.
వసూళ్ల లెక్కలు తీస్తే… ప్రతి సినిమాకు దాదాపు 5 కోట్ల వసూళ్లు మాత్రమే... ఒకరకంగా చిత్ర నిర్మాతల అసోసియేషన్ చెబుతున్నది నిజమే… హీరోహీరోయిన్ల పారితోషికాలు బాగా పెరగడమే కారణమనీ చెబుతున్నారు… నిజానికి మాలీవుడ్ సినిమాల నిర్మాణ వ్యయం తక్కువే… ఐనాసరే, ఇండస్ట్రీ లబోదిబో మొత్తుకుంటోంది…
Ads
కానీ మాలీవుడ్‌తో పోలిస్తే నిజానికి కన్నడ ఇండస్ట్రీయే దారుణంగా నష్టపోయింది ఈసారి… గత సంవత్సరం భారీ వసూళ్లతో, పాన్ ఇండియా సినిమాలతో అదరగొట్టిన శాండల్‌వుడ్ ఈసారి ఒక్కసారిగా పాతాళానికి పడిపోయినట్టయింది…
ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ కూడా చిన్నదే… తక్కువ నిర్మాణవ్యయం… కానీ కేజీఎఫ్ తదితర సినిమాలతో కన్నడ ఇండస్ట్రీ బాగా పుంజుకుంది… మిగతా సౌత్ ఇండియా ఇండస్ట్రీలకు దీటుగా ఎదిగింది… కానీ ఈసారి ఘోరం… కనీసం మాలీవుడ్ సగటున ఒక్కో సినిమాకు 5 కోట్లు రాబట్టింది, కానీ కన్నడ ఇండస్ట్రీలో సగటు సినిమా వసూళ్లు ఎంతో తెలుసా..? జస్ట్ కోటి రూపాయలు…
Hindi Net in 2024: 4109.02 Cr / 219 Movies
Kannada Net in 2024: 229.97 Cr / 208 Movies
Malayalam Net in 2024: 976.31 Cr / 189 Movies
Tamil Net in 2024: 1566.22 Cr / 245 Movies
Telugu Net in 2024: 2005.78 Cr / 310 Movies
Marathi Net in 2024: 137.79 Cr / 103 Movies
బాలీవుడ్ పనయిపోయిందని వింటున్నాం గానీ… ఈరోజుకూ హిందీ చిత్రాల వసూళ్లే ఎక్కువ… రీచ్ ఎక్కువ… దాని ప్రాధాన్యం దానిదే… సగటున ఒక్కో సినిమా 18 కోట్లు వసూలు చేసింది… సౌత్ ఇండియా థియేటర్లతో పోలిస్తే హిందీ బెల్టులో థియేటర్ల సంఖ్య తక్కువే… ఐనా గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కాస్త మెరుగు…
ఇప్పటికీ తెలుగు, తమిళ ఇండస్ట్రీలదే ఇండియన్ సినిమా రంగంలో హవా… ఎందుకంటే… తెలుగులో సగటున ఒక్కో సినిమా వసూళ్లు దాదాపు ఆరున్నర కోట్లు… కానీ సినిమాల సంఖ్య ఏకంగా 310… టాలీవుడ్ టాప్… డబ్బు ఈ ఇండస్ట్రీలోకి బాగా ఫ్లో అవుతోంది…
తమిళ సినిమాలు కూడా సగటున 6.4 కోట్ల వసూలు చేశాయి… దాదాపు తెలుగు సినిమాతో సమానం… కాకపోతే సినిమాల సంఖ్య జస్ట్ 245 మాత్రమే… ఇవన్నీ గ్రాస్ కలెక్షన్లు కావు, నెట్… ఈసారి హిందీ, తెలుగు వసూళ్ల పరిమాణం ఈ రేంజులో ఉండటానికి ఒక కారణం పుష్ప2 సినిమా…
ఐతే తప్పకుండా ఇండస్ట్రీ ఓసారి మాలీవుడ్ నిర్మాతల గోస వినాల్సిందే… అడ్డగోలు పారితోషికాలు, ప్రత్యేకించి హీరోల డిమాండ్లకు అంతూపొంతూ లేకుండా పోతోంది… కంగువా, తంగలాన్ వంటి భారీ డిజాస్టర్లు గనుక చోటుచేసుకుంటే తెలుగు ఇండస్ట్రీ కూడా తీవ్రంగా దెబ్బతినడం ఖాయం… బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు వంటివి కూడా ఏమీ ఆదుకోవు… అదీ రియాలిటీ..!!
Share this Article