.
ఒకావిడ వీరావేశంతో యూట్యూబ్ వీడియోలో మాట్లాడేస్తోంది… సాయిపల్లవిని కూడా మరీ ప్రకాష్‌రాజ్ తదితరులతో పోలుస్తూ సాయిపల్లవిని ఓ ద్రోహి అన్నట్టు మాట్లాడుతోంది… తీరా చూస్తే…
సాయిపల్లవి తన ట్వీట్‌లో టెర్రరిస్టులను జంతువులతో పోల్చిందట, అది తప్పట… సరే, మత టెర్రరిస్టులను జంతువులతో పోల్చడం జంతువులను అవమానించడమే… కానీ టెర్రరిస్టుల చర్యను ఖండించడంలో ఆమె సంకల్పంలో తప్పముంది..? ఆమె పరోక్షంగా, ప్రత్యక్షంగా కుహనా సెక్యులరిస్టుల్లా వ్యవహరించలేదు కదా… స్ట్రెయిట్‌గా ఖండించింది…
Ads
ఎస్, ఒక ప్రకాష్ రాజ్, ఒక సిద్ధార్థ్, ఒక కమలహాసన్ వంటి మేధావుల్ని, వాళ్ల ట్వీట్ల, వాటి వెనుక కూడా అంతర్లీనంగా వ్యక్తమయ్యే వేరే అర్థాలను ప్రస్తావిస్తే వోకే… కానీ మరీ సాయిపల్లవి మీదకు దాడి దేనికి..? ఆమె విశ్వాసి…
దీనికి అంతేముంది..? రాక్షసులతో పోల్చినా తప్పే, పిశాచాలతో పోల్చినా తప్పే… అవును, టెర్రరిస్టులను ఎవరితోనూ పోల్చకూడదు… కానీ స్పందనలో నిజాయితీని కదా చూడాల్సింది…
ఎప్పటిలాగే కమ్యూనిస్టులు తమ హిందూ మతవ్యతిరేకతను బయటపెట్టుకుంటున్నారు అని చెబుతున్నారా..? లేదు… పోనీ, ఒక రాబర్ట్ వాద్రా, ఒక మణిశంకర్ అయ్యర్, ఒక శివసేన ఠాక్రే, ఒక ఎన్సీపీ అనిత్ దేశ్‌ముఖ్ వంటి వాళ్లు చేసే ట్వీట్లలో కప్పదాట్లు, పరోక్ష టెర్రరిస్టు సమర్థనలు ప్రస్తావిస్తే ఓ అర్థముంది…
సోకాల్డ్ సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే ముఖ్య, ప్రాంతీయ, కుటుంబ, వ్యక్తి కేంద్రిత పార్టీల దోబూచులాటల్ని, దొంగ మాటల్ని ప్రస్తావిస్తే అర్థముంది… ఇంకా వీలయితే న్యూయార్క్ టైమ్స్, బీబీసీ వంటి భారత వ్యతిరేక మీడియా ధోరణులను ఎండగడితే అర్థముంది…
టెర్రరిస్టులనే పదం గాకుండా మిలిటెంట్లు, గన్‌మెన్ అనే పదాల్ని వాడాయి అవి… చివరకు అమెరికా విదేశాంగ శాఖే ఆ మీడియా ధోరణులను ఎండగట్టింది… ఉగ్రవాదం విషయంలో ఇలాంటి ధోరణులు సరికాదని ఛీత్కరించింది… మరీ అల్ జజీరా తరహాలో వ్యవహరించకూడదు అంటోంది…!
మేం టెర్రరిస్టుల చర్యల్ని ఖండిస్తున్నాం, ఖండించని వాళ్లను ఎండగడుతున్నాం అనే ధోరణిలో ఏదేదో మాట్లాడేస్తే, చూపించేస్తే అదెలా సమంజసం..? అంటే, ఇది ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ చానెల్‌నో, ఒక జర్నలిస్టునో కాదు… అలాంటి వాళ్లందరినీ…
చెప్పాల్సింది స్ట్రెయిట్‌గా చెప్పాలి… పంచ్ ఉండాలి, వాదన సమర్థంగా ఉండాలి… మరీ సెక్యులరిజం ముసుగులో శతృదేశానికి, టెర్రరిస్టులకు పరోక్ష సమర్థన సాగించే వాళ్లకూ, పార్టీలకూ మీ వీడియోలకు, మీ ధోరణులకు తేడా ఉండాలి కదా..!!
Share this Article