక్కుపెట్టాడో చూడాలిక..!!
Share this Article