.
హేయ్, క్షుద్ర జాతీయవ్యతిరేక సీపీఎం… చివరకు లెంపలేసుకున్నావు… హేయ్, పినరై విజయన్, తలవంచి శబరిమల అయ్యప్ప శరణం అంటున్నావు… ఎస్, మాకందరికీ తెలుసు, నీది నక్క వినయం, అవకాశవాద రాజకీయం…
ఏమిటిదీ అంటున్నారా..? ఓ చిన్న విషయం చెప్పుకోవాలి… కేరళ ఎన్నికలు కదా…, సగటు ఫాసిస్ట్, అక్రమ కుటుంబ, ప్రాంతీయ పార్టీలకు దీటుగా వెలుగుతున్న సీపీఎం ఎన్ని వేషాలు వేస్తున్నదో, ఏ పోకడలు పోతున్నదో చెప్పుకోవాలి కదా…
Ads
విషయం ఏమిటంటే… లింగవివక్ష అనే ఓ తర్కరహిత సాకుతో సుప్రీంకోర్టు ఓ తీర్పు వెలువరిస్తూ… రుతుమహిళలకూ శబరిమల ఆలయప్రవేశం కల్పించాలని అప్పట్లో చెప్పింది కదా… దొరికింది కదాని, పక్కా హిందూ వ్యతిరేక సీపీఎం వెంటనే ఇద్దరు రుతుమహిళలను పోలీసు భద్రతతో గుడిప్రవేశం చేయించి, కోట్లాది మంది హిందువుల మనోభావాలను తొక్కేసిన సంగతి తెలుసు కదా…
అంతేకాదు, సుప్రీం తీర్పుకు మద్దతుగా మానవహారాలు కూడా నిర్వహించింది… సీపీఎం అంటే అంతే కదా… పక్కా హిందూ వ్యతిరేకత… దాని జీన్ కేరక్టర్ అది… కానీ అవకాశవాదమే సగటు రాజకీయం కదా… సీపీఎం అందులోనూ ముందంజ కదా…
ఇప్పుడేం చేసిందంటే..? రుతుమహిళల్ని 10 – 50 ఏళ్ల మహిళల్ని గుడిలోకి అనుమతించడం కరెక్టు కాదనీ, ఇన్నాళ్ల ఆ నమ్మకం ఓ సంప్రదాయం, ఆచారమే తప్ప మహిళల వివక్ష కాదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది… ఇదీ మన దేశ పార్టీల ధూర్తత… పచ్చి అవకాశవాదం… సగటు కుటుంబ అక్రమ, అవినీతి, అడ్డదిడ్డపు పార్టీలకు సీపీఎం ఏరకంగా భిన్నం..?
https://www.sakshi.com/telugu-news/national/sabarimala-entry-not-discriminatory-tdb-tells-sc-2741355
1. ఆనాడు ‘మూర్ఖత్వం’.. ఈనాడు ‘పశ్చాత్తాపం’?
2018లో సుప్రీంకోర్టు తీర్పు రాగానే, భక్తుల మనోభావాలను గౌరవించాల్సింది పోయి, కమ్యూనిస్ట్ ప్రభుత్వం దానిని ఒక రాజకీయ అవకాశంగా మార్చుకుంది…
-
నాడు…: కోట్లాది మంది హిందువుల నిరసనలను లెక్కచేయకుండా, వందల కిలోమీటర్ల పొడవునా ‘మహిళా గోడ’ (Human Wall) కట్టింది… పోలీసుల సాయంతో ఇద్దరు మహిళలను రహస్యంగా లోపలికి పంపడం ద్వారా భక్తుల గుండెల్లో గాయం చేసింది… కేరళలో క్రిస్టియన్, ముస్లిం వోట్లు ఎక్కువ కదా, ఆ సమూహాల ఎదుట మోకరిల్లింది… వోట్ల కోసం, స్వతహాగా హిందూ వ్యతిరేక జన్యులక్షణం కాబట్టి….
-
నేడు…: ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) సుప్రీంకోర్టులో తన వాదనను మార్చుకుంది… మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం వివక్ష కాదని, అది కేవలం నైష్ఠిక బ్రహ్మచారి అయిన అయ్యప్ప స్వామి సంప్రదాయమని అంగీకరించింది…
2. రాజకీయ మూల్యం.. భయం!
సిపిఐ (CPI) ఇప్పటికే ఈ విషయంలో తమ వైఖరి తప్పని పరోక్షంగా ఒప్పుకోగా, ఇప్పుడు సిపిఎం (CPM) కూడా అదే దారిలో ఉంది. దీనికి ప్రధాన కారణాలు…:
-
ఓటు బ్యాంక్ షాక్….: శబరిమల విషయంలో హిందూ ఓటర్లు తీవ్రంగా ఆగ్రహించి, ఎన్నికల్లో కమ్యూనిస్టులకు గట్టి గుణపాఠం చెప్పారు…
-
ఆచారాల ప్రాముఖ్యత…: పార్టీ సిద్ధాంతాల కంటే ప్రజల విశ్వాసాలే గొప్పవని ఆలస్యంగానైనా అర్థం చేసుకోవడం…
3. ధ్వజస్తంభం బంగారం వివాదం
శబరిమల ధ్వజస్థంభం బంగారు తాపడానికి సంబంధించి కిిలోల కొద్దీ బంగారం మాయం చేసింది విజయన్ ప్రభుత్వం… విదేశాంగ శాఖ ప్రోటోకాల్ బ్యాగుల్లో బంగారం స్మగ్లింగ్ చేసిన అక్రమాలూ చూశాం… విజయన్ కుటుంబ పక్షపాతమూ చూశాం… సీపీఎం సిద్ధాంత రీత్యా వ్యతిరేకించే భ్రష్టాచార్‌కు విజయన్ అతీతుడు కాదు…
ముగింపు: కాలం నేర్పిన పాఠం
ఏ అధికార బలంతోనైతే, ఏ హిందూ వ్యతరేకతతోనైతే గుడి ఆచారాలను తుంగలో తొక్కాలని చూశారో, అదే అధికారం కాపాడుకోవడానికి ఇప్పుడు మళ్ళీ ‘అయ్యప్ప శరణం’ అనాల్సిన పరిస్థితి ఏర్పడింది… ఒకప్పుడు “ప్రోగ్రెసివ్” అని చెప్పుకున్న మానవహారాలు, నేడు ఆ ప్రభుత్వానికే గుదిబండగా మారాయి…
"ధర్మో రక్షతి రక్షితః"–ధర్మాన్ని మనం రక్షిస్తే, ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. శబరిమల విషయంలో చివరికి ఆచారమే గెలిచింది. పెద్ద పెద్ద తోపులే విరిగిపడ్డయ్... విజయన్ ఎంత..? తన మూర్ఖ పార్టీ ఎంత..?
Share this Article