నయనతార సరోగసీ ద్వారా కవలపిల్లలకు జన్మనిచ్చింది… జన్మనివ్వడం అనే పదం ఇక్కడ కరెక్టో కాదో గానీ జెనెటికల్ మదర్ ఆమే, జెనెటికల్ ఫాదర్ ఆమె భర్త విఘ్నేశే కాబట్టి ఆ పిల్లలకు జన్మనిచ్చారు అనే అందాం… ఆఫ్టరాల్ సరోగసీ అంటే వాళ్ల దృష్టిలో ఓ సజీవ ఇంక్యుబేటర్… అంటే జీవమున్న ఇంక్యుబేటర్… పిల్లల్ని పొదిగే జీవయంత్రం… అంతకుముందు కరణ్ జోహార్ చేసిందీ అదే…
అందరూ ఆలియాభట్‌లు ఎందుకుంటారు..? తమ అందం చెడకుండా, చెడుతుందనే భయం లేకుండా… కడుపును మోసి, కనేవాళ్లకన్నా, ఆ మాతృత్వపు మధురిమను అండం దశ నుంచే అనుభవించకుండా… పిల్లల్ని కనడం అనే ఓ బృహత్ స్వీయానుభవాన్ని రక్తపరీక్ష, మూత్రపరీక్ష… పిల్లల డోర్ డెలివరీ స్థాయికి చేర్చేశారు…
సర్లె, తమ గర్భాశయాన్ని కిరాయికి ఇచ్చి కొందరు ఉపాధి పొందుతున్నారు… ఆ కోణంలో చూస్తే ఆల్ ఈజ్ వెల్… అదంతా వేరే చర్చ గానీ… మెల్లిమెల్లిగా వేరే సినిమా సెలబ్రిటీలు కూడా ఇదే పద్ధతిలో తండ్రులు కావడానికి, తల్లులు కావడానికి సిద్ధపడుతున్నారు… నయనతార, ఆమె భర్త పేరెంట్స్… కరణ్ జోహార్ సింగిల్ ఫాదర్… సేమ్, సల్మాన్ ఖాన్ కూడా ఇద్దరు లేక ముగ్గురు పిల్లల్ని కంటాడట… (మగాడు కదా, కంటాడు అనొచ్చా..?)
Ads
మొన్న సల్మానుడి 57వ బర్త్‌డే అయ్యింది లెండి… పల్లెసీమల్లో ఆ వయస్సుకు అన్నీ ఉడిగిపోయి, ముసలోళ్లయిపోతారు… కానీ సల్మాన్ కథ వేరు కదా… నవయవ్వనుడు… ఆ ఫంక్షన్‌కు తన మాజీ ప్రియురాళ్లతోపాటు పలువురు హిందీ సినిమా సెలబ్రిటీలు కూడా వచ్చారు… అక్కడ ఇండియాటుడే న్యూస్ హెడ్ రజత్ శర్మ వేసిన ఒక ప్రశ్నకు బదులిస్తూ… ‘‘పెళ్లి మాటలేదు కానీ ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలకు తండ్రిని అవుతా’’ అన్నాడు…
మరి వాళ్లకు తల్లి ఎలా..? ఈ ప్రశ్న కూడా తనే వేసుకుని, ఊరివాళ్ల సహకారంతో ఆ ఏర్పాటు కూడా చేస్తాను, వాళ్లకు తగిన సాయం చేస్తాను అంటున్నాడు… గుడ్… అదే బెటర్… తన జీవితంలో ఎందరు ఆడవాళ్లు వచ్చిపోయారో తనకే తెలియదు… రెగ్యులర్ జిమ్ సాయంతో లుక్కు మారలేదు గానీ ఈ వయస్సులో పెళ్లి చేసుకున్నా మంచిదికాదు ఆ ఆడపిల్లకు… పైగా సల్మాన్‌కు అంతుచిక్కని ఓ రోగం ఉంది…
సల్మాన్ ఖాన్ ఎక్కువ సేపు మాట్లాడలేకపోయేవాడు.., మాట్లాడితే మూతి వంకర పోయేది, ముఖంలోని నరాల్లో తీవ్రంగా నొప్పి వచ్చేది… వైద్య పరీక్షల తరువాత తెలిసింది ఆయనకు ట్రైజెమినల్ న్యురాల్జియా అనే నరాల సమస్య ఉందని… అది కూడా కేవలం ముఖంలో ఉండే నరాలకే… ఈ సమస్య ఉన్న వారిలో అధిక శాతం మందిలో ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందట… సరే, సల్మాన్ తలుచుకుంటే మందులకు కొదువా..? చికిత్స తీసుకుంటూ నెట్టుకొస్తున్నాడు…
సల్మాన్ అంటేనే వివాదం… దుందుడుకుతనం… అహం… ఎప్పుడేం చేస్తాడో తెలియదు… ఈ స్థితిలో పెళ్లి ఎలాగూ సూచనీయం కాదు కానీ ఆ ఇద్దరు ముగ్గురు పిల్లలకైనా సరైన భవిష్యత్తు ఏర్పాట్లు చేస్తే బెటర్… అవునూ, నీ జెనెటిక్ పిల్లలే కావాలా..? ఏ వీర్యమైనా సరే, ఏ అండమైనా సరేనా..? ప్రజెంట్ గరల్ ఫ్రెండ్ అయిలియా వంతూర్ ను అడిగి చెబుతావా..?!
Share this Article