సెవనో క్లాక్ బ్లేడ్… నో, నో… డేగల బాబ్జీ ఉరఫ్ బండ్ల గణేష్‌కన్నా ఇయాల్టిదినానికి దగడ్ సాంబ ఉరఫ్ సంపూర్ణేష్ బాబు తోపు అని ప్రూవైపోయింది… అదేమిటీ, ఒకేసారి అంత పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చేశారని అదోలా చూడకండి… పెద్ద పెద్ద స్టార్లతో భారీ భారీ చిత్రాలు తీసిన బండ్ల గణేషుడెక్కడ..? ఏవో నాలుగు స్పూఫులు తీస్తూ, పెద్ద షార్ట్ ఫిలిమ్స్‌తో ఏదో అలా అలా నెట్టుకొచ్చే సంపూర్ణేష్ ఎక్కడ..? ఇదే కదా అందరికీ వచ్చే డౌటనుమానం..!
బండ్ల గణేష్ తీసిన సినిమాలకు ఆయనెవరో ఆంధ్రా పెద్ద రాజకీయ నాయకుడే డబ్బు పెట్టేవాడని ఓ టాక్ నడిచేది… మనకెందుకులెండి… పేరుకు గణేష్ పెద్ద నిర్మాత, అంతే… అప్పట్లో కమెడియన్‌గా కొన్ని సినిమాల్లో కనిపించాడు… కానీ సంపూర్ణేష్ బాబు ఫస్ట్ నుంచీ హీరో… సినిమా ఎన్నిరోజులు నడిచింది అనేదే ఇష్యూయే కాదు… అలా తన సినిమాలు తక్కువ ఖర్చుతో వస్తూనే ఉంటాయి… చూసేవాడు చూస్తాడు, లేకపోతే లేదు… కానీ తన స్టయిల్ అదే… తన జానర్ అదే… అసలు ఆ జానర్ ఇంకెవ్వడికీ చేతకాదు…
కానీ గణేష్..? ఇప్పుడు హీరో అట… అదీ ఈ సినిమాలో నవరసాలూ పోషిస్తాడట… తనొక్కడే, ఒకే గదిలో ఉంటాడట… (దేవుడోయ్…) మిగతా పాత్రల గొంతులు వినిపిస్తూ ఉంటాయట, అలా అలా కథ నడుస్తుందట… హమ్మయ్య, ఫైట్లు, డాన్సులు చూసే ప్రమాదం తప్పిందన్నమాటే… నిజానికి ఇవి కాదు చెప్పుకోవాల్సింది… ఎవరి సినిమా ఎలా ఉందో రేపు విడుదలయ్యాక ప్రేక్షకులు చెబుతారు గానీ… ఆల్‌రెడీ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు చెప్పేశారు… సంపూర్ణేష్ బాబే తోపు అని… ఎలాగంటే..?
Ads
బండ్ల గణేష్ అంతటి భారీ చిత్రాలు తీసిన నిర్మాత కదా… తను హీరోగా యాక్ట్ చేస్తే, అదీ ఓ ప్రయోగాత్మక చిత్రం చేస్తే… తనకు హైదరాబాద్‌లో దక్కిన థియేటర్లు నాలుగు… జస్ట్, నాలుగు మాత్రమే… అవీ ఒక్కొక్క షో మాత్రమే… తెలంగాణలో ఇతర థియేటర్ల లెక్క తీస్తే 11 తేలాయి… హైదరాబాద్‌లో ఒక్కటంటే ఒక్క రెగ్యులర్ థియేటర్‌లో కూడా ఈ సినిమాకు చాన్సివ్వలేదు… సినిమా మీద కొనుగోలుదార్లకు, ఎగ్జిబిటర్లకు అలా ఉంది నమ్మకం..!
సంపూర్ణేష్ సాంబడి కథ చూద్దాం… హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ సహా 5 రెగ్యులర్ థియేటర్లు… 39 మల్టీప్లెక్స్‌లు, మాల్స్, ఇతరత్రా థియేటర్లలో ఒక్కొక్క షో లేదా రెండేసి షోలు… తెలంగాణలో పలుచోట్ల 7 థియేటర్లు… అంటే సంపూర్ణేష్‌కు ఓ సెక్షన్ ప్రేక్షకులు ఉన్నారనే కదా బయ్యర్ల నమ్మకం… ఇదీ ఆ ఇద్దరి నడుమ తేడా… సరే, అది వదిలేస్తే రాజశేఖర్ ముసలి లుక్కుతో నటించిన శేఖర్ కూడా రేపు వస్తోంది… నిజానికి సర్కారువారి పాట బాగా డౌనయిపోయింది… ట్రిపుల్ ఆర్ పాతబడింది… కేజీఎఫ్-2 కూడా అంతే… డాన్ కలెక్షన్లు పర్లేదు… విష్వక్సేన్ సినిమాను అవసరంగా ఎత్తేశారు గానీ లేకపోతే ఇంకా కలెక్షన్లు ఉండేవి… వెరసి ఓ మంచి కొత్త సినిమాకు వెళ్దాం అని తేరిపారచూస్తే… ప్రస్తుతం హైదరాబాద్ థియేటర్లలో ఒక్కటీ లేదు…!!
Share this Article