Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజమౌళికి మరో భంగపాటు… బాఫ్టా నామినేషన్లకూ వెళ్లని నాటునాటు…

February 23, 2023 by M S R

బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ అవార్డులు…. అనగా షార్ట్ ఫామ్‌లో BAFTA…  2023 అవార్డులను ప్రకటించింది… 1928లో జర్మన్ రచయిత ఎరిచ్ మరియా రిమార్క్ WW1 హారర్స్ మీద రాసిన ఓ నవల ఆధారంగా జర్మన్లు ఒక సినిమా తీశారు… దాని పేరు ‘All Quiet on the Western Front’… అది ఏకంగా ఏడు అవార్డులను కొల్లగొట్టింది… ఈ అవార్డులను ఆస్కార్‌కు దీటైన అవార్డులుగా పరిగణిస్తారు… ఇది ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నామంటే… మనం జబ్బలు చరుచుకుంటున్న ఆర్ఆర్ఆర్ ఏ ఒక్క కేటగిరీలోనూ కనీసం నామినేషన్ కూడా పొందలేదు…

https://www.bafta.org/film/awards/2023-nominations-winners

ఆ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది, ఆహా… నాటునాటు అనే ఇండియన్ ఫిలిమ్ సాంగ్ ప్రపంచ సినీ వీథుల్లో విజయపతాక ఎగరేసింది, ఓహో… ఏకంగా పది నామినేషన్లు ఆస్కార్‌కు పంపించబడ్డాయి, అబ్బబ్బ… నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు వచ్చే వీలుంది, జయహో… ఫలానా పత్రిక వాడు పొగిడాడు, ఫలానా జేమ్స్ కామెరూన్ అలుముకున్నాడు… ఇలా ఏవేవో రాస్తున్నాం… అవన్నీ ప్రైవేటు నామినేషన్లు, అక్కడ లాబీయింగు చేసుకోగలవాడికే వీరగంధాలు, విజయమాలలు అనే నిజాన్ని మాత్రం మనం గుర్తించం…

Ads

Jr NTR, Rajamouli, Ram Charan

చివరకు కంగనా రనౌత్ అనే తిక్క కేరక్టర్ కూడా అన్నీ తెలిసి ఉండీ… రాజమౌళి మీద ఏం రాసినా, ఆయన్ని ఏమన్నా ఊరుకునేది లేదు, మన సినిమాకు ప్రపంచప్రఖ్యాతి సాధించిపెట్టాడు అని పొగుడుతోంది… రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ బీజేపీ క్యాంపు కాబట్టి ఈ ప్రశంసలా..? అందుకే ఈగవాలనిచ్చేట్టు లేదు… నిజంగా అంత దమ్మున్న సినిమాయే అయితే ఆస్కార్ నామినేషన్ల నుంచి పరిశీలన దాకా కొన్ని కేటగిరీల్లోనైనా వెళ్లాలి కదా… జస్ట్, ఆ నాటునాటు సాంగ్ మాత్రమే… అది ప్యూర్ నాసిరకం పాట… దాని మీద ఇంకా చర్చ అనవసరం…

 

నెటిజనం కూడా ఈ విదేశీ అవార్డుల అసలు కథల్ని వదిలేసి… అరె, మా రాజమౌళిని తొక్కేశారు, ఈ బాఫ్టా అవార్డుల నిర్వాహకులు పక్షపాతం చూపించారు… ఆర్ఆర్ఆర్‌ సినిమాలో బ్రిటిషర్ల క్రౌర్యాన్ని, రాక్షసత్వాన్ని చూపించారు కాబట్టి బ్రిటిష్ అకాడమీకి నచ్చలేదు, అందుకే ఈ వివక్ష అని సాకులు వెతికి విమర్శిస్తున్నారు… అరె, బాబూ ఆర్ఆర్ఆర్ ఏ విభాగంలోనూ కనీసం నామినేషన్ల స్థాయికి కూడా వెళ్లలేదురా నాయనా…

Jr NTR opts for black tuxedo; SS Rajamouli & Ram Charan opt for traditional Indian outfit as they walk Golden Globes red carpet

అమెరికన్లకన్నా ఈ బ్రిటిషర్ల సినిమా నాణ్యతను బాగా అంచనా వేస్తారా..? అసలు ఆర్ఆర్ఆర్ సినిమాను పరిగణనలోకే తీసుకోకపోవడం ఏమిటి..? నాన్సెన్స్ అని విమర్శిస్తున్నారు నెటిజనం… ఇక ఆ పాటకు గనుక ఆస్కార్ అవార్డు వస్తే చూడండి, ప్రచారఘోష, భజన ఎంతగా మోగిపోతాయో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions