పార్ధసారధి పోట్లూరి ….. వాడుకొని వదిలేయడంలో అమెరికాని మించిన దేశం మరొకటిది ఉండదు. నిన్న లిథువేనియాలోని విల్నియస్ (Vilnius) నాటో దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగింది. నాటో సభ్యత్యం లేకపోయినా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ని కూడా ఆహ్వానించారు.ఇంతవరకు బాగానే ఉంది. జెలెన్స్కీ తన భార్యతో వెళ్ళాడు విల్నియస్ కి.
సమావేశం మొదట్లో జెలెన్స్కీ ని సాదరంగా ఆహ్వానించారు అందరూ! తరువాత జరిగింది మాత్రం కొంచెం ప్రత్యేకం! నాటో దేశాల అధ్యక్షులు కానీ ప్రధానులు కానీ జెలెన్స్కీ ని పట్టించుకోకుండా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు! పాపం జెలెన్స్కీ ఒంటరిగా మిగిలిపోయాడు చాలా సేపు! అయితే జిలెన్స్క్మీ కి ఇలాంటి అనుభవం ఎదురు అవడానికి కారణం ఉంది!
నాటో దేశాలలో తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్ధితులు నెలకొన్నాయి. మరోవైపు నాకు ఆయుధాలు ఇవ్వండి అంటూ ప్రతిసారీ అడుగుతూనే వస్తున్నాడు జెలెన్స్కీ. వాళ్ళు ఇస్తూ వచ్చారు. చివరికి ఉక్రేనియన్ పైలట్లకి F-16 ల మీద శిక్షణ ఇస్తున్నారు. వచ్చే నెలలో F-16 లని ఉక్రెయిన్ కి ఇవ్వబోతున్నారు.
Ads
అయితే ఉక్రెయిన్ కి ఇప్పటి వరకు ఇచ్చిన ఆయుధాలు అన్నీ 25 ఏళ్ల పాతవి. ఇప్పుడు ఇవ్వబోతున్న F–16 లు కూడా పాతవే. F-16 viper 30 ఏళ్ల పాతవి. ఒక్క యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ అయిన స్టింగర్ లు కొత్తవి ఇచ్చారు. ఇక అమెరికా ఇచ్చిన హిమార్స్ రాకెట్స్ కూడా 25 ఏళ్ల క్రితంవి.
కొత్తగా మరిన్ని అత్యాధునిక టెక్నాలజీని ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు జెలెన్స్కీ!
అయితే బ్రిటన్ ప్రధాని రిషి శునక్ జెలెన్స్కీ ని ఉద్దేశిస్తూ ‘మాది ఒక దేశం అంతేకానీ అమెజాన్ కాదు’ అని చురక పెట్టాడు. హాంగరీ దేశం ఉక్రెయిన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో చేర్చుకునేది లేదు అని తెగేసి చెప్పింది. అయినంత వరకూ చాలు ఇకముందు అడిగిన ఆయుధాలు సరఫరా చేయము అని జర్మనీ చెప్పేసింది. ఇప్పటికే జర్మనీ తన యుద్ధ టాంక్స్ లెపర్డ్2 లని ఇచ్చింది. వాటిలో కొన్ని రష్యా చేజిక్కించుకుంది కూడా. చాలా వరకు Leoperd2 టాంక్స్ ని రష్యన్ K-52 ఎటాక్ హెలికాఫ్టర్లు ధ్వంసమ్ చేశాయి.
జెలెన్స్కీ తమకి క్లస్టర్ బాంబులు కావాలని అడిగితే ఫ్రాన్స్ ఇవ్వడానికి అంగీకరించింది. క్లస్టర్ బాంబుల వాడకం మీద అంతర్జాతీయ స్థాయిలో నిషేధం ఉంది. అయితే ఫ్రాన్స్ నిర్ణయం మీద పుతిన్ గట్టిగానే హెచ్చరించాడు. ఉక్రేయిన్ కి నిషేధిత క్లస్టర్ బాంబులని ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని నేరుగా మాక్రాన్ ని కి వార్నింగ్ ఇచ్చాడు.
