Sampathkumar Reddy Matta…. సమ్మక్క- సారక్క పలారముల్లా.. !
~~~~~~~~~~~~~~~~~~~~~~~
రెండేండ్లకు ఓసారి కండ్ల పండుగగా జరిగే
సమ్మక్క- సారక్క మహా జాతర పూర్తయింది.
ఒక్క మేడారం దగ్గరనే కాకుంట
ఉత్తర తెలంగాణల వందల ఊర్లల్ల
జాతరలు ఘనంగా జరుగుతయి.
ఒక్క మా కరీంనగర్ చుట్టుపక్కలనే
యాబైకి పైగా జాతర గ్రామాలున్నయి.
మేడారం తల్లి జాతరయితే
ఊర్లల్లయన్నీ పిల్ల జాతరలన్నట్టు.
కోటానుకోట్ల భక్తజనం తాకిడి
లక్షల మణుగుల బంగారం సమర్పణ
లక్షల పాలకాయల మొక్కుచెల్లింపులు.
ఆసియాలోనే, అతి పెద్ద జాతర ముగిసింది.
ప్రపంచంలోనే అతి పెద్ద జాతర అనేదీ ప్రశస్తి.
ఇంటింటికీ కిలోలకొద్ది తీపి బంగారం చేరింది.
మామూలుగా ఈ బంగారాన్ని వేడిచెయ్యరు.
నువ్వుల ముద్దలకు, పల్లీల ముద్దలకు,
సత్తు పిండ్లకూ, వట్టిగ తినుటానికీ వాడుతరు.
ఈసారి మాకు మీదమీదనే ఐదారుకిలోల బంగారం జమైంది.
తొలుతొలుతగా పిల్లలకు నల్లనువ్వుల ముద్దలు తయారైనయి.
సమ్మక్క బెల్లం ప్రసాదాన్ని “బంగారం” అంటరని తెలుసనుకుంట.
ఇదీ.. మా సమ్మక్కసారక్కల సంపన్నమైన బంగారు సంప్రదాయం.
~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
(ఇక్కడ పలారం అంటే ప్రసాదం, అల్పాహారం కాదు…)
Ads
Share this Article