.
. ( పొట్లూరి పార్థసారథి ).. …. ఉక్రెనియన్ దళాలు రష్యా లోకి చొచ్చుకుపోతున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం!
చాలా రోజుల నుండి రష్యా లోని కురుస్క్ (Kursk ) ప్రాంతం మీద పట్టు కోసం ఉక్రెయిన్ ఆర్మీ ప్రయత్నిస్తూ ఉన్నా సఫలం కాలేదు! కానీ ఈ రోజు ఉక్రెయిన్ ఆర్మీ రష్యాలోని సుద్ఝా కురుస్క్ హైవే మీద ఎలాంటి ప్రతిఘటన లేకుండా ముందుకు వెళుతున్నాయి!
Ads
ఉక్రెయిన్ కురుస్క్ ని స్వాధీనం చేసుకుంటుందా? లేక కురుస్క్ కంటే ముందు ఎడమవైపున ఉన్న కుర్చతోవ్ అనే ప్రాంతంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రం స్వాధీనం చేసుంటుందా?
పరిశీలకుల అభిప్రాయం ఏమిటంటే కుర్చతోవ్ అణు విద్యుత్ కేంద్రం స్వాధీనం చేసుకొని పుతిన్ ని కాళ్ల బేరానికి తెస్తుంది అని! పుతిన్ లొంగకపోతే అణు విద్యుత్ కేంద్రాన్ని ఆపివేసి విద్యుత్ సరఫరా లేకుండా చేసి ఆపై కురుస్క్ ని స్వాధీనం చేసుకోవచ్చు!
ఇప్పటి వరకూ జరిగింది ఒక ఎత్తు అయితే ఈ రోజు, రేపు జరగబోయేది మరొక ఎత్తు! రష్యా ఆత్మరక్షణలో పడిపోయింది అన్నది నిజం! రష్యన్ డిఫెన్స్ చాలా బలహీనపడిపోయింది!
జనవరి 20 వరకూ ఆగి ట్రంప్ సంధి కుదిర్చే అవకాశం లేకుండా చేయాలని జో బిడెన్ ప్లాన్! అఫ్కోర్స్! పుతిన్ అణు బాంబు వేసినా ఆశ్చర్యపోవక్కరలేదు!
అణు దాడి అంటూ చేస్తే మొదట బ్రిటన్ మీదనే చేస్తాను అని పుతిన్ గతంలోనే హెచ్చరిక చేశాడు! ఉక్రెనియన్ ఫార్వర్డ్ దళాలు వేగంగా కదులుతూన్నాయి కురుస్క్ వైపు! రేపు ఉదయంలోపే పుతిన్ ఆపగలగాలి లేకపోతే కురుస్క్, కుర్చతోవ్ లని కోల్పోవలసి వస్తుంది!
యెమెన్ నుండి 10 వేల మంది హుతి తీవ్రవాదులని రప్పించి ఉక్రెయిన్ తో పోరాడుతున్నాడు పుతిన్. ఉత్తర కొరియా నుండి వచ్చిన 30 వేల మంది సైనికులు అనుభవం లేకపోవడం వల్ల పిట్టల్లా రాలిపోతున్నారు! ఉత్తర కొరియా సైనిక శిక్షణ ఎలా ఉందీ అంటే కనీస ప్రాధమిక పాఠాలు కూడా నేర్పలేదుట!
సైనికులు మైదాన ప్రాంతంలో వెళుతున్నప్పుడు ఒకరి వెనుక ఒకరు వెళ్ళాలి ఇది శిక్షణ మొదట్లోనే చెప్తారు. ఎందుకంటే ఒకవేళ శత్రు పక్షం కనుక మెషిన్ గన్ తో ఫైరింగ్ ఓపెన్ చేస్తే ముందు ఉన్న సైనికుడు మరణిస్తాడు. వెంటనే వెనుక ఉన్న వాళ్ళు భూమి మీద పడుకొని డిఫెన్స్ పొజిషన్ తీసుకుంటారు! అదే పొజిషన్ లో ఉంటూ ఫైరింగ్ ఓపెన్ చేసి ఎదురు దాడి చేస్తారు.
కానీ ఉత్తర కొరియా సైనికులు మాత్రం ఒకరి పక్కన ఇంకొకరుగా వెళుతూ ఒకేసారి 300 మంది ఉక్రెయిన్ మెషిన్ గన్ ఫైరింగ్ లో చనిపోయారు! విచిత్రం ఏమిటంటే ఉత్తర కొరియా, యెమెన్ లు తప్పితే పాత సోవియట్ రిపబ్లిక్స్ ఏవీ కూడా రష్యాకి సహాయంగా రాలేదు!
మరోవైపు మాజీ సిరియా అధ్యక్షుడు అసద్ మీద హత్యా ప్రయత్నం జరిగింది మాస్కోలో! రేపో మాపో అసద్ హత్యకి గురవడం ఖాయం! వారం క్రితం అసద్ భార్య విడాకులు కావాలి అంటూ మాస్కో కోర్టుని ఆశ్రయించింది! విడాకులు తీసుకొని లండన్ వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉంది! విడాకులు తీసుంటేనే కానీ లండన్ లోకి అనుమతులు ఇవ్వరుట!
So! పుతిన్ కి గడ్డుకాలం ఇది! సిరియా అయిపొయింది! రేపోమాపో ఇరాన్ కూడా పోతుంది! చైనా తన స్వార్ధం తాను చూసుకుంటుంది తప్పితే నేరుగా పుతిన్ కి సహాయం చేయదు!
Share this Article