Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పుడంటే నడిచింది… ఇప్పుడైతే బాబా మీద ఆ సీన్లు దుమారం రేపేవేమో…

March 30, 2024 by M S R

Subramanyam Dogiparthi…. పని రాక్షసుడు NTR 200 వ సినిమా 1970 లో వచ్చిన ఈ సూపర్ హిట్ సినిమా కోడలు దిద్దిన కాపురం . స్టోరీ లైన్ ఆయనే డెవలప్ చేసుకుని , స్క్రీన్ ప్లే వ్రాసుకుని దర్శకత్వాన్ని డి యోగానందుకి అప్పచెప్పారు . 175 రోజులు ఆడింది . ఒకవైపు జనం మెచ్చారు . మరోవైపు విమర్శల దాడులనూ ఎదుర్కొన్నారు . పుట్టపర్తి సాయిబాబా వేషధారణలో ఓ నకిలీ బాబా పాత్ర , మూఢభక్తితో అతని చేత మోసగించబడటం వంటి సీన్ల వలన విమర్శలు వచ్చాయి . ఆరోజుల్లో కాబట్టి విమర్శలతో వదిలేసారు . ఇప్పుడయితే బాయ్ కాట్ పిలుపిచ్చి , మరో పాతిక రోజులు ఆడించేవారు .

ఆయన ఆస్థాన సంగీత దర్శకుడు టి వి రాజు ఆధ్వర్యంలో కొన్ని పాటలు బాగా హిట్టయ్యాయి . ముఖ్యంగా సావిత్రి పాడే *నీ ధర్మం నీ సంఘం నీ న్యాయం మరువద్దు జాతిని నిలిపి … మహనీయులను మరువద్దు* పాట ఇప్పటికీ విద్యాసంస్థల ఫంక్షన్సులో వినిపిస్తూ ఉంటుంది . సి నారాయణరెడ్డి వ్రాసారు ఈ పాటను . మరో పాట నకిలీ బాబా సత్యనారాయణ పాడే పాట . ఓం సచ్చిదానంద నీ సర్వం గోవిందా బాగా పాపులర్ . రేలంగి , కె వి చలం మీద వంటవారి పాట . వంటింటి ప్రభువులం పాకశాస్త్ర యోధులం కూడా .
వాంప్ పాత్ర అయినా విజయలలిత పాట చూడవే చూడు చూడవే ఓయమ్మ చాలా శ్రావ్యంగా ఉంటుంది . క్లాసికల్ నృత్యం కూడా చాలా బాగుంటుంది . బహుశా 1980s వరకు వాంపుల చేత కూడా ఇంటిల్లిపాదీ కలిసి చూడగల చక్కటి నృత్యాలను పెట్టేవారు . ఇప్పుడు టిల్లు లాంటి సినిమాల పోస్టర్లు కూడా చూడలేకపోతున్నాం . ఇది మరో గోల అనుకోండి . మిగిలిన పాటలన్నీ హిట్టయినా అవన్నీ కాస్త రొటీనువే .
సినిమాలో వాణిశ్రీ హీరో పక్కన హీరోయిన్ అయినా , అసలు కధానాయిక సావిత్రే . ఆవిడ , మరిది దిద్దిన జమీందారు గారి సంసారం అన్న మాట . జమీందారుగా నాగభూషణం , నకిలీ స్వాముల్ని సైతం నమ్మే మూఢభక్తురాలిగా సూరేకాంతం , దారి తప్పిన జమీందారు పెద్దకొడుకుగా జగ్గయ్య , ఆయన స్టెప్నీగా విజయలలిత , నకిలీ బాబాగా సత్యనారాయణ , బేవార్స్ ఇంటల్లుడుగా పద్మనాభం , అతని భార్యగా సంధ్యారాణి నటించారు . ఇతర పాత్రల్లో రేలంగి , కె వి చలం , రమణమూర్తి , రాజబాబు , నాగయ్య , త్యాగరాజు ప్రభృతులు నటించారు .
NTR కు ఉత్తమ నటుడిగా , సినిమాకు వెండి నంది పురస్కారాలు లభించాయి . ఉమ్మడి కుటుంబం వంటి గొప్ప సినిమా కాకపోయినా జనానికి బాగా ఎక్కింది . తా వలచింది రంభ ; తా మునిగింది గంగ లాగా జనం మెచ్చిందే హిట్ , సూపర్ హిట్ . ఇప్పుడు మనం ఓట్లు వేస్తున్నట్లే . ఓట్లొచ్చినోడు మహా నాయకుడు , రానోడు అసెంబ్లీకి కూడా రాడు . ఇదే సంగతి . ఇదే సంగతి .

మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . ఎందుకనో యూట్యూబులో కనిపించలేదు . కొన్ని పాటల వీడియోలు మాత్రం ఉన్నాయి . ఎప్పుడయినా టి విలో వస్తే చూడటమే . #తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #telugumovies #telugucinema

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • జామురాతిరి జాబిలమ్మా… అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా…
  • పింక్ దొర దాస్యం వదిలేస్తే… తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు…
  • చమురు మంటల నేపథ్యంలో… నాటి రామర్ పిళ్లై బాపతు ఓ జ్ఞాపకం…
  • యోగీ, హిమంత ‘బుల్‌డోజర్’ బాటలో… బెంగాలీ సువేందు అధికారి…
  • రాజకీయ విమర్శల్లో ఘాటు వోకే… కానీ జాతుల్ని కించపరచడం దేనికి..?
  • ప్రళయ్..! ఇక ప్రేక్షకులందరి చూపూ ఈ కొత్త సినిమాపైనే..!
  • ఇరాన్‌లో చిక్కుకున్న అమెరికన్ పైలట్‌ను కాపాడింది ఇదేనా..?!
  • ఏడేళ్ల ‘బాలీవుడ్ బాద్‌షా’ పీఠానికి ఎసరు..! తొలిసారి రణబీర్‌కు కిరీటం..!
  • కొబ్బరి బొండాం..! అప్పట్లో కామెడీ హీరో అంటే ఓన్లీ రాజేంద్ర ప్రసాద్..!
  • అర్చకుల విదేశీ ప్రయాణాలు నిషిద్ధమా..? శృంగేరీ చెప్పిందే ఆగమమా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions