మొన్నామధ్య సాయిపల్లవి ఓ ఫోటో షేర్ చేసుకుంది… చీరెలో ఆమె, భుజాన ఓ హ్యాండ్ బ్యాగ్, వీథుల్లో పరుగు తీస్తున్న అడుగులు… అంతే, అందులో ఆమె మొహం ఏమీ లేదు… మే9న ఇదేమిటో వెల్లడవుతుందని చెప్పింది… అది ఆమె జన్మదినం… సో, ఆ ఫోటో ఎందుకు వైరల్ అయ్యిందీ అంటే… ఈమధ్య అందరూ తెగరాసేస్తున్నారు, ఆమె చేతిలో సినిమాల్లేవు, పెళ్లి చేసుకుంటోంది, సినిమాలకు దూరమవుతోంది అని…! ఒరేయ్ బాబూ, ఈ పెళ్లి ముచ్చట్లు ఫేక్, రాయకండ్రా బాబూ అని ఆమె స్వయంగా చెప్పుకున్నా సరే, అవేమీ ఆగలేదు…
నిజంగానే శ్యామసింగరాయ్, లవ్‌స్టోరీ తరువాత ఆమె సినిమాల సంగతులేమీ కొత్తవి లేవు… అప్పుడెప్పుడో స్టార్ట్ చేసిన విరాటపర్వం జాడాపత్తా లేదు… అఫ్‌కోర్స్, జూలైలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా మొన్న దర్శకుడు వేణు చెప్పాడు… ఇంకేముంది..? ఇక కొత్త సినిమాలేమీ ఒప్పుకోలేదు, రిలీజ్ కావల్సినవేమీ లేవు, ఏమో నిజంగానే పెళ్లి చేసుకుని, సినిమాలకు దూరమైపోయి, వాళ్ల సొంతూరులో డాక్టర్ ప్రాక్టీస్ పెట్టుకుంటుందేమో అని నమ్మారు చాలామంది…
Ads
ఇప్పుడు హఠాత్తుగా ఓ సినిమా గురించి వెల్లడించింది ఆమె… అది గార్గి అనే సినిమా… గ్లింప్స్ తన సోషల్ ఖాతాల్లో అధికారికంగానే షేర్ చేసుకుంది… కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోయే ఆ సినిమా షూటింగ్ సీన్స్, డబ్బింగ్ సీన్స్ ఉన్నాయి ఆ వీడియోలో… ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆమె ఏమీ చెప్పలేదు… కానీ ఆ సినిమా జూన్‌లో రిలీజ్ చేయనున్నారు… షూటింగ్ పార్ట్ పూర్తయి, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది… దర్శకుడు గౌతమ్ రామచంద్రన్… (ఈయన గతంలో రిచీ అనే సినిమా తీశాడు…)
I waited months to talk about this film, And finally!!! my birthday is when the stubborn team decided to give in and release this ☺️
Presenting to you, GARGI ❤️, @prgautham83’s brain child!https://t.co/uxw8Lsb1eI
— Sai Pallavi (@Sai_Pallavi92) May 9, 2022
ఇన్నాళ్లు ఈ సినిమాకు సంబంధించిన వివరాలేమీ ఎక్కడా కనిపించలేదు కాబట్టి సహజంగానే ఈ వీడియో మీద అందరికీ ఆసక్తి క్రియేటైంది… నిజానికి గార్గి పేరిట మూణ్నాలుగేళ్ల క్రితం ఓ మరాఠీ సినిమా వచ్చింది… ఈ వీడియోను బట్టి ఈ కొత్త గార్గి మూవీ హీరోయిన్ సెంట్రిక్ అని, ఏదో న్యాయపోరాటం చేసిన కథ అనీ అర్థమవుతోంది… దీనికి సంగీతం గోవింద వసంత… బహుశా జీ మ్యూజిక్ సౌత్ కంపెనీ వాళ్లు మొదట ఓటీటీ కోసం తీసినట్టున్నారు…
మరోవైపు విరాటపర్వం సినిమాకు సంబంధించి కూడా ప్రమోషన్ వర్క్ సాగుతోంది… చిత్రం ఏమిటంటే..? అందులో రానా, నందితాదాస్, ప్రియమణి తదితరులు ఉన్నా సరే సాయిపల్లవినే హైలైట్ చేస్తున్నారు… వెన్నెల పాత్ర పేరిట కథ ఆమె చుట్టే తిరుగుతుంది…! గార్గిలో మూడు భాషల్లోనూ సాయిపల్లవే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది… ఆ కథేమిటో, ఇతరత్రా ఆ సినిమా వివరాలేమిటో ఎవరికీ తెలియదు..!
Share this Article