Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నా వెంట రావలదు, రాతగదు అన్నాడు ఎన్టీయార్… జనం రాలేదు…

October 28, 2024 by M S R

పోవుచున్నావా ఔరా యమధర్మరాజా పోవుచున్నావా !! పో బేల పొమ్మికన్ పో బేల పో పొమ్మికన్ . నా వెంట రావలదు రాతగదు . 1967 లో ఉమ్మడి కుటుంబం సినిమాలో సతీ సావిత్రి నాటకంలో సావిత్రి వేషం కట్టిన వాణిశ్రీ , యముడు వేషం కట్టిన యన్టీఆర్ మాటలు అవి .

మళ్ళా 11 ఏళ్ల తర్వాత ఆ రెండు పాత్రల్ని వాళ్ళిద్దరే వేయటం విశేషమే . చిత్రం ఏమిటంటే కాసేపే ఉన్నా ఉమ్మడి కుటుంబం సినిమాలోని నాటకమే జనానికి బ్రహ్మాండంగా నచ్చింది .

మన దేశంలో సతీ సావిత్రి , సతీ అనసూయ , సతీ సుమతి వంటి పాతివ్రత్య మహిమల మీద వచ్చిన సినిమాలకు లెక్కే లేదు . అన్ని భాషల్లోనూ వచ్చాయి . మన తెలుగులో 1933 లో రెండు సతీ సావిత్రి సినిమాలు పోటాపోటీగా రిలిజ్ అయ్యాయి . ఒకటి H M రెడ్డి గారిది . మరొకటి సి పుల్లయ్య గారిది . సి పుల్లయ్య గారి సినిమాలో వేమూరి గగ్గయ్య యముడు . అదే ఆయన మొదటి సినిమా . జనానికి బాగా నచ్చాడు . పుల్లయ్య గారి సినిమా సక్సెస్ అయింది .

మళ్ళా 24 ఏళ్ళకు యస్ వరలక్ష్మి నిర్మాతగా సతీ సావిత్రి నిర్మించబడింది . సావిత్రి పాత్రను ఆమే వేసారు . అక్కినేని సత్యవంతుడి పాత్రను , యస్వీఆర్ యముడి పాత్రను వేసారు . కన్నాంబ భర్త కడారు నాగభూషణం దర్శకత్వం వహించారు . అయితే ఈ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు . దీనితో పాటే రిలీజ్ అయిన తోడికోడళ్ళు సినిమా దెబ్బకు బాగా ఆడలేదట .

Ads

ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ విశేషం చోటుచేసుకుంది . చైనా ప్రీమియర్ చౌ ఎన్ లై మద్రాస్ వస్తే ఈ సినిమా షూటింగుకు తీసుకుని వెళ్ళారట . యస్వీఆర్ భీకర ఆకారాన్ని చూసి దడుసుకున్నాడట . అదే ఏ హిరణ్యకశిపుడిపాత్రలో యస్వీఆర్ని చూసి ఉంటే గుండె ఆగిపోయేదేమో !

1978 జనవరి నాలుగో తేదీన రిలీజ్ అయిన ఈ సతీ సావిత్రి సినిమా కూడా బాగా ఆడలేదు . లవకుశ , రహస్యం సినిమాలను తీసిన శంకరరెడ్డే దీనికీ నిర్మాత . రహస్యంలో నష్టపోయి మళ్ళా యన్టీఆర్ తో సినిమా తీసినా బయటపడలేదు . చాలా భారీ తారాగణం ఉన్నా ప్రేక్షకులకు నచ్చలేదు . పాటలు బాగా లేవు . దర్శకత్వం కూడా చాలా వీక్ . క్లైమాక్స్ అయితే మరీ తేలకొట్టేసారు .

NTR , కృష్ణంరాజు , వాణిశ్రీ , గుమ్మడి , పండరీబాయి , కాంతారావు , ధూళిపాళ , పుష్పలత , ప్రభాకరరెడ్డి , మిక్కిలినేని , అల్లు రామలింగయ్య , రాజబాబు , జమున , అంజలీదేవి , కె ఆర్ విజయ , కాంచన , హలం , జయమాలిని తదితరులు నటించారు .

ఘంటసాల సంగీత దర్శకత్వంలో రెండో మూడో పాటల్ని రికార్డు చేసాక ఆయన మరణించారు . ఆయన స్థానంలోకి పెండ్యాల వారొచ్చి మిగిలిన అన్ని పాటల్ని , పద్యాల్ని పూర్తి చేసారు . ఆత్రేయ మాటల్ని , పాటల్ని వ్రాసారు . స్క్రీన్ ప్లే కూడా ఆయనదే . బి ఎ సుబ్బారావు దర్శకుడు .

NTR సినిమా కాబట్టి షిఫ్టింగులతో వంద రోజులు లాగించబడింది . ఆడవలసిన లెవెల్లో ఆడలేదు . సినిమా యూట్యూబులో ఉంది . ఆసక్తి కలవారు చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు   (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చిదంబరం ‘తప్పుల ఒప్పుకోలు’ ప్రకటనలు… అసలు మర్మమేమిటో…
  • Good Classmates..! ఆ క్లాస్‌మేట్ ఆత్మ ఆనందపడి ఉంటుంది…
  • అదే జగన్ ప్లేసులో తనుంటే… ఆ సీఎస్‌ను చంద్రబాబు ఏం చేసేవాడు..?
  • దిక్కుమాలిన ఎలిమినేషన్…! మరిక ప్రజాభిప్రాయం దేనికిరా భయ్..!?
  • ‘ఎ’ తెలుగు…’యాన్’ టెల్గూ…’ది’ తెగులు… ‘థి’క్కుమాలిన యాడ్…
  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions