సమంత సినిమాలను మానుకుంటోంది… మీరు చదివింది నిజమే, కారణాలేమిటో ఆమె చెప్పడం లేదు గానీ తన నటనకు సుదీర్ఘమైన బ్రేకప్ ఇవ్వాలని నిర్ణయించుకుంది… బహుశా ఒకటీరెండేళ్ల కనీసకాలం ఆమె నటించకపోవచ్చు… బహుశా ఆమె మయోసైటిస్ చికిత్సకు టైమ్ పట్టేట్టుందనీ, కొన్నాళ్లు విశ్రాంతి అవసరమనీ వైద్యులు చెప్పినట్టు సమాచారం…
అప్పట్లో ఏదో సినిమా (యశోద?) ప్రమోషన్లలో తను వ్యాధిగ్రస్త అని చెప్పుకుంది… తనెలా అవస్థలు పడిందీ చెప్పింది… అంతేకాదు, శాకుంతలం సినిమా ప్రమోషన్లలో ముక్కు చీదుతూ మాటిమాటికీ కర్చీఫ్‌తో తుడుచుకుంటూ కనిపించింది… ఆమె వ్యాధి ఇంకాస్త పెరిగి అవస్థలు పడుతుందేమో అనుకున్నారు అందరూ… ఇప్పటికీ సమంత మొహంలో పాత మెరుపు, కళ కనిపించడం లేదు…
Ads
ఆ శాకుంతలం మీడియా మీట్ తరువాత ఆమె అమెజాన్ వాళ్లు తీస్తున్న సిటాడెల్ ఇండియన్ వెర్షన్ ప్రమోషన్ వర్క్‌లో ఉత్సాహంగా పాల్గొంది… అసలు మయోసైటిస్ జాడలే తెలియలేదు… మాంచి హుషారెక్కించే డ్రెస్సులతో సరదాగా కనిపించింది… మరి శాకుంతలం ప్రమోషన్లలో ఆ ఏడుపు మొహం ఎందుకు పెట్టిందనే వార్తలు వచ్చాయి అప్పట్లో… సెలైన్ ఎక్కించుకుంటూ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి తెలుసు కదా…
ప్రస్తుతం ఆమె దేవరకొండ విజయ్‌తో ఖుషీ సినిమా చేస్తోంది… రెండుమూడు రోజుల్లో ఆ షూటింగ్ అయిపోనుందట… ఇక కొత్త వెబ్ సీరీస్ గానీ, సినిమాలు గానీ సమంత అంగీకరించడం లేదు, నో ఫ్రెష్ అగ్రిమెంట్స్… అంతేకాదు, గతంలో కుదిరిన కొన్ని అగ్రిమెంట్ల తాలూకు అడ్వాన్స్ డబ్బుల్ని కూడా సమంత వాపస్ ఇస్తున్నదట…
ఆమె ఆగస్టులో అమెరికా వెళ్లనుంది… అమెరికాయే కాదు, దక్షిణ కొరియాకు కూడా వెళ్లనుందట… మయోసైటిస్ చికిత్స అంత ఈజీ కాదు, రెస్ట్, ప్రాపర్ చికిత్స అవసరం… అందుకే ఇప్పుడు సినిమాలకు లాంగ్ బ్రేక్… తనకు పూర్తిగా నయమైతే తప్ప షూటింగులకు రాలేనని సమంత చెబుతోంది… అయితే ప్రస్తుతం మార్కెట్లో కట్ థ్రోట్ కంపిటీషన్ నడుస్తోంది… ఏమాత్రం గ్యాప్ వచ్చినా సరే, తిరిగి ‘కోలుకోవడానికి’ కష్టం… కానీ సమంతకు తన అనారోగ్యం రీత్యా తప్పదు…
Share this Article