Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హిందూ గుళ్లల్లోని సాయిబాబా విగ్రహాలపై తాజా వివాదం… అసలేం జరుగుతోంది..?!

October 4, 2024 by M S R

మన తెలుగు మీడియా పెద్దగా పట్టించుకోలేదు గానీ… కాశి క్షేత్రం సహా ఉత్తరాదిలోని పలు హిందూ పుణ్యక్షేత్రాల్లో సాయిబాబా విగ్రహాలను తొలగిస్తున్నారు… ముసుగులు తొడుగుతున్నారు… కొన్ని గంగా నదిలో గౌరవంగా నిమజ్జనం చేశారు… కానీ ఎందుకు..? ఎవరు..?

సనాతన రక్షక్ దళ్, బ్రాహ్మణ సభ ఈ కొత్త ‘ఉద్యమానికి (?) నాయకత్వం వహిస్తున్నాయి… బడా గణేష్ ఆలయం సహా ఇప్పటికే పది గుళ్లల్లో నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించినట్టు వార్తలు కనిపిస్తున్నాయి… ‘మేం సాయిబాబాకు వ్యతిరేకం కాదు, కానీ ఆయనకు హిందూ సనాతన గుళ్లల్లో చోటు లేదు’ అంటున్నాడు సనాతన రక్షక్ దళ్ అధ్యక్షుడు అజయ్ శర్మ… సాయిబాబా దేవుడే కాదు అంటోంది కాశి విద్వత్ పరిషత్…

పైకి ఏం చెప్పినా సరే, అసలు కారణం క్లియర్… సాయిబాబా పుట్టుకతో ముస్లిం… తనను హిందూ గుళ్లల్లో పెట్టి, హిందూ ఆరాధన ఆగమ పద్ధతుల్లో హిందువులే పూజలు చేయడం ఏమిటనేది వాళ్ల వ్యతిరేకతకు కారణం… అవును, నమ్మి పూజలు చేసేవాళ్ల విశ్వాసం అది… విశ్వాసమే దేవుడు కదా, ఆయన్ని పూజిస్తే తప్పేమిటి అనే ప్రశ్నకు మరో కారణం చెప్పుకొస్తున్నారు వాళ్లు…

Ads

‘సనాతన ధర్మంలో మరే ఇతర విగ్రహాల స్థాపనకు అనుమతించబడదు….. దేవాలయాలలో సూర్యుడు, విష్ణువు, శివుడు, శక్తి, గణేశుడు అనే ఐదు దేవుళ్ళు, దేవతల విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించవచ్చు, పూజించవచ్చు’ అనేది వారి వాదన… సాయిబాబా గుళ్లల్లో మొత్తం హిందూ ఆగమ పద్ధతుల్లోనే అర్చనలు చేస్తారు, ఉత్సవ విగ్రహాలను పెట్టి అభిషేకాలు వంటి అన్ని అర్చనలూ చేస్తుంటారు… మరోవైపు ధుని వంటి హిందూయేతర అంశాలూ కనిపిస్తుంటాయి…

ఈమధ్య హైదరాబాద్‌కు 50, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ విశిష్ఠ లింగక్షేత్రంలో అనేక లింగాల నడుమ సాయిబాబా విగ్రహాలు కనిపిస్తాయి, అదేమంటే సాయిబాబా పీఠం అంటాడట ఈ పీఠాధిపతి… దేశంలో పీఠాలు అనిపించుకోవడానికి ప్రామాణికాలు ఏమీ ఉండవు కదా… కొందరు బాబాలు, స్వాములు స్వంతంగా పీఠాలు పెట్టేసుకుని, రాజకీయ నాయకులతో ఎలా అంటకాగారో తెలుగు జనానికీ తెలుసు కదా… సరే, ఆ విశిష్ట లింగక్షేత్రం మీద ‘ముచ్చట’ ప్రచురించిన కథనం లింక్ ఇది… ఓం నమఃశివాయ… నిజంగానే ఈ శివుడు భక్తసులభుడు… ఎటొచ్చీ…!?