అమెరికా భయాలు అమెరికాకి ఉన్నాయి. ఉక్రేయిన్ కి మద్దతుగా భారీ ఆయుధ సరఫరా చేస్తే అది పుతిన్ ని రెచ్చగొట్టినట్లు అవుతుంది. మరోవైపు ఉత్తర కొరియా నుండి ఆటమిక్ ICBM ల దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని పెంటగాన్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పుతిన్ అడిగితే ఉత్తర కొరియా వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఏక కాలంలో ఉత్తర కొరియా అమెరికాతో పాటు దక్షిణ కొరియా మీద అణు దాడి చేస్తే దక్షిణ కొరియా రక్షణ బాధ్యతతో పాటు అమెరికా తనని తాను కాపాడుకోవాల్సి వస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో యూరోపుని రష్యా దాడి నుండి కాపాడడం అనేది పెద్ద సమస్య అమెరికాకి. రష్యా ఏకకాలంలో యూరోపుతో పాటు అమెరికాని లక్ష్యంగా చేసుకొని యుద్ధం చేస్తే నష్ట పోవడం ఖాయం! అందుకనే మెల్లగా ఉక్రేయిన్ బాధ్యతని యూరోపు దేశాల మీదకి నెడుతున్నది! ముందు ముందు రష్యా నుండి దాడి తప్పించుకోవడానికి.
అమెరికా లాంటి పెద్ద దేశానికి ఎన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు ఉన్నా ఏకకాలంలో ఉత్తర కొరియా, రష్యా లు కలిసి ICBM లతో దాడి చేస్తే తప్పించుకోలేదు! ఇక్కడ చైనాని కలపలేదు. ఒకవేళ చైనా కలిస్తే అప్పుడు జపాన్ రక్షణ బాధ్యత కూడా అమెరికాకి భారం అవుతుంది. ఈ విషయం తెలుసుకున్నాడు కనుకే ట్రంప్ నాటో రక్షణ బాధ్యత అమెరికాది కాదు అన్నాడు!
రష్యా SMO (స్పెషల్ మిలటరీ ఆపరేషన్) చాలా పాఠాలు నేర్పింది యుద్ధ కాంక్షతో ఉన్న దేశాలకి. అన్నీ తమ వద్దనే ఉన్నా రష్యా 6 నెలలలో 10 కొత్త Su-35 ఫైటర్ జెట్స్ ని తయారుచేయ గలిగింది. ఇప్పటి వరకు రష్యా సరాసరిన రోజుకి 100 మిస్సైల్స్ ని ఉక్రేయిన్ మీదకి ప్రయోగించింది. వీటిలో ఎక్కువగా క్రూయిజ్ మిస్సైల్స్ 70 వరకూ ఉండగా మిగతా 30 షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్, హైపర్ సానిక్ లు ఉన్నాయి. తన వద్ద ఉన్న స్టాక్ అయిపోతున్నా రష్యా మరోవైపు రెండు షిప్తులతో తయారు చేస్తూ పోయింది. ఇది కేవలం రష్యా, చైనా లకే సాధ్యం అవుతుంది. యూరోపు, అమెరికాలతో అస్సలు సాధ్యం కాదు.
అమెరికా తనను తాను కాపాడుకుంటూ మరో వైపు దక్షిణ కొరియా, జపాన్ లతో పాటు ఇజ్రాయెల్, యూరోపులకి సరఫరా చేసేంత ఇన్ఫ్రా స్ట్రక్చర్ లేదు చైనాలాగా! యుద్ధం అంటే డబ్బు, టెక్నాలజీ ఉంటే సరిపోదు. రోజుకి కనీసం 200 మిస్సైళ్ల తో పాటు ఇతర ఆయుధాలు కూడా తయారు చేయగల సత్తా ఉండాలి. So! ఎలా చూసినా అమెరికా, యూరోపులు కలిసి పనిచేసినా రష్యా, చైనాలతో తలపడే స్థితిలో లేవు.
ఈరోజున. వాసి కంటే రాశి బాగా పనిచేస్తుంది అని నిరూపించింది రష్యా ఉక్రేయిన్ యుద్ధం! అందుకే భారత్ చైనాతో యుద్ధం చేయడం మీద ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. మన DRDO కి పెద్ద సంఖ్యలో ఆయుధాలు ఉత్పత్తి చేసే సామర్ధ్యం లేదు చైనా లాగా, రష్యా లాగా యుద్ధం అంటూ వస్తే . DRDO టెక్నాలజీని డెవలప్ చేయగలగుతుంది తప్పితే భారీ స్థాయిలో ఉత్పత్తి చేయలేదు.
మనం ఆ దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాము. పైగా స్వంతంగా రా మెటీరియల్స్ ని ఉత్పత్తి చేసే స్థితిలో లేము. చాలా వరకూ రా మెటీరియల్ కోసం రష్యా , చైనా, అమెరికా, యూరోపు దేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. అయితే ఇలాంటి స్థితి ఒక్క మన దేశానికే పరిమితమా?
అన్ని దేశాలు చైనా, రష్యాల మీదే ఆధారపడుతున్నాయి.
రెండు రోజుల క్రితం చైనా గాలియం, జెర్మానియం అనే రెండు రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతుల మీద నిషేధం విధించింది. అంటే ఈ రెండు రేర్ ఎర్త్ మినరల్స్ ని ఏ దేశానికి కూడా ఎగుమతి చేయదు చైనా. ఇప్పటికే తీసుకున్న ఆర్డర్స్ ని కూడా రద్దు చేసింది చైనా. దీని వల్ల ఎవరికీ నష్టం? వెంటనే ప్రభావం పడేది అమెరికా మీదనే!
ఒక F-35 ని తయారు చేయాలంటే 450 కిలోల గాలియం మెటల్ అవసరం పడుతుంది అమెరికాకి. ఇప్పటి వరకు చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నది అమెరికా! So! అమెరికన్ F-35 లు ముందు ముందు కొత్తగా తయారు అయ్యే అవకాశం లేదు. ఇంతా చేస్తే F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ లు ఇంకా డెవెలప్ స్టేజీలోనే ఉన్నాయి. పోనీ F-22 ఉన్నాయి అని నిశ్చింతగా ఉండే స్థితిలో లేదు అమెరికా! F-22 ల ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆపేసి 10 ఏళ్లు అవుతున్నది కాబట్టి వాటిని మళ్లీ తయారు చేసే ప్రసక్తి లేదు. F-22 ప్రొడక్షన్ లైన్ ని పూర్తిగా తీసేసింది లాక్ హీడ్ మార్టిన్. సమయం చూసి పెద్ద దెబ్బ వేసింది చైనా! చైనా నుండి యూరపు డిఫెన్స్ సెక్టార్ కి కూడా రా మెటీరియల్స్ తో పాటు కొన్నిఫినిష్డ్ స్పేర్ పార్ట్స్ ఎగుమతి అవుతున్నాయి కాబట్టి యుద్ధం అంటూ వస్తే చైనాకి వ్యతిరేకంగా యూరోపు పనిచేస్తే చైనా నుంచి ఏవీ కూడా యూరోపుకి వెళ్లవు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల జాయింట్ వెంచర్ అయిన SCALP క్రూయిజ్ మిసైళ్ళని ఉక్రేయిన్ కు ఇవ్వాలి అని… ఇప్పటికే అవి ఉక్రేయిన్ కి చేరుకున్నాయి అని సమాచారం. SCALP క్రూయిజ్ మిస్సైల్ పరిధి 250 కిలోమీటర్ల దూరం అని బయటికి చెప్తున్నా నిజానికి అది 350 KM వెళ్లగలదు. ప్రస్తుతం ఉక్రేయిన్ దగ్గర ఉన్న SU-27 లకు ఇంటిగ్రేట్ చేసేపనిలో ఉన్నారు ఇంజినీర్లు.SCALP క్రూయిజ్ మిస్సైల్ రష్యాలోకి 300 KM వెళ్లి దాడిచేస్తుంది. F-16 లతో కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. బహుశా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి మొదటి మెట్టుగా భావించవచ్చు…
Share this Article