సరే, మతం పేరుతో జనం విశ్వసించి పూజంచే సాయిబాబా విగ్రహాలపై ఈ ద్వేషం, ఈ వ్యతిరేకత సమంజసమా, కాదా అనేది వేరే చర్చ… కానీ ఇక్కడ అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతోంది… పవన్ కల్యాణ్ తాజాగా సనాతన ధర్మపరిరక్షణ అనే ఎజెండా పట్టుకున్నాడు కదా, కేంద్రం స్థాయిలో ఓ బోర్డు కావాలీ అంటున్నాడు కూడా… సాయిబాబా విగ్రహాల తొలగింపు కూడా సనాతన ధర్మరక్షణ అంటున్నారు ఉత్తరాది హిందూ నాయకులు… వారాహి డిక్లరేషన్ వెలువరించిన పవన్ కల్యాణ్ ఏం చెబుతాడో తెలియదు, సనాతన ధర్మమనగా ఏమిటో కూడా జనానికి కాస్త క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడో లేదో కూడా తెలియదు…

saibaba

పెద్ద పెద్ద చర్చలు, సందేహాలు, నివ‌ృత్తుల జోలికి పోవడం లేదు గానీ… శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, గణేషుడికి మాత్రమే చోటు అట సనాతన ధర్మంలో… అయ్యలూ, ఈ దేశంలో హిడింబికి, బర్బరీకుడికి కూడా గుళ్లున్నాయి స్వాములూ… అంతెందుకు..? రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు విష్ణువు అంశలు సరే, హనుమంతుడు రుద్రుడి అంశ సరే… దశమహావిద్యలు సహా సకల గ్రామదేవతలూ శక్తి స్వరూపాలే… మరి నవగ్రహాల్ని ఏమనాలి..? వాటి విగ్రహాల్ని ఏమనాలి..? ఇంతకీ అయ్యప్ప స్వామి ఎవరి అంశ..? అసలు సనాతన ధర్మం, ఆధునిక హిందూ ధర్మం నడుమ తేడాలేమిటి..? అనేకానేక ప్రశ్నలు, సందేహాలు…

స్వరూపానందులు, జియ్యర్లతో కాదు గానీ… ఒక చాగంటి, ఒక గరికపాటి ఏమైనా సనాతన ధర్మంపై వివరణ ఇస్తారేమో చూడాలి…  శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కూడా సాయిబాబాను పూజించడాన్ని వ్యతిరేకిస్తూ, ఆయన హిందూ దేవుడు కాదని చెప్పాడు… ”ప్రాచీన గ్రంథాలలో సాయిబాబా ప్రస్తావన లేదు” అంటాడాయన… బాగేశ్వర్ ధామ్‌కు చెందిన ఆచార్య ధీరేంద్ర శాస్త్రి కూడా సాయిబాబాను ‘మహాత్ముడిగా, గొప్ప సాధువుగా చూడాలే తప్ప దేవుడిగా పూజించొద్దు అంటున్నాడు…

మహారాష్ట్రలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఈ ధోరణిని వ్యతిరేకిస్తున్నాయి… ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యేకించి సమాజ్‌వాదీ పార్టీ ఈ పోకడలను ఖండిస్తోంది… ‘హిందూ మతం అందరినీ కలుపుకుని పోయే మతం, శతాబ్దాలుగా హిందూ మతం అనేకానేక అభిప్రాయాల్ని, విశ్వాసాల్ని గౌరవించింది’ అంటోంది… ఇది బీజేపీ తాజా పొలిటికల్ స్టంట్ అనేది ఆ పార్టీ ఆరోపణ…!! రాహుల్ గాంధీ, ప్రకాశ్ రాజ్ కూడా ఇంకా తెర మీదకు రాలేదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions